Kalki 2989 AD Movie: ప్రభాస్ 'కల్కి' సినిమాలో మరో హీరోయిన్?
Guest roles in Prabhas Kalki 2989 AD movie: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో అతిథి పాత్రలు చేస్తున్న స్టార్స్ జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. లేటెస్టుగా హీరోయిన్ పేరు వినబడుతోంది.
Mrunal Thakur in Prabhas Kalki?: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కల్కి 2989 ఏడీ'. ఇందులో హీరోయిన్ ఎవరు? అంటే... దీపికా పదుకోన్. ఆమెకు తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమా కూడా ఇది. ఇంతకు ముందు జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఒక సినిమాలో సాంగ్ చేశారు. కానీ, అది విడుదల కాలేదు. దీపికా పదుకోన్ కాకుండా మరొక హీరోయిన్ కూడా ఉన్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జోడీగా 'లోఫర్' సినిమాలో నటించిన దిశా పటానీ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే... 'కల్కి'లో మరో హీరోయిన్ కూడా ఉన్నారట!
'కల్కి'లో అతిథి పాత్రలో మృణాల్ ఠాకూర్!
'సీతా రామం'తో తెలుగు చిత్రసీమకు పరిచయమైన హిందీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. 'హాయ్ నాన్న'లో ఆమె నటనకూ మంచి పేరు వచ్చింది. 'కల్కి'లో ఆవిడ అతిథి పాత్రలో సందడి చేస్తారని సమాచారం.
'సీతా రామం' చిత్రాన్ని నిర్మించిన వైజయంతి మూవీస్ సంస్థే 'కల్కి' సినిమానూ ప్రొడ్యూస్ చేస్తోంది. పైగా, పాన్ ఇండియా రెబల్ స్టార్ సినిమా! ఇక మృణాల్ 'నో' అని చెప్పడానికి కారణం ఏముంటుంది? నాగ్ అశ్విన్ చెప్పిన అతిథి పాత్ర తనకు నచ్చడంతో 'ఎస్' అన్నారట. ఈ వేసవిలో విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్'తో ఆమె ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Also Read: నాకు నేను విపరీతంగా నచ్చా - 'ఈగల్'పై మాస్ మహారాజా కాన్ఫిడెన్స్ చూస్తుంటే...
దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కూడా!
'కల్కి' సినిమాకు ప్రభాస్ కటౌట్ చాలు! ఆయనకు పాన్ ఇండియా, వరల్డ్ స్థాయిలో క్రేజ్ ఉంది. అయితే... అతిథి పాత్రలకు యంగ్ హీరోలు, హీరోయిన్లను తీసుకోవడం ద్వారా దర్శకుడు నాగ్ అశ్విన్ మరింత క్రేజ్ తీసుకు వస్తున్నారు. మలయాళ స్టార్, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన దుల్కర్ సల్మాన్... రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సైతం 'కల్కి'లో అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారు.
దర్శకుడిగా నాగ్ అశ్విన్ తొలి సినిమా 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో విజయ్ దేవరకొండ నటించారు. ఆయన రెండో సినిమా 'మహానటి'లో దుల్కర్ సల్మాన్ హీరో. వాళ్లిద్దరితో మూడో సినిమాలో అతిథి పాత్రలు చేయిస్తుండటం విశేషం.
లెజెండరీ నటుల పాత్రలు ఎలా ఉంటాయో?
'కల్కి' సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్... లెజెండరీ నటులు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ పాత్రలు ఎలా ఉంటాయో అని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. తమిళ నటుడు పశుపతి కూడా సినిమాలో ఓ రోల్ చేశారు.
వైజయంతి మూవీస్ సంస్థకు భారీ విజయాలు అందించిన తేదీన 'కల్కి 2989 ఏడీ' థియేటర్లలో విడుదల అవుతోంది. మే 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 'జగదేకవీరుడు అతిలోక సుందరి', నాగ్ అశ్విన్ తీసిన 'మహానటి' సినిమాలు ఆ రోజు విడుదలైన సంగతి తెలిసిందే.
Also Read: రజనీకాంత్ గెస్ట్ అప్పియరెన్స్ కాస్ట్లీ గురూ - నిమిషానికి కోటిన్నర!?