Mitra Mandali Teaser: ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ నవ్వులే నవ్వులు - ప్రియదర్శి 'మిత్ర మండలి' టీజర్ అదుర్స్
Mitra Mandali: యంగ్ హీరో ప్రియదర్శి లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మిత్ర మండలి' నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆద్యంతం కామెడీ పంచులతో ఆకట్టుకుంటోంది.

Priyadarshi's Mitra Mandali Teaser Released: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి మరోసారి కామెడీ ఎంటర్‌టైనర్‌తో నవ్వులు పూయించేందుకు రెడీ అయిపోయారు. బన్నీ వాస్ సమర్పణలో వస్తోన్న 'మిత్ర మండలి' మూవీ టీజర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.
నవ్వులే నవ్వులు
తనదైన కామెడీ టైమింగ్, పంచులతో అలరించే ప్రియదర్శి ఈ మూవీలోనూ తనదైన కామెడీతో ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతున్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ ఆద్యంతం నవ్వులతో టీజర్ ఆకట్టుకుంటోంది. 'ఎండ మండింగ్.. చెమట పుట్టింగ్..' అంటూ క్రికెట్ కామెంటరీ లెవల్‌లో టీజర్ ప్రారంభం కాగా.. బాల్ లేకుండా క్రికెట్ ఆడడం.. కామెంటరీ చెబుతూనే క్యారెక్టర్స్‌ను పరిచయం చేయడం ఆసక్తి పెంచేసింది. 'బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడతారు.. బోర్డు లేకుండా క్యారమ్స్ ఆడతారు. రోజూ ఎవరో ఒకరిని వెర్రి వారిని చేస్తారు.' అంటూ సాగే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మూవీ ఉండబోతుందని అర్థమవుతోంది.
World and Gang of #MithraMandali #MithraMandaliTeaser pic.twitter.com/eYaeoT6CZE
— Bunny Vas (@TheBunnyVas) June 12, 2025
Also Read: అబ్బాయ్ 'చరణ్'తో బాబాయ్ మూవీ? - త్రివిక్రమ్ డైరెక్టర్!.. క్రేజీ కాంబో.. ఫ్యాన్స్‌కు పండుగే..
ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ఆసక్తిని పెంచేయగా.. తాజాగా రిలీజ్ అయిన టీజర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. మూవీలో ప్రియదర్శి సరసన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ఎం హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె ఈ మూవీతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రియదర్శి (చైతన్య), నిహారిక (స్వేచ్ఛ), రాగ్ మయూర్ (అభి), విష్ణు ఓయ్ (సాత్విక్), ప్రసాద్ బెహరలతో (రాజీవ్) పాటు వెన్నెల కిశోర్ (సాగర్ కె చంద్ర), సత్య, వీటీవి గణేష్ (నారాయణ) కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ మూవీకి కొత్త దర్శకుడు ఎస్.విజయేంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్.ఆర్.ధృవన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కొత్త
బ్యానర్ 'బన్నీ వాస్ వర్క్స్'పై సమర్పిస్తుండగా.. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా.విజయేందర్ రెడ్డి తీగల మూవీని నిర్మిస్తున్నారు. సోమరాజు పెన్మెత్స సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మరో హిట్ పక్కానా?
హీరో ప్రియదర్శి వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. కోర్టు, సారంగపాణి జాతకం మూవీస్‌తో మంచి విజయం అందుకోగా ఈసారి కూడా అదిరే కామెడీ ఎంటర్‌టైనర్‌తో మరో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీతోనే నిహారిక హీరోయిన్‌గా, విజయేంద్ర డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. నిహారిక ఇటీవల.. 'మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్' కోసం టామ్ క్రూజ్‌తో కలిసి పని చేశారు.
ప్రసాద్ బెహర అటు షార్ట్ ఫిల్మ్స్‌తో మంచి క్రేజ్ సంపాదించుకుని 'కమిటీ కుర్రాళ్లు' మూవీతో సక్సెస్ అందుకున్నారు. రాగ్ మయూర్ ఇటీవలే 'శుభం'లో మెరిశారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో అలరించారు విష్ణు ఓయ్. 'మిత్ర మండలి' మొత్తం ఈసారి ఫుల్‌గా నవ్వులు పూయించనున్నట్లు అర్థమవుతోంది.






















