Miss Shetty Mr Polishetty : అనుష్క సినిమా సెన్సార్ పూర్తి - రిపోర్ట్ ఎలా ఉందంటే?
Miss Shetty Mr Polishetty First Review : అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సెన్సార్ పూర్తి అయ్యింది.
తెలుగు తెర అరుంధతి, దేవసేన అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty MR Polishetty Movie). ఇందులో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' ఫేమ్ నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) కథానాయకుడిగా నటించారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది.
అనుష్క సినిమాకు యు / ఏ!
miss shetty mr polishetty censor certificate : 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రానికి సెన్సార్ బోర్డు 'యు / ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. పెద్దలతో పాటు పిల్లలు కూడా ఈ సినిమాకు వెళ్ళవచ్చు అన్నమాట!
Also Read : 'స్కంద' రిలీజ్‌కు ముందు సెంచరీ కొట్టిన రామ్ - రేర్ రికార్డ్ బాసూ!
View this post on Instagram
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏమీ లేవని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పిల్లలు కనడానికి పెళ్లి అవసరం లేదంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్, ఆ సినిమా కాన్సెప్ట్ కారణంగా యు / ఏ ఇచ్చారట. కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ నేపథ్యంలో తీసిన కామెడీ సీన్లు చాలా బాగా వచ్చాయని తెలిసింది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది.
Also Read : నితిన్ జోడీగా 'కాంతార' కథానాయిక సప్తమి, కీలక పాత్రలో లయ కూడా - ఏ సినిమాలోనో తెలుసా?
నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో, అనుష్క శెట్టి ఫేమస్ షెఫ్ పాత్రలో నటించిన ఈ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. సందీప్ కిషన్, జగపతి బాబు, రెజీనా, కళ్యాణి ప్రధాన తారలుగా 'రారా కృష్ణయ్య' చిత్రాన్ని తెరకెక్కించిన మహేష్ బాబు .పి (Mahesh Babu P) దర్శకత్వం వహించారు. అనుష్కకు 48వ చిత్రమిది. యూవీ క్రియేషన్స్ సంస్థలో 'మిర్చి', 'భాగమతి' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ మీద కన్నేశారు.
సెప్టెంబర్ 7న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'!
Miss Shetty Mr Polishetty Release Date: తొలుత 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'ని ఆగస్టు 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. ఆ తేదీన సినిమా విడుదల చేయడం లేదని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా వాయిదా వేయక తప్పలేదని నిర్మాణ సంస్థ పేర్కొంది.
ఆగస్టు 4 నుంచి చిత్రాన్ని వాయిదా వేశామని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆగస్టు 18న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విడుదల కావచ్చని వినిపించింది. ఆ ఊహాగానాలకు తెర దించుతూ... సెప్టెంబర్ 7న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేశారు.
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి, అభినవ్ గోమఠం, మురళీ శర్మ, తులసి తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ : యువీ క్రియేషన్స్, నిర్మాతలు: వంశీ - ప్రమోద్, రచన & దర్శకత్వం: మహేష్ బాబు .పి, సంగీతం : రధన్, కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు, ఛాయాగ్రహణం : నిరవ్ షా, నృత్యాలు : రాజు సుందరం & బృందా, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial