Manchu Vishnu: అంతా కలిసుండాలనే రూల్ ఏమీ లేదు - ‘హౌజ్ ఆఫ్ మంచూస్’పై మంచు విష్ణు క్లారిటీ
టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీ ఏం మాట్లాడినా అది చాలావరకు ఒక సెన్సేషన్ అవుతుంది. ముఖ్యంగా అందులోనూ మంచు విష్ణు ఏది మాట్లాడినా.. దానికి నానార్థాలు వెతికి తనను ట్రోల్ చేయాలని చూసేవారు చాలామంది ఉంటారు.
టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీ ఏం మాట్లాడినా అది చాలావరకు ఒక సెన్సేషన్ అవుతుంది. ముఖ్యంగా అందులోనూ మంచు విష్ణు ఏది మాట్లాడినా.. దానికి నానార్థాలు వెతికి తనను ట్రోల్ చేయాలని చూసేవారు చాలామంది ఉంటారు. ఇక చాలాకాలం తర్వాత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు. తనకు సంబంధం లేని అనేక విషయాలపై తన అభిప్రాయాలను బయటపెట్టారు. రాజకీయాల గురించి, పవన్ కళ్యాణ్ గురించి, ఏపీ పాలిటిక్స్ గురించి.. ఇలా చాలా అంశాల గురించి తాను ఏం అనుకుంటున్నాడో బయటపెట్టాడు విష్ణు. అంతే కాకుండా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా అప్డేట్ ఇచ్చాడు. దీంతో పాటు మనోజ్‌తో ఉన్న మనస్ఫర్థల గురించి కూడా మాట్లాడాడు.
‘మా’ ఎన్నికలతో మళ్లీ వెలుగులోకి..
మంచు విష్ణు చాలాకాలం తర్వాత ‘మా’ ఎలక్షన్స్ ద్వారా మళ్లీ వెలుగులోకి వచ్చాడు. ఆ ఎలక్షన్స్ సమయంలో జరిగిన హడావిడి, ప్రకాశ్ రాజ్‌తో పోటీ, ప్రచారం సమయంలో జరిగిన కాంట్రవర్సీలు.. ఇవన్నీ రసవత్తరంగా ఉండడంతో విష్ణుపై మళ్లీ ప్రేక్షకుల ఫోకస్ పడింది. సీనియర్ యాక్టర్ అయినా కూడా, బలమైన ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకున్నా కూడా మంచు విష్ణు చేతిలో ప్రకాశ్ రాజ్‌కు ఓటమి తప్పలేదు. ఇక ‘మా’ ప్రెసిడెంట్ అయిన తర్వాత ‘జిన్నా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమా అంతగా ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది. అందుకే రూటు మార్చి రియాలిటీ షోల వైపు వెళుతున్నట్టుగా మంచు విష్ణు ప్రకటించాడు.
ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం కానీ..
కొన్నాళ్ల క్రితం మంచు మనోజ్‌కు, విష్ణుకు గొడవ అవుతున్నట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోను మనోజ్ స్వయంగా పోస్ట్ చేశాడు. కానీ వెంటనే డిలీట్ చేసేశాడు కూడా. అప్పటికే కొందరు ఆ వీడియోను సేవ్ చేసుకొని వైరల్ చేశారు. మంచు మనోజ్ తీసుకున్న పర్సనల్ నిర్ణయాల వల్ల విష్ణుకు కోపం వచ్చిందని, అందుకే అలా ప్రవర్తించాడని ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ ఇదంతా ‘హౌజ్ ఆఫ్ మంచూస్’ అనే పేరుతో తాను తెరకెక్కిస్తున్న ఒక రియాలిటీ షోలో భాగమని విష్ణు క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఆ షో గురించి మాట్లాడుతూ ప్రముఖ ఓటీటీతో చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే అప్డేట్ ఇస్తామని క్లారిటీ ఇచ్చాడు. అదే సమయంలో మనోజ్‌కు, తనకు మధ్య ఉన్న మనస్ఫర్థలు గురించి కూడా ఇన్‌డైరెక్ట్‌గా బయటపెట్టాడు. వచ్చే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో అసలు నిజమేంటో బయటపడుతుందని అన్నాడు. తనకు ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టమని, అలా అని అందరూ కలిసుండాలి అని రూల్ ఏమీ లేదని తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో ఇంకా మనస్ఫర్థలు కొనసాగుతున్నట్టు అర్థమవుతోంది.
‘కన్నప్ప’ సినిమా అప్డేట్..
రియాలిటీ షో మాత్రమే కాకుండా తన తండ్రితో కలిసి ఒక భారీ బడ్జెట్ సినిమాను కూడా ప్లాన్ చేసినట్టు విష్ణు ఇదివరకే ప్రకటించాడు. ‘భక్త కన్నప్ప’ జీవితకథ ఆధారంగా మోహన్ బాబు లీడ్ రోల్‌లో ‘కన్నప్ప’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నట్టు తెలిపాడు. ఆ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను కూడా విష్ణు బయటపెట్టాడు. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో ఆర్థికంగా చాలా రిస్కులు చేయాల్సి ఉంటుందని, అందుకే సినిమా కోసం సమయం తీసుకుంటున్నట్టుగా విష్ణు తెలిపాడు. సెప్టెంబర్‌లో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నాడు.
Also Read: ‘లాల్ సింగ్ చడ్డా’లో అమీర్ ఖాన్ ఓవర్ యాక్షన్ చేశారు - రాజమౌళి అంతమాట అన్నారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial