Mohanlal: నగలతో మోహన్ లాల్ డ్యాన్స్ - క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ అంటూ నెటిజన్స్... యాడ్ వీడియో వైరల్
Mohanlal Jewellery: మలయాళ స్టార్ మోహన్ లాల్ ఓ జ్యువెలరీ యాడ్‌లో అదరగొట్టారు. ఒక్క డైలాగ్ కూడా లేకుండానే కేవలం హావభావాలతోనే వావ్ అనిపించగా ఆ వీడియో వైరల్ అవుతోంది.

Mohanlal Dance With Jewellery Ad Video: సాధారణంగా జ్యువెలరీ యాడ్స్ అంటే స్టార్ హీరోయిన్లే ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటారు. తమ అందం, అభినయంతో ఆభరణాలకే అందం తీసుకొస్తుంటారు. అయితే, జ్యువెలరీ యాడ్స్ అంటే వారే చెయ్యాలా ఏంటి? అంటున్నారు మలయాళ స్టార్ మోహన్ లాల్.
మెస్మరైజ్ చేసేశారుగా...
మోహన్ లాల్ రీసెంట్‌గా ఓ జ్యువెలరీ యాడ్‌లో నటించారు. తనదైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఒక్క డైలాగ్ కూడా లేకుండానే ఆడియన్స్‌ను కట్టిపడేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. మోహన్ లాల్‌తో ఫేమస్ యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రకాష్ వర్మ దీన్ని డైరెక్ట్ చేశారు.
మోహన్ లాల్ కారు దిగగానే సెట్‌లో ఉన్న ప్రకాష్ ఆయనకు ఘన స్వాగతం పలుకుతారు. మోహన్ లాల్‌తో సరదాగా ముచ్చటిస్తూ... మోడల్ శివానీని ఆయనకు ప్రకాష్ పరిచయం చేస్తాడు. ఇంతలో యాడ్‌లో హీరోయిన్ వేసుకోవాల్సిన జ్యువెలరీని తీసుకుని తన వ్యాన్‌లోకి వెళ్లిపోతాడు. అయితే, జ్యువెలరీ మిస్ అయ్యిందంటూ అంతా కంగారు పడతారు. టీం అంతా అలర్ట్ అయి వెతకడం మొదలుపెడతారు. మరోవైపు, మోహన్ లాల్ తన వ్యాన్‌లో చేతికి ఉంగరం, బ్రాస్‌లెట్, మెడలో నగలతో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఆకట్టుకుంటాడు. అద్దం ముందు తనను తాను చూస్తూ మురిసిపోతాడు. ఒక్కసారిగా వ్యాన్‌లోకి వచ్చిన డైరెక్టర్ ఇది చూసి షాక్ అవుతారు. అతన్ని చూసి మోహన్ లాల్ నవ్వేస్తారు.
నెటిజన్ల ప్రశంసలు
ఈ యాడ్‌లో మోహన్ లాల్ ఎక్స్‌ప్రెషన్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలాంటి డైలాగ్ లేకుండా హావభావాలతోనే అద్భుతంగా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'దటీజ్ మోహన్ లాల్', 'జ్యువెలరీ యాడ్స్ అంటే ఆడవాళ్లే చేయాలా ఏంటి' అంటూ తమ అభిప్రాయాలు చెప్పారు. అందుకే ఆయన సుప్రీం స్టార్ అయ్యారంటూ ప్రశంసించారు.
ఇక సినిమాల విషయానికొస్తే... ఇటీవల 'ఎంపురాన్ 2'తో బాక్సాఫీస్ హిట్ కొట్టిన మోహన్ లాల్ 'తుడరుమ్' మూవీతోనూ ఆ క్రేజ్ అలానే కొనసాగించారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లోనూ స్పెషల్ రోల్‌లో కనిపించారు. ఇక క్రైమ్ థ్రిల్లర్ 'దృశ్యం 3'లో నటిస్తుండగా ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, 'వృషభ' అనే మూవీలోనూ నటించగా... అక్టోబర్ 16న థియేటర్లలోకి రానుంది. ఈ మూవీకి నంద కిషోర్ దర్శకత్వం వహించగా... జరా ఖాన్, గరుడ రామ్, రాగిణి ద్వివేది కీలక పాత్రలు పోషించారు.



















