(Source: ECI/ABP News/ABP Majha)
Mammootty: మమ్ముట్టి సినిమాపై విమర్శలు - అగ్రకులాన్ని అవమానించినట్టుగా ఉందంటూ వ్యాఖ్యలు
Mammootty: ఎన్నో ఏళ్లుగా మలయాళ సినిమాల్లో నటిస్తూ సూపర్ స్టార్‌గా ఎదిగారు మమ్ముట్టి. కానీ ఆయనను కిందకు లాగడం కోసం రెండేళ్ల క్రితం విడుదలయిన సినిమాపై కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.
Mammootty Puzhu Movie Controversy: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఊహించని ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. రెండేళ్ల క్రితం ఆయన హీరోగా నటించిన ‘పురు’ అనే మూవీ విడుదలయ్యింది. ఈ సినిమాను అగ్రకులాన్ని అవమానించినట్టుగా తెరకెక్కించారని కొందరు సోషల్ మీడియాలో దీని గురించి ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. రెండేళ్ల క్రితం విడుదలయిన సినిమా గురించి ఇప్పుడు కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదని ఏఐసీసీ జెనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.
అగ్రకులాన్ని అవమానించారు..
‘పురు’ సినిమాకు సంబంధించి వైరల్ అవుతున్న కాంట్రవర్సీకి కొందరు రాజకీయ నాయకులు సైతం సపోర్ట్ చేస్తున్నారు. దీనిని పొలిటికల్ సైడ్ మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ‘పురు’ మూవీకి రథీనా పీటీ దర్శకత్వం వహించారు. కొన్ని రోజుల క్రితం రథీనా భర్త షార్షాద్ బనియండి పాల్గొన్న ఇంటర్వ్యూలో ‘పురు’పై చేసిన వ్యాఖ్యలతో కాంట్రవర్సీ మొదలయ్యింది. ‘‘ఈ సినిమా అగ్రకులాన్ని అవమానించినట్టుగా ఉంది’’ అంటూ ఆయనే స్వయంగా అనడంతో కొందరు ప్రేక్షకులు కూడా దీనిపై విమర్శలు కురిపించడం మొదలుపెట్టారు. అంతే కాకుండా అదే ఇంటర్వ్యూలో ‘పురు’పై షార్షాద్ చేసిన మరిన్ని వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి.
అతడు పెద్ద ఇస్లామిస్ట్..
అసలు మమ్ముట్టి.. ఈ సినిమా చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారో అని సందేహం వ్యక్తం చేశారు షార్షాద్. అసలు ఆయన ఆ స్క్రిప్ట్ చదివారా అని అన్నారు. అంతే కాకుండా ‘పురు’ మూవీకి పనిచేసిన స్క్రిప్ట్ రైటర్స్‌లో ఒకరైన హర్షద్.. ఒక ఇస్లామిస్ట్ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. సోషల్ మీడియా దీనిపై దుమారం రేగడంతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్.. ఫేస్‌బుక్‌లో స్పందించారు. కొందరు కావాలనే ఈ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది కేవలం రాజకీయ ఎజెండా అని వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ కాంట్రవర్సీలో భాగంగా మమ్ముట్టి ఒరిజినల్ పేరు మహమ్మద్ కుట్టీని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు కొందరు నెటిజన్లు. దీనిపై కూడా వేణుగోపాల్ స్పందించారు.
మలయాళీలకు గర్వకారణం..
‘‘కేవలం తప్పుడు ప్రచారాలు చేసేవారి మనసులో మాత్రమే మమ్ముట్టి పేరు మహమ్మద్ కుట్టీగా గుర్తుండిపోతుంది. ఈ ప్రచారం నుంచి కేరళ ప్రభుత్వం ఆయన్ను ఎప్పుడూ కాపాడుతుంది’’ అని వేణుగోపాల్ తెలిపారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ వి శివన్‌కుట్టి కూడా మమ్ముట్టికి సపోర్ట్ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ షేర్ చేశారు. ‘‘మలయాళీలకు మమ్ముట్టి గర్వకారణం’’ అని అన్నారు. వీరితో పాటు మరెందరో రాజకీయ నాయకులు కూడా మమ్ముట్టికి సపోర్ట్‌గా పోస్టులు పెట్టారు. మొత్తానికి రెండేళ్ల క్రితం విడుదలయిన సినిమా గురించి ఎవరో చేసిన వ్యాఖ్యలు పట్టుకొని ఒక సీనియర్ హీరో గురించి ఇలా తప్పుడు ప్రచారం చేయడం కరెక్డ్ కాదని మమ్ముట్టి ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇప్పటికీ మమ్ముట్టి చేసే సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
Also Read: విడాకులపై ట్రోల్స్ - తమిళుల గౌరవం తగ్గిపోయిందా? ట్రోలర్స్‌కి జీవీ ప్రకాశ్ స్ట్రాంగ్ కౌంటర్