News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Gayatri Joshi: ఇటలీ రోడ్లపై కార్ రేస్ - ‘స్వదేశ్’ మూవీ నటికి తీవ్ర గాయాలు, ఇద్దరు మృతి

Gayatri Joshi-Vikas Oberoi accident: స్వదేశ్ మూవీ లో షారుక్ ఖాన్ తో కలిసి నటించిన గాయత్రి జోష్. కార్ల పరేడ్‌లో జరిగిన ప్రమాదంలో బాలీవుడ్‌ నటికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరి మృతితో విషాదం నెలకొంది.

FOLLOW US: 
Share:

బాలీవుడ్ మూవీ ‘స్వదేశ్’ చిత్రంలో షారుక్ ఖాన్ తో కలిసి నటించిన యాక్టర్ గాయత్రి జోష్ ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ప్రమాదానికి గురైంది. నటి భర్త వ్యాపారవేత్త, వికాస్ ఒబెరాయ్ ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఇటలీలో విహారయాత్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సర్డినీయ సూపర్ కార్ ఎక్స్పీరియన్స్ సమయంలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. 

ఈ ప్రమాదం జరిగినప్పుడు నటి గాయత్రి ప్రయాణిస్తున్న  కారు మరో లగ్జరీ కారు ఫెరారీని, క్యాంపర్ వ్యాను ఢీ కొట్టింది. లంబర్ఘనినీ, ఫెరారీతో సహా ఇతర లగ్జరీ వాహనాలతో పాటు మినీ ట్రక్ ను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఫిరారీ కారులో ప్రయాణిస్తున్న స్విట్జర్లాండ్ జంట ప్రాణాలు కోల్పోయారు. మీడియా నివేదికల ప్రకారం, ఫెరారీ కార్లో మంటలు చెలరేగడంతో మిలిస్సా క్రౌట్లీ, మార్కస్ క్రౌట్లీ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వికాస్ ఒబెరాయ్ మేనేజర్ వివరాల ప్రకారం నటి గాయత్రి, వికాస్ జంట ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. 

మహారాష్ట్రలోని నాగ్ పూర్ ర్ లో జన్మించిన నాటి గాయత్రి జోషి వీడియో జాకీగా తన కెరీర్ ను ప్రారంభించారు. అడ్వర్టైజింగ్ మోడల్ గా కూడా గాయత్రి పని చేసింది. హన్స్ రాజ్ హన్స్ '  ఝుంజరియ, జగ్జిత్ సింగ్, ఖాగజ్ కి కష్టి' తో సహా అనేక మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ఆ తర్వాత ఫేమినా ఇండియా అందాల పోటీల్లో విజేతగా నిలవాలనే లక్ష్యంతో 2000లో ఫేమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ ను గెలుచుకుంది.  అలాగే మిస్ ఇంటర్నేషనల్ 2000 లో భారత్ కు ప్రాతినిధ్యం వహించింది. 

ఈ ప్రమాదంపై ఇటలీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గాయపడిన నటి గాయత్రి జోషి, ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ ఆరోగ్య పరిస్థితి పై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. గాయపడిన వీరిద్దరిని ప్రస్తుతం హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వికాస్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు.  ప్రస్తుతం ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇంకా ఎవరెవరు గాయ పడ్డారు? అనేది పోలీసుల వివరాలు?  నటి గాయత్రి జోషి ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

ఇక సినిమాల విషయానికొస్తే 2004లో ఆశితోష్ గోవారిఖర్ దర్శకత్వంలో వచ్చిన మూవీ 'స్వేడ్స్' నటించింది. 2005వ సంవత్సరంలో వికాస్ ఒబెరాయ్ ని పెళ్లాడి సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఇక వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. టాప్ ముంబై రియాల్టర్, ఒబెరాయ్ రియాల్టీ ఎండీ వికాస్ ఒబేరాయ్. ఫోర్బ్స్ అతని నికర విలువ 3.8 బిలియన్ల డాలర్లుగా అంచనా వేసింది. 

Published at : 04 Oct 2023 04:34 PM (IST) Tags: Italy Car Accident gayatri joshi billionaire vikas oberoi

ఇవి కూడా చూడండి

Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!

Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ

Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సలార్, డంకీ తో పాటూ 'దేవర' కూడా?

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సలార్, డంకీ తో పాటూ 'దేవర' కూడా?

Renu Desai : అంకుల్ మీకు ఇంత వయసొచ్చింది, ఇదేనా మీ అనుభవం - సీనియర్ జర్నలిస్టుపై రేణు దేశాయ్ ఆగ్రహం

Renu Desai : అంకుల్ మీకు ఇంత వయసొచ్చింది, ఇదేనా మీ అనుభవం - సీనియర్ జర్నలిస్టుపై రేణు దేశాయ్ ఆగ్రహం

టాప్ స్టోరీస్

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?

Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?

Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?

Telangana BJP : ఎమ్మెల్యేలుగా ప్రమాణానికి బీజేపీ దూరం - అక్బరుద్దీనే కారణమన్న రాజాసింగ్ !

Telangana BJP : ఎమ్మెల్యేలుగా ప్రమాణానికి  బీజేపీ దూరం - అక్బరుద్దీనే కారణమన్న రాజాసింగ్ !