Mammootty Bramayugam Teaser: ‘భ్రమయుగం’ టీజర్: గుండెదడ పుట్టించేలా మమ్ముటీ కొత్త చిత్రం, అంతా బ్లాక్ అండ్ వైటే!
Bramayugam Teaser: ప్రారంభం నుంచే టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. పూర్తి డార్క్ షేడ్‌లో విడుదల చేసిన ఈ టీజర్ పారుతున్న నది, చికటి గుడి చూట్టూ సాగుతూ ఉత్కంఠ రేపింది.
![Mammootty Bramayugam Teaser: ‘భ్రమయుగం’ టీజర్: గుండెదడ పుట్టించేలా మమ్ముటీ కొత్త చిత్రం, అంతా బ్లాక్ అండ్ వైటే! Mammootty Bramayugam Teaser Out, Megastar New Avatar Will Send Chills Down Spine Mammootty Bramayugam Teaser: ‘భ్రమయుగం’ టీజర్: గుండెదడ పుట్టించేలా మమ్ముటీ కొత్త చిత్రం, అంతా బ్లాక్ అండ్ వైటే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/11/8fed0009bfd6bd4a87bbedfa3bd5dce11704983256118929_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Mammootty Bramayugam Teaser: మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి సినిమా అంటే ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ అవుతుంది. తన సినిమాల్లో ఏదోక ప్రత్యేకత, కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు ఈ మలయాళీ మెగాస్టార్. అందుకే ఆయన సినిమా వస్తోందంటే చాలు ఇటూ మలయాళీ ఆడియన్స్‌తో పాటు అటూ తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొంటాయి. అలా ఈసారి కూడా సరికొత్తగా హారర్, థ్రిల్లర్ జానర్ 'భ్రమయుగం'తో థ్రిల్ చేయబోతున్నాడు మమ్ముట్టి. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్ సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశాయి.
ఇక ఆడియన్స్‌లో మరింత ఆసక్తి పెంచుతూ తాజాగా మేకర్స్ టీజర్ వదిలారు. ప్రారంభం నుంచే టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. పూర్తి డార్క్ షేడ్‌లో విడుదల చేసిన ఈ టీజర్ పారుతున్న నది, చికటి గుడి చూట్టూ సాగుతూ ఉత్కంఠ రేపింది. దాదాపు రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ వీడియోలో చొక్కా లేని వ్యక్తి (అర్జున్ అశోకన్ పాత్ర) చికట్లో ఒక పాతబడిన ఆలయం ముందు నిలబడి ఉన్న వింత షాట్‌తో టీజర్ ప్రారంభం అవుతుంది.
క్షణక్షణం ఉత్కంఠ నింపుతూ..
అర్జున్ అశోకన్ చికటిలో కాగడ పట్టుకుని గుడి లోపలికి ప్రవేశించి.. దేనికోసమే రహస్యంగా అన్వేషిస్తుంటాడు. ఈ నేపథ్యంలో బ్యాక్‌గ్రౌండ్‌లో భీకరమైన స్వరం అతడిని హెచ్చరిస్తుంది. "మనలో దాగివున్న రహస్యాలను ఛేదిస్తున్న కొద్దీ క్రమంగా భయం ఆవరిస్తుంది.. ఒక్కసారి ఇక్కడికి వచ్చాక బయటకు వెళ్లడం అసాధ్యం అంటూ గట్టిగా నవ్వుతూ" ఓ స్వరం అతడి భయపెడుతుంది. మధ్యలో మధ్యలో పారుతున్న నది, చిమ్మచికటీని చూపిస్తూ ఇంటెన్స్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. అలా క్షణక్షణం సస్పెన్స్‌ని నింపుతున్న ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది. చివరిలో “చాలా కాలం తర్వాత అతిథి ఇక్కడికి రావడంతో ఈరోజు ముఖ్యమైన రోజుగా గుర్తుకు వస్తుంది. నా మన (నంబూద్రి ఇంటికి) స్వాగతం” అంటూ భయంకరంగా నవ్వుతూ వెంటాడే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో 'భ్రమయుగం' టీజర్ ముగుస్తుంది. అది ముమ్ముట్టి దెయ్యం పాత్రగా తెలుస్తోంది.
కాగా కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో ఈ సినిమాను భూతకాలం ఫేమ్ రాహుల్ సదాశివన్ తెరకెక్కిస్తున్నారు. హార్రర్, థ్రిల్లర్ జానర్లో రూపొందుతున్న ఈ మూవీని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ముమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్‌లు కీలక పాత్రలు పోషించారు. క్రిస్టో జేవియర్ సంగీతం అందించిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదల తేదీ ఇంకా ఖరారు కాకపోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ గతేడాది ఆగస్టులో ప్రారంభం కాగా.. అక్టోబర్ 18న పూర్తి చేసుకుంది. అంటే కేవలం రెండు నెలల్లోనే మూవీ షూటింగ్ కంప్లీట్ చేయడం విశేషం. కాగా మమ్ముట్టి చేతిలో మరో మూడు మలయాళీ భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో గేమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న బజూకలో ఆయన కీ రోల్ పోషిస్తున్నారు. డీనో డెన్నిస్ స్క్రిన్‌ప్లే అందించి డైరెక్ట్ చేస్తున్న బజూకలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, టామ్ షైన్ ఛాకో, సుమిత్ నావల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: షూటింగ్‌లో హీరో నితిన్‌కు గాయాలు, కోలుకోవడానికి అంత సమయం పడుతుందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)