అన్వేషించండి

Thalapathy 68: నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్న ధోనీ, విజయ్ చిత్రంలో విలన్ పాత్ర?

ఇప్పటికే సినిమా రంగంలోకి ఎంట్రి ఇచ్చిన ధోని నటుడిగా తెరపై కనిపించబోతున్నాడు. విజయ్ దళపతి సినిమాతో వెండితెరపై అడుగు పెట్టబోతున్నారు. తొలి మూవీలోనే విలన్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

టీమిండియా మాజీ కెప్టెన్ గా క్రికెట్ ప్రపంచానికి పరిచయమైన ఎంఎస్ ధోని, రీసెంట్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఓ నిర్మాణ సంస్థను స్థాపించి చిత్రాలను నిర్మిస్తున్నారు. ధనా ధన్ షాట్లతో జార్ఖండ్ డైనమైట్ గా గుర్తింపు తెచ్చుకున్న ధోని, 2020లో క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నారు. జట్టు కెప్టెన్ గా ఉంటూ ముందుకు నడిపిస్తున్నారు. రీసెంట్ ఆయనకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్రికెటర్ నుంచి నటుడిగా మారబోతున్నట్లు తెలుస్తోంది.విజయ్ దళపతి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

‘లియో’ మూవీలో విజయ్ బిజీ

ప్రస్తుతం విజయ్ దళపతి లియో సినిమాలో నటిస్తున్నారు.  లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ ప్రత్యర్థి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా కనిపించనున్నది. అర్జున్ సర్జా, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం సమకూరుస్తున్నారు. లలిత్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 

విజయ్ దళపతి సినిమాలో ధోని కీలక పాత్ర!

‘లియో’ సినిమా కంప్లీట్ కాగానే దర్శకుడు వెంకట్‌ ప్రభుతో కలిసి విజయ్ ఓ సినిమా చేయబోతున్నారు. Thalapathy 68 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలో సెట్‌ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్‌ సరసన నటి జ్యోతిక నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఆయన విలన్ పాత్ర చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా, త్వరలోనే ఈ వార్తలపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందించనున్నారు.     

ఇప్పటికే నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన ధోని

రీసెంట్ గా ధోని సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. 'లెట్స్ గెట్ మ్యారేజ్(LGM)' అనే తమిళ సినిమాను నిర్మించారు. అటు ధోని నటుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టే అవకాశం ఉందని ఇప్పటికే ఆయన భార్య సాక్షి తెలిపారు. మంచి కథ, సందేశం ఉన్న క్యారెక్టర్ వస్తే తప్పకుండా చేస్తారని చెప్పారు. విజయ్ సినిమాలో ధోని కనిపించబోతున్నాడనే వార్తలతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.   

Read Also: ‘డాన్ 3’ హీరోగా రణ్ వీర్ సింగ్ - కాస్త భయంగా ఉందన్న దర్శకుడు ఫర్హాన్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget