అన్వేషించండి

Manmadhudu Heroine Anshu: 20 ఏళ్ల తర్వాత కలిసిన ‘మన్మథుడు’ జంట - జ్ఞాపకాలకి కాలంతో పని లేదంటున్న అన్షు

Anshu Saggar: ‘మన్మథుడు’ సినిమా విడుదలయ్యి దాదాపు 20 ఏళ్లు అయ్యింది. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ కలుసుకున్నారు. ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ కూడా చేశారు.

Anshu Saggar Meets Nagarjuna: కొందరు నటీనటులను ప్రేక్షకులు ఎక్కువకాలం గుర్తుపెట్టుకోవాలంటే వారు ఎక్కువ సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు. ఒక్క ఎవర్‌గ్రీన్ చిత్రంలో మెరిసినా చాలు.. అలా ఒకట్రెండు చిత్రాల్లో మెరిసి.. మాయిపోయిన వారిలో హీరోయిన్ల సంఖ్యే ఎక్కువ. అలాంటి హీరోయిన్లలో అన్షు సాగర్ కూడా ఒకరు. అన్షు పేరు చెప్తే ఎవరూ పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ ‘మన్మథుడు’ సినిమాలో మహీ అని చెప్తే.. మూవీ లవర్స్ కచ్చితంగా గుర్తుపడతారు. ‘మన్మథుడు’ మూవీ విడుదలయ్యి ఇప్పటికీ దాదాపు 20 ఏళ్లు అవుతుండగా.. ఇన్నేళ్ల తర్వాత నాగార్జునను కలిసింది అన్షు. సంతోషంగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

20 ఏళ్ల తర్వాత..

‘‘రెండు దశాబ్దాల క్రితం నేను నాగ్ సార్‌తో ‘మన్మథుడు’లో నటించాను. ఆయన మంచితనం ఇప్పటికీ అలాగే ఉంది. కొన్ని జ్ఞాపకాలకి కాలంతో పని లేదు’’ అంటూ నాగార్జునతో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అప్పట్లో నాగార్జునతో ‘మన్మథుడు’ చేసిన తర్వాత ప్రభాస్‌తో కలిసి ‘రాఘవేంద్ర’ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది అన్షు సాగర్. కానీ ఈ రెండు సినిమాల తర్వాత తను ఉన్నట్టుండి ఫారిన్ వెళ్లిపోయింది. మళ్లీ సినిమాలవైపు గానీ, ఇండియా వైపు గానీ తిరిగి చూడలేదు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు నాగార్జునతో కలిసి ఫోటోలను షేర్ చేసి ‘మన్మథుడు’ మూవీ లవర్స్‌ను హ్యాపీ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anshu Saggar (@actressanshuofficial)

ఆంక్షలు పెరిగాయి..

ఇండియాలో అడుగుపెట్టిన వెంటనే ముందుగా యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహాతో ఒక పోడ్కాస్ట్ చేసింది అన్షు సాగర్. అందులో అసలు తను సినిమాలకు దూరం అయిపోవడానికి కారణమేంటో బయటపెట్టింది. ‘మన్మథుడు’లో నాగార్జునతో నటించే అద్భుతమైన అవకాశం లభించిందని, అదంతా మంచి టీమ్, కల నిజం అయినట్టు అనిపించిందని, సినిమాల్లో యాక్టివ్ అవ్వాలి, అదే తన తరువాతి అడుగు అనుకున్నానని బయటపెట్టింది. కానీ అప్పటికీ తన వయసు 16 ఏళ్లే కాబట్టి ముందుగా చదువుపై శ్రద్ధాపెట్టాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో హీరోయిన్ అవ్వడం వల్ల ఇంట్లో ఆంక్షలు పెరగడంతో ఇంగ్లాండ్ తిరిగి వెళ్లిపోవడమే సరైన నిర్ణయమని అనుకున్నానని బయటపెట్టింది అన్షు సాగర్.

కమ్ బ్యాక్‌పై హింట్..

అన్షు సాగర్.. ఇంగ్లాండ్‌లోని పుట్టి పెరిగింది. అనుకోకుండా హైదరాబాద్‌కు వచ్చి, ‘మన్మథుడు’లాంటి సినిమాలో నటించి ఫేమస్ అయ్యింది. అప్పటికీ తను సినిమాల్లో కొనసాగి ఉంటే ఇంకా ఎందరో స్టార్ హీరోలతో తను నటించే అవకాశం లభించేదేమో. కానీ అలా జరగలేదు. ఇక ఇన్నాళ్ల తర్వాత ఎందరో కనుమరుగయిపోయిన హీరోయిన్లు.. తిరిగి సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్న సందర్భంగా అన్షు కూడా తన కమ్ బ్యాక్ గురించి హింట్ ఇచ్చింది. కమ్ బ్యాక్ ఇచ్చే ఆలోచనలు ఉన్నాయా అని అడగగా.. తాను ఇప్పుడు అందరికీ అందుబాటులోనే ఉన్నానని, ఇది కమ్ బ్యాక్ అనే అనుకోవచ్చని స్పష్టం చేసింది.

Also Read: ‘ఆయ్’ అంటూ వచ్చేస్తున్న ఎన్టీఆర్ బావమరిది - క్రియేటివ్‌గా టైటిల్ రివీల్ చేసిన మేకర్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Embed widget