News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Manu Charitra Trailer: ప్రాణం పోయాలంటే కష్టం గానీ చంపడం చాలా ఈజీ - ఉత్కంఠగా ‘మను చరిత్ర’ ట్రైలర్

‘మను చరిత్ర’ సినిమా ట్రైలర్ విషయానికొస్తే.. మూవీలో హీరో(శివ కందుకూరి) తన లైఫ్ లో ఒక్కో దశలో ఒక్కో అమ్మాయితో ప్రేమలో పడుతూ ఉంటాడు. తర్వాత కొన్ని కారణాల వలన మళ్లీ వాళ్లకు బ్రేకప్ చెప్తాడు. మరోవైపు..

FOLLOW US: 
Share:

Manu Charitra Trailer: శివ కందుకూరి నటించిన తాజా చిత్రం ‘మను చరిత్ర’. ఈ సినిమాకు భరత్ పెడగాని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో డెబ్యూ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు భరత్. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ లు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో కనిపించనున్నారు. అలాగే హీరో ఫ్రెండ్ పాత్రలో సుహాస్ నటిస్తున్నాడు. ఈ మూవీకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. 

లవ్.. బ్రేకప్.. పెయిన్.. ‘మను చరిత్ర’

‘మను చరిత్ర’ సినిమా ట్రైలర్ విషయానికొస్తే.. మూవీలో హీరో(శివ కందుకూరి) తన లైఫ్ లో ఒక్కో దశలో ఒక్కో అమ్మాయితో ప్రేమలో పడుతూ ఉంటాడు. తర్వాత కొన్ని కారణాల వలన మళ్లీ వాళ్లకు బ్రేకప్ చెప్తాడు. మరోవైపు అతనిపై కొంతమంది ఎటాక్ చేస్తూ ఉంటారు. హీరో తను ప్రేమించిన అమ్మాయిలతో ఎందుకు విడిపోతున్నాడు? అతని ప్రేమలో లోపాలు ఏంటి? హీరోపై ఎటాక్ చేస్తున్న గ్యాంగ్ ఎవరు? ఎందుకు చంపాలనుకుంటున్నారు? చివరకు హీరో ప్రేమ ఏమైంది లాంటి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో మూవీను తెరకెక్కించినట్టున్నారు మేకర్స్.

విభిన్న దశల్లో ఏజ్ డిఫరెన్స్ లుక్ ను చాలా బాగా హ్యాండిల్ చేశాడు శివ కందుకూరి. ట్రైలర్ లో శివ నటన ఆకట్టుకునేలా ఉంది. అలాగే సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నట్టున్నాయి. భావోద్వేగ సన్నివేశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. ప్రేమించడం, విడిపోవడం, ఆ ప్రేమను మర్చిపోలేకపోవడం దాని వల్ల వచ్చే పెయిన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ట్రైలర్ లో ఆ విషయం తెలుస్తోంది. ఇక మ్యూజిక్ కూడా డీసెంట్ గా అనిపిస్తోంది. మొత్తంగా ట్రైలర్ ను ఇంట్రస్టింగ్ గానే కట్ చేశారు మేకర్స్. మరి మూవీ ఎలా ఉంటుంది అనేది తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

ఇక ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ స్టార్ హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండటంతో మూవీ పై ఆసక్తి నెలకొంది. అలాగే డిఫరెంట్ జోనర్ లో వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాను యూపిల్ ట్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్ శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీను జూన్ 23 న విడుదల చేయనున్నారు మేకర్స్. 

Read Also : రికార్డుల వేటకు మళ్లీ ఒక్కటైన అల్లు అర్జున్ - త్రివిక్రమ్, గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా!

Published at : 13 Jun 2023 12:58 PM (IST) Tags: Manu Charitra Manu Charitra Trailer Starring Shiva Kandukuri Megha Akash Bharath Pedagani

ఇవి కూడా చూడండి

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Muthiah Muralidharan: ఆయన కెప్టెన్ అయితే బాగుంటుంది: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ గురించి ముత్తయ్య మురళీధరన్ కామెంట్స్

Muthiah Muralidharan: ఆయన కెప్టెన్ అయితే బాగుంటుంది: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ గురించి ముత్తయ్య మురళీధరన్ కామెంట్స్

Jawan: రూ.1000 కోట్ల క్లబ్ లో 'జవాన్'.. చరిత్ర సృష్టించిన కింగ్ ఖాన్!

Jawan: రూ.1000 కోట్ల క్లబ్ లో 'జవాన్'.. చరిత్ర సృష్టించిన కింగ్ ఖాన్!

Chandramukhi 2: 480 ఫైల్స్‌ మిస్ అయ్యాయి.. అందుకే 'చంద్రముఖి 2' చిత్రాన్ని వాయిదా వేశాం: పి.వాసు

Chandramukhi 2: 480 ఫైల్స్‌ మిస్ అయ్యాయి.. అందుకే 'చంద్రముఖి 2' చిత్రాన్ని వాయిదా వేశాం: పి.వాసు

Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?

Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత