అన్వేషించండి

The Raja Saab Review : మారుతి ఇంటికి పార్శిల్స్, లెటర్స్? - 'ది రాజా సాబ్' ఎఫెక్ట్ పడిందా!... అడ్రస్ లీక్‌తో ఇబ్బందులు

Maruthi Reaction : డైరెక్టర్ మారుతి తన ఇంటి అడ్రస్ చెప్పడం ఇబ్బందులు తెచ్చిపెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఇంటికి రోజూ అధిక సంఖ్యలో పార్శిల్స్, లెటర్స్ వస్తున్నాయట.

The Raja Saab Director Maruthi Regrets His House Address Leak : 'కొల్ల లగ్జోరియా, విల్లా నెంబర్ 17, కొండాపూర్'... ప్రభాస్ అభిమాని ఏ ఒక్కరైనా నిరాశ చెందితే కమ్ టు మై హోమ్... అంటూ డైరెక్టర్ మారుతి చేసిన కామెంట్స్ ఇవి. 'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఈ రేంజ్ ఎలివేషన్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఎంతో ఎక్స్‌పెక్టేషన్‌తో థియేటర్లకు క్యూ కట్టారు. అయితే, రిజల్ట్ మాత్రం అందుకు భిన్నంగా వచ్చింది. దీంతో ఆయన ఇంటికి ప్రభాస్ ఫ్యాన్స్ అధిక సంఖ్యలో పార్శిల్స్, లెటర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.

మారుతిపై విమర్శలు

'ది రాజా సాబ్'లో ప్రభాస్ యాక్టింగ్‌కు మంచి మార్కులే పడినా మారుతి డైరెక్షన్‌పై విమర్శలు వచ్చాయి. అందులోనూ ఫస్ట్ నుంచి హైప్ ఇచ్చిన ప్రభాస్ ఓల్డ్ లుక్ మోషన్ పోస్టర్ సినిమాలో కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగింది. దీంతో ఆ తర్వాత 8 నిమిషాల రన్ టైం ఉన్న ఆ సీన్ యాడ్ చేశారు. ఇది ముందే చేసుంటే ఇంత డ్యామేజ్ ఉండేది కాదంటూ ప్రభాస్ ఫ్యాన్స్ వరుస కామెంట్స్ చేశారు. రిలీజ్ తర్వాత 'మారుతి కమ్ టు మై హోమ్' అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.

అధిక సంఖ్యలో లెటర్స్... టాబ్లెట్స్?

'ది రాజా సాబ్' బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. అటు సోషల్ మీడియాలో డైరెక్టర్ మారుతిపై ట్రోలింగ్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ఇంటికి పెద్ద సంఖ్యలో పార్సిళ్లు, లెటర్స్ వస్తున్నాయట. స్విగ్గీ, జొమాటోల నుంచి ఆర్డర్లు పంపుతున్నట్లు తెలుస్తోంది. రోజూ ఇలా కొరియర్స్, పార్శిళ్లు రావడంతో భద్రతా సిబ్బంది, అపార్ట్‌మెంట్ వాసులు గందరగోళానికి గురవుతున్నారట.

ఆ లెటర్స్‌లో కొన్ని పాజిటివ్‌గా, మరికొన్ని నెగిటివ్‌గానూ ఉన్నాయంటూ టాక్ వినిపిస్తోంది. కొందరు మెడికల్ షాప్ నుంచి టాబ్లెట్స్ కూడా పంపుతున్నారట. ఈ పార్శిళ్ల వల్ల అపార్ట్‌మెంట్ వాసులు ఇబ్బంది పడుతున్నారట. భద్రతా సిబ్బంది పార్శిళ్లను నిత్యం తనిఖీ చేస్తున్నారట.

Also Read : 350 కోట్ల క్లబ్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' - ఈ జర్నీ మామూలుగా లేదు... స్పెషల్ వీడియో వైరల్

మారుతి రియాక్షన్!

ఎక్కువ సంఖ్యలో ఆర్డర్స్ వస్తుండడంతో డైరెక్టర్ మారుతి ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి ఆన్ లైన్ ఆర్డర్స్ తనకు పంపొద్దని ఆయన సెక్యూరిటీకి చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన సన్నిహితులు సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. కొందరు ఫ్యాన్స్ అభిమానంతో పంపుతుంటే కొందరు కావాలనే ఇలా చేస్తున్నారని అంటున్నారు. అవసరం అయితే కొరియర్ సంస్థలతో పాటు పోలీసులకు కూడా దీనిపై కంప్లైంట్ చేసే ఆలోచనలో ఉన్నారట.

అయితే, ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఇలా వ్యక్తిగత సమాచారం విషయంలో అలర్ట్‌గా ఉండాలంటూ సినీ వర్గాల్లో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. స్టేజ్‌పై అనుకోకుండా చెప్పిన ఓ మాట ఇప్పుడు ఇబ్బందుల్లోకి నెట్టిందని... ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Irumudi First Day Collections : మాస్ మహారాజ ఖాతాలో మరో హిట్ - ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
మాస్ మహారాజ ఖాతాలో మరో హిట్ - ఇరుముడి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget