అన్వేషించండి
Advertisement
Kalki 2898AD : ప్రభాస్ 'కల్కి'లో మలయాళ బ్యూటీ - నాగ్ అశ్విన్ గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నాడుగా!
Kalki2898AD : ప్రభాస్ 'కల్కి' సినిమాలో మలయాళ హీరోయిన్ అన్నా బెన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
Kalki 2898 AD: పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ అందుకున్న ఈ హీరో రీసెంట్ గా 'సలార్' తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 600 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి ప్రభాస్ కి మంచి కం బ్యాక్ ఇచ్చింది. ఇక సలార్ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ప్రభాస్ తన తదుపరి చిత్రంగా 'కల్కి 2898AD' మూవీలో నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ విలన్‌గా కనిపించనుండగా దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. హిందూ మైథలాజి కథతో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో పోస్టుపోన్ అయ్యింది. వేసవి కానుకగా మే 9న ఈ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇటీవలే ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ యాడ్ అవుతున్నారు. కమల్, అమితాబ్ లతోపాటు దర్శక ధీరుడు రాజమౌళి, దగ్గుబాటి రానా, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా 'కల్కి' సినిమాలో గెస్ట్‌రోల్‌లో కనిపిస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే దానికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.
ఇక కొద్ది రోజులుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ సైతం ఈ సినిమాల్లో అతిధి పాత్ర చేస్తున్నట్లు టాక్ వినిపించింది. ఇక తాజాగా ఈ సినిమాలో మరో మలయాళ హీరోయిన్ సైతం నటిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ కల్కి సినిమాలో మలయాళ హీరోయిన్ అన్నా బెన్ ఓ కీలక పాత్ర పోషిస్తుందట. ఈ విషయాన్ని అన్నా బెన్ స్వయంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మలయాళంలో 'కుంబలంగి నైట్స్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అన్నా బెన్ ఆ తర్వాత వరుసగా హెలెన్, సారా, కప్పేలా, కాపా వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకుంది. ప్రస్తుతం మలయాళం తో పాటు తమిళంలో నటిస్తోంది.
ఇక ఇప్పుడు తెలుగులో ప్రభాస్ కల్కి సినిమాలో ఈ హీరోయిన్ కి నటించే ఛాన్స్ రావడం విశేషం వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఈ సినిమాను తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నారు త్వరలోనే టీజర్ కూడా రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ నాగ అశ్విన్ ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఛాట్‌జీపీటీ
సినిమా
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion