అన్వేషించండి

Mr Beast: ‘టీ సిరీస్’ సంస్థను వెనక్కి నెట్టిన 26 ఏళ్ల యూట్యూబర్ - కంగ్రాట్స్ చెప్పిన ఎలన్ మస్క్

Mr Beast: 26 ఏళ్ల యూట్యూబర్ జిమ్మీ డోనాల్డ్సన్‌కు చెందిన ‘మిస్టర్ బీస్ట్’ అనే యూట్యూబ్ ఛానెల్.. ‘టీ సిరీస్’లాంటి పాపులర్ బాలీవుడ్ మ్యూజిక్ ఛానెల్‌ను సైతం వెనక్కి నెట్టింది.

Mr Beast Surpasses T Series: యూట్యూబ్‌లో ఎప్పటికప్పుడు ఏ ఛానెల్‌కు ఎక్కువమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు అనేదానిపై పోటీ జరుగుతూ ఉంటుంది. కానీ చాలాకాలం ఈ పోటీలో ‘టీ సిరీస్’ ఛానెల్ మొదటి స్థానాన్ని దక్కించుకుంటోంది. ఇక ఇప్పుడు ఒక 26 ఏళ్ల యూట్యూబర్ ‘టీ సిరీస్’లాంటి సంస్థను వెనక్కి నెట్టి అత్యధిక సబ్‌స్క్రైబర్లను దక్కించుకున్న ఛానెల్‌గా టాప్ స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా టెక్ వరల్డ్‌లో కూడా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. జిమ్మీ డోనాల్డ్సన్ అనే యూట్యూబర్ ప్రారంభించిన ‘మిస్టర్ బీస్ట్’ అనే ఛానెల్ సబ్‌స్క్రైబర్ల విషయంలో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది.

నిర్మాతలుగా సక్సెస్..

తన ‘మిస్టర్ బీస్ట్’ ఛానెల్.. ‘టీ సిరీస్’ ఛానెల్ సబ్‌స్క్రైబర్ల కౌంట్‌ను దాటేసింది అంటూ సంతోషంగా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు జిమ్మీ డోనాల్డ్సన్. సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ఛానెలే ‘టీ సిరీస్’. ఈ సంస్థ ఓనర్ భూషణ్ కుమార్. 1997లో లెజెండరీ మ్యూజిక్ సెన్సేషన్ గుల్షన్ కుమార్ మృతి తర్వాత తన కుమారుడు భూషణ్ కుమార్ చేతికి ‘టీ సిరీస్’ బాధ్యతలు వచ్చాయి. ఇక ఆల్బమ్ సాంగ్స్ అనేవి ట్రెండ్ అవ్వడం మొదలయిన తర్వాత వాటిని నిర్మించడం మొదలుపెట్టింది ఈ సంస్థ. పాటలు మాత్రమే కాదు.. బాలీవుడ్‌లో ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలను కూడా నిర్మించింది టీ సిరీస్.

వేగంగా దూసుకొచ్చాడు..

ఎన్నో ఏళ్లుగా యూట్యూబ్‌లోని అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానెల్‌గా ‘టీ సిరీస్’ రికార్డ్ సాధిస్తూ వస్తోంది. 2021లో 200 మిలియన్ సబ్‌స్క్రైబర్లను అందుకున్న మొదటి యూట్యూబ్ ఛానెల్‌గా ‘టీ సిరీస్’ నిలిచింది. అప్పటికే ‘మిస్టర్ బీస్ట్’ ఛానెల్‌తో జిమ్మీ డోనాల్డ్సన్ కూడా పాపులర్ అయ్యాడు. 2023 అక్టోబర్‌లో తాను కూడా 200 మిలియన్లు సబ్‌స్క్రైబర్లను సాధించి చూపించాడు. 2024 ఏప్రిల్ వచ్చేసరికి ఈ 26 ఏళ్ల యూట్యూబర్.. 250 మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మార్క్‌ను దాటేశాడు. అత్యంత వేగంగా అత్యధిక సబ్‌స్క్రైబర్లను సాధించిన యూట్యూబర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు జిమ్మీ. తాజాగా తను షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లో ‘టీ సిరీస్’ కంటే తన ఛానెల్‌కే ఎక్కువమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నట్టు తెలుస్తోంది.

కంగ్రాట్స్..

జిమ్మీ డోనాల్డ్సన్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లో ‘టీ సిరీస్‌’ కంటే ‘మిస్టర్ బీస్ట్’ ఛానెల్‌కే 1,608 మంది సబ్‌స్క్రైబర్లు ఎక్కువ ఉన్నారు. దీంతో తన ఫ్యాన్స్ అంతా తనకు కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు. కాసేపట్లోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎలన్ మస్క్ సైతం జిమ్మీకి కంగ్రాట్స్ తెలిపాడు. దీంతో మిస్టర్ బీస్ట్ ఛానెల్‌పై మీమ్స్ కూడా మొదలయ్యాయి. సబ్‌స్క్రైబర్ల విషయంలో తానే టాప్ స్థానానికి చేరుకుంటానని పలుమార్లు ఛాలెంజ్ చేశాడు జిమ్మీ డోనాల్డ్సన్. ఫైనల్‌గా తను అనుకున్నది సాధించాడని ఫ్యాన్స్ సంతోషంగా ఫీలవుతున్నారు.

Also Read: విజువల్‌ వండర్‌గా ఆకట్టుకుంటున్న 'ఇంద్రాణి' ట్రైలర్‌ - వందేళ్ల తర్వాత టెక్నాలజీ ఎలా ఉండబోతుందో తెలుసా..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు - ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమం
ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు - ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమం
Bandi Sanjay: తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
Telangana Local Elections:  తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
రాపిడో డ్రైవర్  ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
రాపిడో డ్రైవర్ ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
Advertisement

వీడియోలు

Car Driver Attack RTC Driver | కారుకు దారివ్వలేదని బస్ డ్రైవర్‌పై దాడి | ABP Desam
Mukhi Cheetah Given birth Five Cubs | ఫలించిన ప్రాజెక్ట్ చీతా...కునో నేషనల్ పార్క్ లో సంబరాలు | ABP Desam
Shivanasamudra Elephant Rescue | ఏనుగును కాపాడే రెస్క్యూ ఆపరేషన్ చూశారా.? | ABP Desam
అతను పేపర్ కెప్టెన్ అంతే..  ధోనీ, రుతురాజ్‌పై కైఫ్ షాకింగ్ కామెంట్స్
బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన గిల్.. మరి పనిష్మెంట్ లేదా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు - ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమం
ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు - ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమం
Bandi Sanjay: తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
తెలంగాణలో ఆర్కే పాలన కొనసాగుతోందన్న బండి సంజయ్ - ఇంతకీ ఆర్కే ఎవరో తెలుసా?
Telangana Local Elections:  తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
తెలంగాణలో మూడు దశల్లో లోకల్ ఎన్నికలు - వారంలో షెడ్యూల్ - ఎస్‌ఈసీ సన్నాహాలు
రాపిడో డ్రైవర్  ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
రాపిడో డ్రైవర్ ఆదాయం నెలకు లక్ష...విషయం తెలిసి అవాక్కైన కస్టమర్..
Will KTR arrest: ఫార్ములా ఈ కేసులో  KTR ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్ అనుమతి - అరెస్టు చేసే అవకాశం ఉందా?
ఫార్ములా ఈ కేసులో KTR ప్రాసిక్యూషన్‌కు తెలంగాణ గవర్నర్ అనుమతి - అరెస్టు చేసే అవకాశం ఉందా?
UP twin marriages: ఒకే నెలలో రెండు పెళ్లిళ్లు -  భార్యలకు తెలిసిపోయింది -ఇక ఆ భర్త పరిస్థితి ఏంటో తెలుసా?
ఒకే నెలలో రెండు పెళ్లిళ్లు - భార్యలకు తెలిసిపోయింది -ఇక ఆ భర్త పరిస్థితి ఏంటో తెలుసా?
Nepal Gen Z: నేపాల్‌లో మళ్లీ అంటుకున్న జెడ్Z ఆవేశం - పలు చోట్ల కర్ఫ్యూ
నేపాల్‌లో మళ్లీ అంటుకున్న జెడ్Z ఆవేశం - పలు చోట్ల కర్ఫ్యూ
Temple Fire: భక్తితో వెలిగించిన దీపం ఆలయాన్ని బుగ్గి చేసింది - జాగ్రత్త లేని భక్తి - వీడియో వైరల్
భక్తితో వెలిగించిన దీపం ఆలయాన్ని బుగ్గి చేసింది - జాగ్రత్త లేని భక్తి - వీడియో వైరల్
Embed widget