By: ABP Desam | Updated at : 27 Jun 2022 05:06 PM (IST)
విజయ్ బాబు
మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబును సోమవారం కేరళలోని కొచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. తనను విజయ్ బాబు లైంగింకగా వేధించడంతో పాటు అత్యాచారం చేశాడని యువ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ను అరెస్ట్ చేశారు. అసలు, ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే...
విజయ్ బాబు మీద యువ నటి ఫిర్యాదు చేయడంతో ఆయన్ను జూన్ 22 అరెస్ట్ చేశారు. అయితే, కేరళ హైకోర్టు యాంటిసిపేటరీ (ముందస్తు) బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్ట్ సబ్‌మిట్ చేయమనడంతో పాటు రాష్ట్రం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. అయితే... సోషల్ మీడియాలో బాధిత మహిళ పేరును విజయ్ బాబు వెల్లడించిన కారణంగా మరోసారి అరెస్ట్ చేసే అవకాశం ఉందని న్యాయ వర్గాల్లో వినిపించింది. అందుకు తగ్గట్టు... విచారణ నిమిత్తం సోమవారం ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చిన విజయ్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆధారాలు సేకరణకు అత్యాచారం జరిగిన ప్రదేశాలకు విజయ్ బాబును తీసుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆల్రెడీ కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. జూన్ 27 నుంచి జూలై 3 వరకూ... ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ విజయ్ బాబును ప్రశ్నించడానికి హైకోర్టు నుంచి పోలీసులకు అనుమతి లభించింది.
Also Read : థియేటర్లలో 'పక్కా కమర్షియల్' తెలుగు సినిమాలు - ఓటీటీలో రెజీనా వెబ్ సిరీస్, బాలీవుడ్ డిజాస్టర్ మూవీస్
ఏప్రిల్ 27న విజయ్ బాబు మీద కేసు నమోదు అయ్యింది. ఆ తర్వాత అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన దేశం విడిచి పారిపోయారు. అరెస్ట్ నుంచి కేరళ హైకోర్టు రక్షణ కల్పించడంతో మే చివరి వారంలో కొచ్చి వచ్చారు.
ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’ - ఇందులో నిజమెంతా?
Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ
Oscars 2023: 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ - రాజమౌళి సినిమాకు అవార్డు గ్యారెంటీ అంటున్న మరో టాప్ సైట్!
Anasuya: ఇండస్ట్రీలో ఆడవాళ్లు మాట్లాడకూడదు, గిల్లితే గిల్లించుకోవాలి - అనసూయ కామెంట్స్!
Actor Nasser Injured: షూటింగులో గాయపడ్డ సీనియర్ నటుడు నాజర్!
AP Teachers : "మిలియన్ మార్చ్" నిర్వీర్యం కోసమే టార్గెట్ చేశారా ? ఏపీ టీచర్లు ప్రభుత్వంపై ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు ?
GAIL Recruitment: గెయిల్‌లో 282 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, జీతమెంతో తెలుసా?
Telangana Secretariat: కొత్త సెక్రెటేరియట్ వద్దకు సీఎం కేసీఆర్, భవనం మొత్తం పరిశీలన - కీలక ఆదేశాలు
Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !