Maruthi Nagar Subramanyam OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మారుతీనగర్ సుబ్రమణ్యం' థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. వసూళ్ల పరంగానూ సత్తా చాటింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది.
Maruthi Nagar Subramanyam OTT Release Confirmed: సీనియర్ నటుడు రావు రమేష్ ముఖ్యపాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 23న థియేటర్లలో విడుదల అయింది. తొలి షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ కామెడీ డ్రామా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుస్తూన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ఓటీటీ సంస్థ ఆహా క్రేజీ అప్ డేట్ ఇచ్చింది.
ఆహా ఓటీటీలో త్వరలో మారుతి నగర్ విడుదల
'మారుతీ నగర్ సుబ్రమణ్యం' సినిమా ఎట్టకేలకు ఓటీటీ పార్ట్నర్ ను ఫిక్స్ చేసుకుంది. ఆహా వేదికగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ఓటీటీ సంస్థ ఆహా అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. త్వరలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. “మేడం, సర్ త్వరలో ఆహాలో సందడి చేయనున్నారు. గట్టిగా నవ్వేందుకు రెడీగా ఉండండి. హిలేరియస్ ‘మారుతీ నగర్ సుబ్రమణ్మం’ మూవీ త్వరలో ఆహాలోకి రానుంది” అంటూ స్పెషల్ పోస్టర్ ను షేర్ చేసింది.
విడుదల తేదీని కన్ఫామ్ చేయని ఆహా
ఆహా వేదికగా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' రిలీజ్ కాబోతోంది అని ప్రకటించినా... ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. చాలా మంది ప్రేక్షకుల మాత్రం ఈ సినిమా వచ్చే వారం స్ట్రీమింగ్ కు వస్తుందని భావిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన రానుంది.
View this post on Instagram
మిడిల్ క్లాస్ కథాంశంతో తెరకెక్కిన 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'
'మారుతీ నగర్ సుబ్రమణ్యం' సినిమాను లక్ష్మణ్ కార్య అద్భుతంగా తెరకెక్కించారు. మిడిల్ క్లాస్ కుటుంబంలోని పరిస్థితులతో నేపథ్యంలో కొనసాగే ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టకుంది. కామెడీ, ఎమోషన్స్, డ్రామాతో కట్టిపడేసింది. ఈ మూవీలో చాలా మంది తమను తాము చూసుకున్నట్లు ఉందని చెప్పడం విశేషం. ఈ చిత్రంలో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో నటించారు. కల్యాణ్ నాయక్ సంగీతం అందించారు. పీబీఆర్ సినిమాస్, లోక్‍మాత్రే క్రియేషన్స్ బ్యానర్లలో ఈమూవీని బుజ్జి రాయుడు, మోహన్ కార్య నిర్మించారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత ఈ మూవీని సమర్పించారు.
రావు రామేష్ నటనకు ప్రేక్షకులు ఫిదా
సీనియర్ నటుడు రావు గోపాలరావు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రావు రమేష్ ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి మెప్పించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి నటించారు. వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. తండ్రి కారణంగా ఇండస్ట్రీలోకి వచ్చినా తనకంటూ ఓ సొంత ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’గా అలరించారు. ఈ ఫ్యామిలీ డ్రామాలో ఆయన నటనకు ప్రశంసల వర్షం కురిసింది.
Read Also: జాన్వీ కపూర్ కట్టిన చీర రేటు ఎంతో తెలుసా? ఇయర్ రింగ్స్ 13 లక్షలు ఏంటి బాసూ!