అన్వేషించండి

Mathu Vadalara 2 Day 1 Collection: మత్తు వదలరా 2 ఫస్ట్ డే కలెక్షన్స్... సాలిడ్ ఓపెనింగ్ రాబట్టిన శ్రీ సింహా, సత్య - ఎన్ని కోట్లంటే?

Mathu Vadalara 2 Box Office Collection: కామెడీ ఎంటర్టైనర్ 'మత్తు వదలరా 2' మూవీ సెప్టెంబర్ 13 న థియేటర్లలోకి వచ్చింది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ పై అధికారిక ప్రకటన వచ్చింది.

హిలేరియస్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మత్తు వదలరా 2 మూవీ మంచి బజ్ తో థియేటర్లలోకి వచ్చింది. అయితే చిన్న సినిమానే అయినప్పటికే ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దుమ్ముదులిపేసింది కలెక్షన్ల పరంగా. సాలిడ్ కలెక్షన్ తో హిట్ దిశగా దూసుకెళ్తున్న ఈ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో ఒక లుక్కేద్దాం పదండి. 

మత్తు వదలరా 2 స్ట్రాంగ్ ఓపెనింగ్ 

కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన మోస్ట్ అవైటింగ్ మూవీ 'మత్తు వదలరా 2'. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా... సత్య, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కిన మత్తు వదలరా 2 సెప్టెంబర్ 13 న థియేటర్లలోకి వచ్చింది. అంతకంటే ముందు మేకర్స్ ప్రమోషన్ల ద్వారా సినిమాపై మంచి హైప్ ని క్రియేట్ చేశారు. టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా జక్కన్న కూడా సినిమా ప్రమోషన్లలో పాలు పంచుకోవడంతో చిన్న సినిమానే అయినప్పటికీ అంచనాలు పెరిగాయి. కానీ మరోపక్క ఐదేళ్ల క్రితం వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ మత్తు వదలరా మూవీకి సీక్వెల్ గా వస్తున్న మత్తు వదలరా 2 ఆ రేంజ్ లో ఉంటుందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. వాటన్నింటికి ఫస్ట్ షో నుంచే సమాధానం దొరికింది. మూవీకి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది ఈ మూవీ. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు సొంతంగా రిలీజ్ చేశారు.

తాజాగా చిత్రబృందం ఈ మూవీకి ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ పై అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. మత్తు వదలరా 2 మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 5.3 కోట్లు వసూలు చేసింది. అయితే మూవీకి పెట్టిన బడ్జెట్ పరంగా చూసుకుంటే ఒక చిన్న సినిమాకు ఈ రేంజ్ ఓపెనింగ్ అనేది విశేషమే. మొత్తానికి ఫస్ట్ డే సాలిడ్ ఓపెనింగ్ రాబట్టిన మత్తు వదలరా 2 ఈ వీకెండ్ భారీగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. 

Also Read: SSRMB29 స్టోరీ లీక్‌ - 18వ శతాబ్దం కాలంలోకి మహేష్‌ బాబు, హైదరాబాద్‌లో భారీ సెట్‌

మూవీకి కలిసి వచ్చిన లాంగ్ వీకెండ్  

ఈ చిత్రం అంతర్జాతీయంగా కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటోంది. మత్తు వదలరా 2 ఓవర్సీస్ లోనూ అడ్వాన్స్ బుకింగ్ లో అదరగొట్టింది. అలాగే అమెరికాలో మొదటి రోజు $300Kని అధిగమించి, మిలియన్ దిశగా పరుగులు తీస్తోంది. పాజిటివ్ బజ్, మౌత్ టాక్ తో మత్తు వదలారా 2 మొదటి వారాంతంలో హాఫ్ మిలియన్ వసూలు చేస్తుందని, పూర్తి రన్‌లో ఒక మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటుంది అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల లాంగ్ వీకెండ్ కలిసి రాబోతోంది. సెప్టెంబర్ 13 నుంచి 18 తేదీల వరకు పలు పండగల కారణంగా వచ్చిన హాలిడేస్ తో సినిమా కలెక్షన్స్ మరింత పుంజుకునే ఛాన్స్ ఉంది. 

Also Readఅన్నయ్యా... అన్నయ్యా... అన్నయ్యా... నీది మాములు విలనిజం కాదన్నయ్యా... ఎస్.జె. సూర్య బెస్ట్ విలన్ రోల్స్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget