అన్వేషించండి

HBD Ashok Galla : మాస్ అవతార్‌లో అశోక్ గల్లా - మేనల్లుడికి విషెస్ చెబుతూ మహేష్ బాబు పోస్ట్

హీరో సినిమా తర్వాత మరో కొత్త సినిమాతో మాస్ అవతార్ తో టాలెంటెడ్ హీరో అశోక్ గల్లా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందుకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Ashok Galla : హీరో సినిమాతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అశోక్ గల్లా మరో కొత్త సినిమాతో వెండితెరపై కనిపించనున్నాడు. ఏప్రిల్ 5న అశోక్ గల్లా పుట్టిన రోజు సందర్భంగా హీరో మహేష్ బాబు ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అశోక్ గల్లా నెక్ట్స్ చిత్రానికి సంబంధించిన టీజర్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

కృష్ణ మనవడిగా, మహేష్ బాబు మేనల్లుడిగా వారసత్వం పునికి తెచ్చుకుని తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో అశోక్ గల్లా . 'భ‌లే మంచి రోజు', 'శ‌మంత‌క‌మ‌ణి', 'దేవ‌దాస్' లాంటి విభిన్న చిత్రాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా 'హీరో' చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు.  2022లో రిలీజైన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోగా.. నష్టం కూడా వాటిల్లిందని వార్తలు కూడా వినిపించాయి. ఈ విషయంపై హీరో అశోక్ గల్లా సైతం ఇటీవల స్పందించారు. '2022 సంవత్సరం నా జీవితంలో వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా ఎన్నో అనూహ్యకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఆందోళకరమైన పరిస్థితుల మధ్య.... ఎంతో కాలంగా ఉన్న నా కల సాకారం అయ్యింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మా కుటుంబానికి.. మాటలకందని నష్టం కూడా జరిగిందంటూ ట్వీట్ చేశారు. 

దాంతో పాటు  మీ అంచనాలు అందుకోలేనేమో...? అని కొంత భయపడుతున్న నాకు.. సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ప్రతీ అప్ డేట్ కి మీరు ఇచ్చిన ఆదరణ చూసి... కొండంత బలం వచ్చింది. మీ ప్రేమ, అభిమానం.. ఆశీస్సులు తోడుగా ఉన్నంతవరకూ.. నాకు నచ్చిన ఈ సినిమా రంగంలో... శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. మిమ్మల్ని గర్వపడేలా చేస్తానంటూ అశోక్ గల్లా రాసుకొచ్చారు. మొదటి సినిమాలోనే బెరుకు లేకుండా నటించి, ఆకట్టుకునేలా డాన్సులు, ఫైట్స్ ఇరగదీసినా హీరో సినిమా హిట్ కు మాత్రం నోచుకోకపోవడంతో అశోక్ కాస్త నిరాశపడ్డాడు. 

ఆ తర్వాత ఫిబ్రవరి 5 న తన రెండో సినిమాను అశోక్ గల్లా ప్రకటించాడు. గుణ 369 ఫేం అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శ్రీ లలితాంబిక బ్యానర్ లో ప్రొడక్షన్ 1 గా తెరకెక్కనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా జరిగిన మూవీ పూజా కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్, బోయపాటి శ్రీను, నమ్రతా శిరోద్కర్, ప్రశాంత్ వర్మ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇక తాజాగా ఏప్రిల్ 5న అశోక్ గల్లా పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ టీజర్ ను రిలీజ్ చేశారు. బురదలో జరిగే ఫైట్‌ సన్నివేశంతో కట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ప్రిన్స్ మహేశ్ బాబు ఈ వీడియోకు సంబంధించిన యూట్యూబ్ వీడియో లింక్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. 

Also Read : మళ్ళీ చిక్కుల్లో 'ఆదిపురుష్' - శ్రీరామనవమి పోస్టర్ మీద ముంబైలో కంప్లైంట్

యూనిక్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అశోక్‌ గల్లా 'మాస్‌ అవతార్‌'లో కనిపించబోతున్నట్టు తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ ద్వారా తెలుస్తోంది. ప్రొడక్షన్‌ నంబర్‌ వన్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ (ఎన్‌ఆర్‌ఐ) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నట్టు సమాచారం. ఈ మూవీలో హీరోయిన్‌, ఇతర నటీనటుల వివరాలపై టీం ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఇంకా టైటిల్‌ ఫిక్స్ కాని ఈ చిత్రానికి సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్‌ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌ కాగా‌ తమ్మిరాజు ఎడిటర్ గా ఉండనున్నారు. ఇక 'జాంబిరెడ్డి'  ప్రశాంత్‌ వర్మ ఈ చిత్రానికి కథనందించడం మరో చెప్పుకోదగిన విషయం. కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేసిన 'గుణ 369' బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో అశోక్ గల్లా హీరోగా చేస్తోన్న ఈ ఫిల్మ్  ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని ఆత్రుతగా ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read బాలీవుడ్‌లో ఎన్టీఆర్ భారీ సినిమా - హృతిక్ రోషన్ 'వార్ 2'లో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP DesamTirumala Laddu Controversy | తిరుమల లడ్డుని ఎలా తయారు చేస్తారు | ABP Desamచాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Neet Counselling : మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే 
మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో లోకల్ కోటాపై ప్రభుత్వానికి ఊరట- హైకోర్టుపై సుప్రీం స్టే
Bhogapuram Airport: భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
భోగాపురం దగ్గర సైట్ అమరావతి కన్నా కాస్ట్‌లీ గురూ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనలేరు!
Army Bus Accident: జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
జమ్ము కశ్మీర్లో బస్సు ప్రమాదం, ముగ్గురు జవాన్లు దుర్మరణం- మరో ఆరుగురి పరిస్థితి విషమం
Hyper Aadi: పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
పవన్ కళ్యాణ్ కు విరాళం అందజేసిన హైపర్ ఆది, ఎన్ని లక్షలు అంటే!
Duleep Trophy: అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
అనంతపురం స్టేడియంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులు అరెస్టు
Travis Head: అలా ఎలా  కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
అలా ఎలా కొడుతున్నావ్ బ్రో, హెడ్‌ విధ్వంసకర సెంచరీ
Yashasvi Jaiswal: 147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
147 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి, చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వీ
Viral News: సోషల్ మీడియాలో అమ్మకానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కస్టమర్ల డేటా, షాకింగ్ న్యూస్
సోషల్ మీడియాలో అమ్మకానికి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌ కస్టమర్ల డేటా, షాకింగ్ న్యూస్
Embed widget