Mowgli 2025 Tickets Price: 'మోగ్లీ' టికెట్ రేటు 99 రూపాయలే... 'రాజు వెడ్స్ రాంబాయి' రూటులో సుమ తనయుడి సినిమా
Mowgli 2025 release date: సందీప్ రాజ్ దర్శకత్వంలో సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా నటించిన సినిమా 'మోగ్లీ'. సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు రూ 99గా నిర్ణయించారు.

మల్టీప్లెక్స్ స్క్రీన్లలో టికెట్ రేటుతో పాటు పాప్ కార్న్, స్నాక్స్ ధరలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలు తక్కువ టికెట్ రేటుతో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. వంద రూపాయలకు సినిమా చూడమని ఆఫర్లు పెడుతున్నాయి. ఆ లిస్టులో ప్రముఖ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ హీరోగా నటించిన 'మోగ్లీ 2025' చేరింది.
99 రూపాయలకు 'మోగ్లీ 2025!
నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ 'కలర్ ఫోటో' దర్శకుడు సందీప్ రాజ్ తీసిన తాజా సినిమా 'మోగ్లీ 2025'. ఇందులో రోషన్ కనకాల కథానాయకుడు. ఆయన జంటగా సాక్షి మడోల్కర్ కథానాయికగా నటించారు. యాంటీ హీరోగా బండి సరోజ్ కుమార్ పవర్ ఫుల్ రోల్ చేశారు. డిసెంబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఒక్క రోజు ముందు... అంటే డిసెంబర్ 12వ తేదీన ప్రీమియర్ షోలు ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు.
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేటు 99 రూపాయలుగా నిర్ణయించారు. అంటే వంద రూపాయలు అన్నమాట. దీని వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది.
Also Read: Annagaru Vostaru Postponed: అన్నగారికి ఫైనాన్షియల్ ఇష్యూస్... కార్తీ సినిమా విడుదల కూడా వాయిదా!
View this post on Instagram
'రాజు వెడ్స్ రాంబాయి' ఫార్ములా!
ఇటీవల 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా టికెట్ రేటును సైతం 99 రూపాయలకు విక్రయించారు. అది సక్సెస్ అయ్యింది. మొదటి మూడు రోజులు, ఆ తర్వాత విడతల వారీగా ఆఫర్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ ఫార్ములాను 'మోగ్లీ 2025' టీమ్ ఫాలో అవుతోంది. 'రాజు వెడ్స్ రాంబాయి'ని విడుదల చేసిన 'బన్నీ' వాసు... ఈ నెల 25న హెబ్బా పటేల్ హారర్ థ్రిల్లర్ 'ఈషా'ను రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా టికెట్ రేటును సైతం రూ. 99గా నిర్ణయించారు. దానికీ ఆదరణ బావుంటే... మరిన్ని చిన్న సినిమాలు ఆ రూటులో వెళ్లే అవకాశం ఉంది.





















