అన్వేషించండి

Ravi Teja: నాకు నేను విపరీతంగా నచ్చా - 'ఈగల్'పై మాస్ మహారాజా కాన్ఫిడెన్స్ చూస్తుంటే...

Eagle movie review: 'ఈగల్' ఫిబ్రవరి 9న విడుదల కానుంది. మరి, ఈ సినిమా గురించి మాస్ మహారాజా రవితేజ ఏం చెప్పారో చదవండి!

'మార్గశిర మధ్యరాత్రి ఆ మొండి మోతుబరి చేసిన మారణ హోమం వినాలి' - మాస్ మహారాజా రవితేజ క్యారెక్టర్ గురించి 'ఈగల్'లో నవదీప్ చెప్పిన డైలాగ్ ఆ ట్రైలర్ మొత్తానికి హైలైట్ అయ్యింది. మరి, సినిమా ఎలా ఉండబోతుంది? తెలియాలి అంటే ఈ శుక్రవారం వరకు వెయిట్ చేయాలి. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన 'ఈగల్' శుక్రవారం విడుదల అవుతోంది. మరి, ఈ సినిమా గురించి ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ ఏం చెప్పారు? ఆయన రివ్యూ ఎలా ఉందో? చదవండి. 

నాకు నేను విపరీతంగా నచ్చాను - రవితేజ
'ఈగల్' సినిమాలో తన గెటప్ తనకు బాగా నచ్చిందని రవితేజ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''నాకు నేను విపరీతంగా నచ్చాను. ఆ గెటప్ కోసం రెండు మూడు నెలలు పట్టింది. సిల్వర్ స్క్రీన్ మీద చూడటం కోసం వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ ఇటువంటి మేకోవర్ ట్రై చేశా. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. నేను వెయిటింగ్... ఫ్యాన్స్, ఆడియన్స్ రియాక్షన్ చూడటం కోసం! నేను కూడా వెయిటింగ్! ఎందుకంటే... నేను అవుట్ డోర్ షూటింగ్ నుంచి ఆదివారం ఉదయం హైదరాబాద్ వచ్చా. ఈసారి సౌండ్ తో కార్తీక్ ఘట్టమనేని నాకు సినిమా చూపించబోతున్నాడు. మా మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాంద్ మీద దర్శకుడికి విపరీతమైన నమ్మకం. అతడు రాక్ స్టార్. అతను చేసిన రీ రికార్డింగ్ ఆల్మోస్ట్ విన్నాను. ఫైనల్ మిక్సింగ్ వినబోతున్నా. అతను ఇంకా మరిన్ని సినిమాలు చేయాలి'' అని చెప్పారు.

కథ నడిపించేది అనుపమ క్యారెక్టర్!
'ఈగల్' సినిమాలో ఇద్దరు అందాల భామలు అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్ నటించారు. వాళ్లిద్దరి గురించి రవితేజ మాట్లాడుతూ... ''సినిమాలో కథ నడిపించేది అనుపమ క్యారెక్టర్. ఆ అమ్మాయి ద్వారా సినిమా మొత్తం నడుస్తుంది. ఇంకో నాలుగు రోజుల్లో ప్రేక్షకులకు క్లారిటీ వస్తుంది. కావ్యా థాపర్ లవ్లీ క్యారెక్టర్ చేసింది. విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్'' అని చెప్పారు. సినిమా సక్సెస్ అయ్యి కార్తీక్ ఘట్టమనేనికి చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నానని రవితేజ ఆకాంక్షించారు.  

ఆ చిన్నారి పాత్రతో చిన్న పిల్లలు కనెక్ట్ అవుతారు!
'ఈగల్' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ధృవన్ ఒక క్యారెక్టర్ చేశారు. అతని పాత్రతో చిన్న పిల్లలు కనెక్ట్ అవుతారని రవితేజ చెప్పారు. అంతకు మించి చెప్పడం తనకు ఇష్టం లేదని, సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు అర్థం అవుతుందని ఆయన పేర్కొన్నారు. మణిబాబు కరణం డైలాగులు మామూలుగా లేవు, అతని గురించి చాలాసార్లు చెప్పానని, ఇప్పుడు ప్రేక్షకులు సినిమా చూసి చెబుతారని రవితేజ తెలిపారు. తన టాలెంట్ ఈ సినిమాతో బయట పడుతుందని ఆయన పేర్కొన్నారు.

Also Read: రజనీకాంత్ గెస్ట్ అప్పియరెన్స్ కాస్ట్లీ గురూ - నిమిషానికి కోటిన్నర!?

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తనకు హోమ్ బ్యానర్ లాంటిదని రవితేజ చెప్పారు. తనతో ఎన్ని సినిమాలు చేయడానికి అయినా టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గారు రెడీ అంటున్నారని, వాళ్లిద్దరూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారని, లోపల ఒకటి బయట మరొకటి ఉండదని, తాను కూడా వాళ్లతో మరిన్ని సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నానని రవితేజ తెలిపారు.

Also Read: నేహా శెట్టికి మరో ఆఫర్ - పవన్ కళ్యాణ్ దర్శకుడి కొత్త సినిమాలో!

టాప్ హెడ్ లైన్స్

Archana Jois: తెలుగు సినిమాలో హీరోయిన్‌గా 'కేజీఎఫ్' మదర్... వీవీ వినాయక్ ముఖ్య అతిథిగా సినిమా ప్రారంభం
తెలుగు సినిమాలో హీరోయిన్‌గా 'కేజీఎఫ్' మదర్... వీవీ వినాయక్ ముఖ్య అతిథిగా సినిమా ప్రారంభం
Sandeep Reddy Vanga On Raptadu Case: రాప్తాడు ఘటనపై సందీప్ రెడ్డి వంగా రియాక్షన్... సినిమాలను టార్గెట్ చేయవద్దు
రాప్తాడు ఘటనపై సందీప్ రెడ్డి వంగా రియాక్షన్... సినిమాలను టార్గెట్ చేయవద్దు
Tabu In King 100: మహంతి ఝాన్సీ రాణి అనే నేను... నాగార్జున 'కింగ్ 100'లో పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా టబు - గ్లింప్స్ చూశారా?
మహంతి ఝాన్సీ రాణి అనే నేను... నాగార్జున 'కింగ్ 100'లో పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా టబు - గ్లింప్స్ చూశారా?
Srinath Maganti: శ్రీనాథ్ మాగంటి బెటరా? సుశాంతే బాగా చేశాడా? 'ఈఎన్ఈ 2' ట్రైలర్‌తో డిస్కషన్ షురూ
శ్రీనాథ్ మాగంటి బెటరా? సుశాంతే బాగా చేశాడా? 'ఈఎన్ఈ 2' ట్రైలర్‌తో డిస్కషన్ షురూ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget