Abhinav Gomatam: ఆ హీరోల సినిమాలకు రివ్యులు ఇవ్వొద్దు, పాడుచేయొద్దు: అభినవ్ గోమఠం
Abhinav Gomatam: అభినవ్ గోమఠం.. కమెడియన్ గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ నటుడు సంచలన కామెంట్స్ చేశారు.
Abhinav Gomatam - Masthu Shades Unnai Ra: అభినవ్ గోమఠం.. టాలీవుడ్‌లో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న కమెడియన్స్‌లో ఒకరు. చాలా సినిమాల్లో తనదైన నటనతో, మంచి మంచి క్యారెక్టర్లతో ప్రేక్షకులను తెగ నవ్వించాడు. ఇక ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అభినవ్. 'మస్త్ షేడ్స్ ఉన్నాయి రా’ సినిమాతో హీరోగా తన అదృష్టాన్ని పరిచయం చేసుకోనున్నారు. ఫిబ్రవరి 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అభినవ్ సినిమాలకి రివ్యూలు ఇవ్వడంపై కామెంట్స్ చేశారు.
రివ్యూలు ఇవ్వడం మానండి..
'మస్త్ షేడ్స్ ఉన్నాయి రా' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా "సినిమాలపై సోషల్ మీడియా, రివ్యూల ప్రభావం ఎంత ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు?" అనే ప్రశ్నకు ఆయన ఘాటైన సమాధానం చెప్పారు. "ఈ రోజుల్లో సోషల్ మీడియా సిల్లీ ఫ్యాన్ వార్స్, పక్క స్టార్స్ ని డీ గ్రేడ్ చేసేందుకు ఇచ్చే సిల్లీ రివ్యూలకు వేదికగా మారిపోయింది. ఇక రివ్యూల విషయానికి వస్తే.. మీడియా కూడా రివ్యూలు ఇవ్వడం మానేయాలి. స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ గారు లాంటి వాళ్ల సినిమాలు చూసి పెరిగాం. వాళ్ల సినిమాలను మేం ఎంజాయ్ చేయాలి అనుకుంటాం. మీరు రివ్యూలు చెప్పి పాడుచేయొద్దు. రివ్యూలు చెప్పడం మానేయండి. ప్రేక్షకులను ఎంజాయ్ చేయనివ్వండి" అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
'సేవ్ ది టైగర్స్' అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించిన కమెడియన్ అభినవ్ గోమఠం. ఆయన నటించిన 'మస్త్ షేడ్స్ ఉన్నాయి రా' సినిమా ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహించారు. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా.. ప్రమోషనల్ కంటెంట్ తో కొంత మేరకు ఆకట్టుకోగలిగింది. వరుణ్ తేజ్, నిఖిల్ లాంటి యువ హీరోలు ఈ సినిమాకి తమవంతు సపోర్ట్ అందించారు.
ఇక హీరోగా మారిన మరో కమెడియన్ వైవా హర్ష నటించిన సుందరం మాష్టారు సినిమా కూడా ఫిబ్రవరి 23న రిలీజ్ కానుంది. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలోతెరకెక్కిన ఈ చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజ నిర్మించారు. ఇది విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో రూపొందిన ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో హర్ష ఒక ఇంగ్లీష్ మాస్టర్ గా కనిపించబోతున్నారు.దీంతో ఈ రెండు సినిమాల్లో ఏది సక్సెస్ అవుతుందా? అని వేచి చూస్తున్నారు ప్రేక్షకులు. మరోవైపు ఈ రెండు సినిమాలు రిలీజైన వారానికే మార్చి 11న మరో కమెడియన్ వెన్నెల కిశోర్ నటించిన సినిమా 'చారి 111’ కూడా రిలీజ్ కాబోతోంది. దీంతో వీళ్ల ముగ్గురిలో ఎవ్వరు ప్రేక్షకులను ఎక్కువగా మెప్పిస్తారో అని వేచి చూస్తున్నారు అందరూ. ఎవరు హిట్లు కొడతారా? అని మాట్లాడుకుంటున్నారు.
Also Read: షణ్ముఖ్ జశ్వంత్‌కు బెయిల్ - నిజంగానే అతడి ఇంట్లో గంజాయి ఉందా? ఏసీపీ ఏం చెప్పారు?