Mohanlal: 'L2' ఆధారంగా 'గాడ్ ఫాదర్ 2' తీయలేరు - మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' రీమేక్‌లో కొన్ని పాత్రలు లేవన్న మోహన్‌లాల్
L2: Empuraan Movie: మలయాళ స్టార్ మోహన్‌లాల్ మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' గురించి మాట్లాడారు. 'L2' ఆధారంగా 'గాడ్ ఫాదర్ 2' రూపొందించలేరని ఆయన అభిప్రాయపడ్డారు.

Mohanlal About Megastar God Father Movie: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal) హీరోగా.. నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) లుసిఫర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ మూవీనే మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' పేరుతో రీమేక్ చేశారు. దీనిపై 'L2: Empuraan' మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న హీరో మోహన్‌లాల్ తాజాగా స్పందించారు. 'L2' ఆధారంగా 'గాడ్ ఫాదర్ 2' మూవీ రూపొందించలేరని అభిప్రాయపడ్డారు.
కారణం అదేనా..
మలయాళంలో తాను నటించిన ఎన్నో సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయని.. 'లూసిఫర్' (Lucifer) ఆధారంగా తెలుగులో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' (God Father) తాను కూడా చూశానని మోహన్‌లాల్ చెప్పారు. 'ఒరిజినల్ సినిమా స్టోరీలో మార్పులు చేసి వాళ్లు లూసిఫర్ తెరకెక్కించారు. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న కొన్ని పాత్రలు తెలుగు రీమేక్‌లో లేవు. అందుకే 'L2' ఆధారంగా వాళ్లు 'గాడ్ ఫాదర్ 2' రూపొందించలేరు.' అని మోహన్‌లాల్ తెలిపారు.
అయితే.. 2019లో మోహన్‌లాల్ లూసిఫర్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీని 2022లో మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో 'గాడ్ ఫాదర్'గా రీమేక్ చేశారు. తాజాగా విడుదలైన 'L2' ట్రైలర్ చూస్తే టొవినో థామస్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు అర్థమవుతోంది. అందుకే దీని ఆధారంగా 'గాడ్ ఫాదర్ 2' రూపొందించలేరని మోహన్‌లాల్ అభిప్రాయపడి ఉంటారని తెలుస్తోంది.
Also Read: ముగ్గురి జీవితాలను మలుపు తిప్పిన అంతర్జాతీయ మ్యాచ్ - నయనతార 'టెస్ట్' మూవీ ట్రైలర్ చూశారా?
2019లో విడుదలై సంచలన విజయం సాధించిన 'లూసిఫర్' సీక్వెల్‌గా 'లూసిఫర్ 2: ఎంపురాన్' తెరకెక్కించిన విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే హీరో మోహన్‌లాల్‌తో పాటు నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ ప్రమోషన్స్‌లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఈ మూవీని తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయనున్నారు.
'మోహన్‌లాల్' వల్లే సాధ్యం
ఈ సినిమా తెలుగు వెర్షన్‌లోనే చూడాలని ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు. ఇప్పటివరకూ మలయాళ చిత్ర పరిశ్రమలో ఎవరూ ఈ స్థాయిలో సినిమా నిర్మించలేదని.. ఇది సాధ్యమైందంటే అందుకు కేవలం మోహన్‌లాల్, నిర్మాతలే కారణమని కొనియాడారు. ఓ అభిమానిగా ఆయన సినిమాకు దర్శకత్వం వహించానని.. ఫ్యాన్స్ ఆయన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపించానని చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

