Month Of Madhu: లవ్ బర్డ్స్‌కు ‘మంత్ ఆఫ్ మధు’ బంపర్ ఆఫర్ - ప్రేమికుల కోసం సీక్రెట్ స్క్రీనింగ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
చాలాకాలం తర్వాత కలర్స్ స్వాతి.. మళ్లీ వెండితెరపై యాక్టివ్ అయ్యింది. ‘మంత్ ఆఫ్ మధు’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కొందరు నటీనటులు చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఏడాదికి, రెండేళ్లకు ఒకసారి వెండితెరపై కనిపించినా.. వారిపై ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అలాంటి అభిమానులను సంపాదించుకున్న వారిలో కలర్స్ స్వాతి కూడా ఒకరు. ఒక హోస్ట్‌గా సినీ సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ.. తన కెరీర్‌ను ప్రారంభించింది స్వాతి. ఆ ప్రోగ్రామ్ పేరు కలర్స్ కావడంతో ఇప్పటికీ చాలామందికి తను కలర్స్ స్వాతిగానే గుర్తుండిపోయింది. వెండితెరపై హీరోయిన్‌గా ఎంటర్ అయిన తర్వాత వెంటవెంటనే సినిమాలు చేయాలని స్వాతి ఏమీ తొందరపడలేదు. అందుకే ఎప్పటికప్పుడు బ్రేక్స్ తీసుకుంటూ ఉంటుంది. చాలాకాలం తర్వాత స్వాతి ‘మంత్ ఆఫ్ మధు’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులకు ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది టీమ్.
సీక్రెట్ స్క్రీనింగ్..
‘మంత్ ఆఫ్ మధు’ కోసం మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఫస్ట్ లుక్ నుంచి టీజర్, ట్రైలర్.. ఇలా ప్రతీ అప్డేట్‌ను స్వయంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రెస్ మీట్స్, ఫ్యాన్ మీట్స్ లాంటివి ఏర్పాటు చేసి ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పైగా ఈ ప్రమోషన్స్ విషయంలో స్వాతి.. స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ‘మంత్ ఆఫ్ మధు’ కోసం స్వాతి చేసిన ప్రమోషనల్ వీడియోలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల విడాకులపై తను ఇచ్చిన స్టేట్‌మెంట్, కలర్స్ ప్రోగ్రామ్‌ను రీక్రియేట్ చేయడం.. ఇలా ఎక్కడ చూసినా స్వాతి హవానే కనిపిస్తోంది. దీంతో పాటు సీక్రెట్ స్క్రినింగ్స్ అంటూ కొత్తగా ‘మంత్ ఆఫ్ మధు’ను ప్రమోట్ చేస్తోంది మూవీ టీమ్.
ప్రేమించిన వారితో కలిసి..
‘మంత్ ఆఫ్ మధు’ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 6న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ప్రపంచమంతా ఆ సినిమాను చూసే ముందే సీక్రెట్ స్క్రీనింగ్స్ పేరుతో కొంతమందికి ప్రత్యేకంగా స్క్రీనింగ్స్‌ను ఏర్పాటు చేస్తోంది మూవీ టీమ్. అక్టోబర్ 5 సాయంత్రం కేవలం హైదరాబాద్, వైజాగ్‌లో మాత్రమే ఈ స్క్రీనింగ్స్ జరగనున్నాయి. ‘మీరు ప్రేమించిన వారితో కలిసి ఈ నిజమయిన ప్రేమకథను ఆస్వాదించండి’ అంటూ మూవీ టీమ్.. ఈ స్పెషల్ స్క్రీనింగ్స్ గురించి బయటపెట్టింది. కాకపోతే ‘మంత్ ఆఫ్ మధు’ స్పెషల్ స్క్రీనింగ్స్‌లో పాల్గొనాలంటే ఒక ఫార్మ్‌ను నింపాల్సి ఉంటుంది. ఈ ఫార్మ్ లింక్‌ను స్వాతి సైతం తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
View this post on Instagram
రెండోసారి కలిసి నటిస్తున్న నవీన్, స్వాతి..
‘మంత్ ఆఫ్ మధు’ చిత్రాన్ని శ్రీకాంత్ నగోతీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకుడు ఇంతకు ముందు నవీన్ చంద్రతో కలిసి ‘భానుమతి రామకృష్ణ’ అనే ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెరకెక్కించాడు. ఇప్పుడు మళ్లీ నవీన్ చంద్రతో కలిసి ‘మంత్ ఆఫ్ మధు’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ కోసం దర్శకుడు, హీరో మాత్రమే కాదు హీరో, హీరోయిన్ కూడా రెండోసారి కలుస్తున్నారు. స్వాతి, నవీన్ చంద్ర కలిసి ఇప్పటికే ‘త్రిపుర’ అనే సినిమాలో కలిసి నటించారు. ఆ మూవీ విడుదలైన ఇన్నాళ్ల తర్వాత ‘మంత్ ఆఫ్ మధు’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో మంజులా ఘట్టమనేని, శ్రేయ నావిలే కీలక పాత్రలో నటించారు.
Also read: ఇటలీ రోడ్లపై కార్ రేస్ - ‘స్వదేశ్’ మూవీ నటికి తీవ్ర గాయాలు, ఇద్దరు మృతి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial