Mohanlal's Malaikottai Vaaliban : 'మలైకోట్టై వాలిబన్' మోహన్ లాల్ - కంప్లీట్ యాక్టర్ కొత్త లుక్
తెలుగులోనూ అభిమానులను సొంతం చేసుకున్న మలయాళ కథానాయకుడు మోహన్ లాల్. ఆయన హీరోగా రూపొందుతున్న తాజా సినిమా 'మలైకోట్టై వాలిబన్'. ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

కథానాయకుడిగా మలయాళ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) పంథా భిన్నమైనది. ఓ తరహా పాత్రలకు ఆయన ఎప్పుడూ పరిమితం కాలేదు. బహుశా... అందుకేనేమో 'కంప్లీట్ యాక్టర్' అని ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రయోగాత్మక కథలు, చారిత్రక చిత్రాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే మోహన్ లాల్... ఇప్పుడు మరో పీరియాడిక్ సినిమా చేస్తున్నారు.
'మలైకోట్టై వాలిబన్' మోహన్ లాల్
మోహన్ లాల్ (Mohanlal) కథానాయకుడిగా రూపొందుతున్న తాజా పాన్ ఇండియా సినిమా 'మలైకోట్టై వాలిబన్' (Malai Kottai Valiban Movie). తెలుగులోనూ సేమ్ టైటిల్ తో విడుదల చేయనున్నారు. తెలుగులో ఆ టైటిల్ మీనింగ్ ఏంటంటే... 'మాలై కోట్టై ప్రాంతానికి చెందిన యువకుడు' అని! లేటెస్టుగా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
మోహన్ లాల్... ఇంటెన్స్ యాక్షన్!
'మలైకోట్టై వాలిబన్' ఫస్ట్ లుక్ చూస్తే... యాక్షన్ సీక్వెన్స్ నుంచి లుక్ తీసినట్లు అర్థం అవుతోంది. కంప్లీట్ యాక్టర్ లుక్, ఆ యాక్షన్ చూస్తుంటే... ఇంటెన్స్ కనబడుతోంది! సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసే వరకు సినిమాపై బజ్ ఏర్పడటానికి దర్శకుడు లిజో జోస్ పెల్లిసరీ (Lijo Jose Pellissery) కూడా ఓ కారణం. మలయాళంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాలను ఆయన తీశారు. ఇప్పుడీ ఫస్ట్ లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.
జైసల్మీర్... రెగ్యులర్ షూటింగ్!
'మలైకోట్టై వాలిబన్' సినిమాను జాన్ మేరీ క్రియేటివ్, సెంచురీ ఫిల్మ్స్, మాక్స్ ల్యాబ్ పతాకాలపై షిబు బేబీ జాన్, కొచుమొన్, అనూప్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 18న రాజస్థాన్ (Rajasthan)లోని జైసల్మీర్ (jaisalmer)లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇప్పుడు కూడా అక్కడ షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు : దీపు జోసెఫ్, స్క్రిప్ట్ వర్క్ : పిఎస్ రఫిక్, ఛాయాగ్రహణం : మధు నీలకందన్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై.
View this post on Instagram
రజనీకాంత్ 'జైలర్'లోనూ...
'మలైకోట్టై వాలిబన్' కాకుండా ఇప్పుడు మోహన్ లాల్ చేతిలో మరో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా విజయ్ 'బీస్ట్', శివ కార్తికేయన్ 'వరుణ్ డాక్టర్' సినిమాల ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'జైలర్' సినిమాలో మోహన్ లాల్ నటిస్తున్నారు. అందులో ఆయనది కీలక పాత్ర అని తెలిసింది. అది కాకుండా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో సూపర్ హిట్ 'లూసిఫర్'కు సీక్వెల్ 'ఎల్ 2 : ది ఎంపరర్' సినిమా కూడా మోహన్ లాల్ చేస్తున్నారు.
మోహన్ లాల్ గ్యారేజీలో ఐదు కోట్ల కార్!
మోహన్ లాల్ దగ్గర సుమారు అర డజను లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వైట్ కలర్ రేంజ్ రోవర్ ఎస్.యు.వి కొన్నారు. దాని రేటు సుమారు ఐదు కోట్లు అని టాక్. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారును ఈ మధ్య తీసుకున్నారు. ఇది కాకుండా ఆయన దగ్గర సుమారు మూడు కోట్లు ఖరీదు చేసిన లంబోర్ఘిని, ఇంకా మెర్సిడెస్ బెంజ్, టయోటా ల్యాండ్ క్రూజర్ కార్లు ఉన్నాయి.
Also Read : మీరా జాస్మిన్ రీఎంట్రీ సినిమా రిలీజ్ ఆ రోజే - సముద్రఖని ఫస్ట్ లుక్ వచ్చేసింది
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

