అన్వేషించండి

Mrunal Thakur: ఆ బాధను స్వయంగా అనుభవించా, నిజంగానే ఏడ్చేశాను - ‘హాయ్ నాన్న’పై మృణాల్‌ కామెంట్స్

Mrunal Emotional on 'Hi Naana sets': మృణాల్‌ ఠాకూర్‌.. సీతగా, యశ్నాగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనుసులు దోచుకుంది. ఎంతోమందిని ఏడిపించేసింది ఆమె నటనతో.

Mrunal Thakur Emotional on 'Hi Naana sets': మృణాల్‌ ఠాకూర్‌.. 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మొదటిసినిమాతోనే ఎంతోమందిని ఫ్యాన్స్‌ని చేసేసుకుంది ఈ మరాఠి బ్యూటీ. చక్కటి చీరకట్టుతో అచ్చు తెలుగింటి అమ్మాయిలా కనిపించింది. ఇక ఆ తర్వాత 'హాయ్‌ నాన్న' సినిమాలో కూడా యశ్నాగా అందరి మనసులు దోచేసింది. ఎమోషనల్‌ సీన్లలో జివించేసింది. అందరితో కంటతడి పెట్టించింది. అయితే, కొన్ని సీన్లలో తాను స్వయంగా ఏడ్చానని, ఆ బాధ ఏంటో తనకు నిజంగానే అర్థం అయ్యిందని చెప్పింది మృణాల్‌. 

ఆ సీన్‌లో ఏడ్చేశాను.. 

'హాయ్‌ నాన్న' సినిమా ఎమోషనల్‌, ఫ్యామిలీ డ్రామా. దాంట్లోని చాలాసీన్లు థియేటర్‌లో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాయి. ఫాదర్‌ సెంటిమెంట్‌ ఉన్నవాళ్లు కచ్చితంగా ఈ సినిమాకి కనెక్ట్‌ అవుతారు. అయితే.. ఆ సినిమాలో యశ్నాగ మృణాల్‌ అందరినీ ఏడిపించేశారు. హాస్పిటల్‌లోని కొన్ని సీన్లు అయితే.. ప్రేక్షకుల మనసులను మెలిపెట్టేశాయి. వాటిల్లో ఒక సీన్‌ పాపకు ఉన్న జబ్బు గురించి తెలిసి మృణాల్‌కి తెలియడం. ఆ సీన్‌లో మృణాల్‌ సెట్స్‌లో ఏడ్చేశారట. దానికి కారణం ఆమె స్వయంగా ఆ పెయిన్‌ని భరించారని తెలిపింది.

"బిడ్డ జబ్బుతో పుట్టిందని తెలిసే హాస్పిటల్‌ సీన్‌లో చాలా ఎమోషనల్‌ అయ్యాను. నేను అమ్మను కాలేదు. కానీ, ఆ టైంలో ఏ అమ్మకి ఇలాంటి బాధపెట్టొద్దు దేవుడా అని ఆలోచించాను. అందుకే, అంతలా ఏడ్చేశాను. ఒక తల్లి భూకంపంలో బిడ్డను కోల్పోయి ఏడుస్తున్న వీడియో ఒకటి చూసి చలించిపోయాను. ఆ ఎమోషన్స్‌, ఫీలింగ్స్‌ ఆ సీన్‌లో కనిపించాయి. సీన్‌లో ఉన్న డెప్త్ నా హార్ట్‌కి టచ్‌ అయ్యింది. నా జీవితంలో అదే చాలా కష్టమైన సీన్‌ అని నాకు అనిపించింది" అని ఆమె తన ఎక్స్‌పీరియెన్స్‌ చెప్పారు. 

ఎమోషనల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన 'హాయ్‌ నాన్న' ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. హీరో నాని యాక్షన్‌తో పాటు యశ్నగా మృణాల్‌ యాక్టింగ్‌ సూపర్‌. ఇక ఈ సినిమాకి పెద్ద అసెట్‌ చిన్నపాపగా చేసిన కియారా ఖన్నా. ఆ చిన్నారి యాక్టింగ్‌ స్కిల్స్‌కి ప్రశంసల వర్షం కురిసింది. ఇక ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీలో ' హాయ్‌ పాపా' పేరుతో రిలీజైన ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 

ఇక మృణాల్‌ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నారు. విజయ దేవరకొండతో కలిసి 'ఫ్యామిలీ స్టార్‌' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో తాను ఏడిపించను అని, కేవలం ఎంటర్‌టైన్మెంట్‌ మాత్రమే ఉంటుందని, తనని కొత్తగా చూస్తారని అన్నారు మృణాల్‌. 'ఫ్యామిలీ స్టార్‌' సంబంధించి షూటింగ్‌ కూడా శరవేగంగా సాగుతోందని, ఈ సినిమాలో పాటలు, డ్యాన్స్‌లు అన్నీ ఉంటాయని చెప్పారు మృణాల్‌. ఇక ఆమె హిందీలో నటించిన 'పూజా మేరీ జాన్‌' చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, హిందీలో తనకు లవ్‌స్టోరీలు అవకాశం రావడం లేదని, తనని ఇంకా గుర్తించలేదని ఆమె కొన్ని ఇంటర్వూల్లో చెప్పారు.

Also Read: ఆ స్టార్‌ హీరోతో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెళ్లి - నిజమెంత?

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget