Manchu Manoj : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌పై శివాజీ కామెంట్స్ - సారీ చెప్పిన మంచు మనోజ్, నవదీప్ రియాక్షన్
Manchu Manoj Reaction : సీనియర్ హీరో శివాజీ హీరోయిన్స్ డ్రెస్సింగ్‌పై చేసిన కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ అంశంపై హీరో మంచు మనోజ్, నవదీప్ రియాక్ట్ అయ్యారు.

Manchu Manoj Navdeep Reaction On Sivaji Comments : హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శివాజీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్న వేళ అటు సోషల్ మీడియా ఇటు ఇండస్ట్రీ పరంగా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ... శివాజీ కామెంట్స్‌పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా దీనిపై హీరో మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు.
'సారీ చెబుతున్నా'
మహిళలను అవమానపరిచేలా, వారిని వస్తువులుగా చూపేలా కామెంట్స్ చేసిన కొందరు సీనియర్ నటుల తరఫున క్షమాపణ చెబుతున్నట్లు మంచు మనోజ్ తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 'ఆ కామెంట్స్ తీవ్ర నిరాశపరిచాయి. మహిళల డ్రెస్సింగ్‌ను తప్పుపడుతూ వారిపై నైతిక బాధ్యత మోపడం పాతది, ఆమోద యోగ్యం కాదు. నాగరిక సమాజం మహిళల చాయిస్‌లను కంట్రోల్ చేసే బదులు వారి హక్కులను రక్షిస్తుంది.
మహిళలకు ఎల్లప్పుడు గౌరవం, సమానత్వం అందాలి. గౌరవం, జవాబుదారీతం అనేది మహిళలు దుస్తులు ధరించే విధానాన్ని అవమానించడం ద్వారా కాకుండా వ్యక్తిగత ప్రవర్తనతో ప్రారంభించాలి. సెలబ్రిటీలు బాధ్యతగా మాట్లాడాలి. వారి కామెంట్స్ సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. మహిళలు అవమానపరిచేలా కామెంట్స్ చేసిన సీనియర్ నటుల తరఫున నేను క్షమాపణలు చెబుతున్నా. ఈ తరహా ప్రవర్తనను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణంగా తీసుకోలేం. విడిచిపెట్టలేం. మహిళలు అన్ని సమయాల్లో గౌరవం, సమానత్వానికి అర్హులు.' అంటూ రాసుకొచ్చారు.
Came across some deeply disappointing comments last night.
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 23, 2025
A civilised society protects women’s rights instead of policing their choices. #RespectWomen #RespectYourself pic.twitter.com/ym3CmPsxgD
Also Read : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఇక ఇదే అంశంపై హీరో నవదీప్ సైతం రియాక్ట్ అయ్యారు. 'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ చాలా అగౌరవంగా ఉన్నాయి. ఆ పదాలు వాడడం, ఆ అభిప్రాయంతో నేను విభేదిస్తున్నాను.' అంటూ ట్వీచ్ చేశారు.
The statements that were uttered on stage yesterday were disrespectful! I disagree with the choice of words and the opinion presented!
— Navdeep (@pnavdeep26) December 23, 2025
శివాజీ ఏమన్నారంటే?
'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందని అన్నారు. 'అందం అనేది చీరలో నిండుగా కప్పుకొనే బట్టల్లో ఉంటుంది. అంతే తప్ప సామాన్లు కనపడే దాంట్లో ఏమీ ఉండదు. అవి వేసుకున్నప్పుడు చాలా మంది నవ్వినా దరిద్రపు ము**** ఇలాంటి బట్టలెందుకు వేసుకుంది. అని లోపల అనిపిస్తుంది. వేష భాషల నుంచే మన గౌరవం పెరుగుతుంది. ప్రపంచ వేదికలపై చీర కట్టుకున్న వారికే విశ్వ సుందరి కిరీటాలు వచ్చాయి.' అంటూ కామెంట్ చేయడం తీవ్ర దుమారం రేపింది.






















