అన్వేషించండి

August 15 Releases: ఒక్క రోజే 4 సినిమాలు - బాక్సాఫీస్‌ను బద్దలకొట్టేది ఎవరో!

ఇండిపెండెన్స్ డే సందర్భంగా పలు సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. వాటిలో మూడు సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొనబోతోంది. ఇంతకీ ఆ సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

Aug 15 Movie Releases: స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ కూడా తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు రెడీ అవుతోంది. తెలుగు సినిమాలు, డబ్బింగ్ చిత్రంతో పోటీ ఎదుర్కొనబోతున్నాయి. ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు ఏవి? ఏ సినిమాల మధ్య పోటీ నెలకొన్నది? అనేది ఇప్పుడు చూద్దాం.

1. డబుల్ ఇస్మార్ట్

ఆగష్టు 15న బరిలోకి దిగే పెద్ద చిత్రాలలో ముఖ్యమైన సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యంగ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. గ్లామర్ బ్యూటీ కావ్యా థాపర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలంగాణ స్లాంగ్ డైలాగులు, అదిరిపోయే డ్యాన్సులతో హై మసాలా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు పూరి, ఛార్మి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. పూరి, రామ్ కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

2. మిస్టర్ బచ్చన్

మాస్ మహరాజా రవితేజ హీరోగా భాగ్యశ్రీ  బోర్సే హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ హిట్ మూవీ ‘రైడ్’కు రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ ఇన్ కం టాక్స్ అధికారిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

3. ఆయ్

నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆయ్’. ఈ మూవీ  GA2 పిక్చర్స్ బ్యానర్‌ లో అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని అంజి కె మణిపుత్ర తెరకెక్కించారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా ఆగస్టు 15న విడుదలకానుంది. పెద్ద చిత్రాలతో ఈ మూవీ పోటీ పడుతోంది.

4. తంగలాన్

అటు తమిళంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘తంగలాన్’. తమిళ స్టార్ హీరో విక్రమ్, పా రంజిత్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కింది. మాళవిక మోహనన్ ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ పోషించింది. కేజీఎఫ్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

మొత్తంగా ఆగష్టు 15 సందర్భంగా నాలుగు చిత్రాలు పోటీ పడుతుండగా, ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’ సినిమాల మధ్య పోటా పోటీ ఉండబోతోంది. ‘తంగలాన్’ కూడా ఈ రెండు చిత్రాలకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రేక్షకులు ఏ చిత్రాన్ని ఆదరిస్తారు? అనే విషయం రేపు తేలనుంది.  

Read Also: మూవీలో అమితాబ్, రేఖా ఫొటోలపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం - ‘మిస్టర్ బచ్చన్’ మేకర్స్‌కు ఊహించని షాక్

Also Read: ఆ డైరెక్టర్‌తో సమంత రిలేషన్‌లో ఉందా? - నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్‌తో వైరల్‌ అవుతున్న సామ్‌ డేటింగ్‌ రూమర్స్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Boat Politics : ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రావడం కుట్రే  - ఈ కేసు జగన్  దగ్గరకే వెళ్తోందా ?
ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రావడం కుట్రే - ఈ కేసు జగన్ దగ్గరకే వెళ్తోందా ?
East Godavari : జీడిగింజల బస్తాల్లో ఇరుక్కొని ఏడుగురు మృతి-తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
జీడిగింజల బస్తాల్లో ఇరుక్కొని ఏడుగురు మృతి-తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Weather Latest Update: తీరం దాటిన తీవ్ర వాయుగుండం, నేడు ఏపీలో భారీ వర్షాలు - ఐఎండీ
తీరం దాటిన తీవ్ర వాయుగుండం, నేడు ఏపీలో భారీ వర్షాలు - ఐఎండీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Devara Part 1 Trailer Reaction | ధైర్యాన్ని చంపేసే భయం..దేవరగా తారక్ ప్రభంజనం | ABP DesamAttack on pedakurapadu Ex MLA | పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేపై దాడి | ABP DesamVamsadhara Flood Gotta Barrage | భారీ వర్షాలతో వంశధారకు పోటెత్తుతున్న వరద | ABP Desamఅనంత్, రాధికల పెళ్లిలోని వినాయకుడు ఇప్పుడు హైదరాబాద్‌లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Boat Politics : ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రావడం కుట్రే  - ఈ కేసు జగన్  దగ్గరకే వెళ్తోందా ?
ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రావడం కుట్రే - ఈ కేసు జగన్ దగ్గరకే వెళ్తోందా ?
East Godavari : జీడిగింజల బస్తాల్లో ఇరుక్కొని ఏడుగురు మృతి-తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
జీడిగింజల బస్తాల్లో ఇరుక్కొని ఏడుగురు మృతి-తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
Chakali Ilamma University: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు - సీఎ రేవంత్ రెడ్డి
Weather Latest Update: తీరం దాటిన తీవ్ర వాయుగుండం, నేడు ఏపీలో భారీ వర్షాలు - ఐఎండీ
తీరం దాటిన తీవ్ర వాయుగుండం, నేడు ఏపీలో భారీ వర్షాలు - ఐఎండీ
Safety Precautions of Mpox Virus : ఇండియాకు వచ్చేసిన Mpox.. అశ్రద్ధగా ఉంటే వైరస్ వ్యాప్తి తప్పదు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఇండియాకు వచ్చేసిన Mpox.. అశ్రద్ధగా ఉంటే వైరస్ వ్యాప్తి తప్పదు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Jabardasth New Judge: 'జబర్దస్త్'కు కొత్త జడ్జి... పోతానన్నయ్యా పోతాను - వచ్చీ రావడమే పంచ్‌లతో చెలరేగిన శివాజీ
'జబర్దస్త్'కు కొత్త జడ్జి... పోతానన్నయ్యా పోతాను - వచ్చీ రావడమే పంచ్‌లతో చెలరేగిన శివాజీ
Devara Trailer: దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
దేవర ట్రైలర్ వచ్చేసిందోచ్.. ఎన్టీఆర్ నట విశ్వరూపం, గూస్ బంప్స్ తెప్పించే హీరోయిజం
Paris Paralympics 2024: పతక విజేతలకు కేంద్రం నజరానా , ఇక టార్గెట్ 2028పై దృష్టి
పతక విజేతలకు కేంద్రం నజరానా , ఇక టార్గెట్ 2028పై దృష్టి
Embed widget