Tharun Gives Clarity On SSMB28 : మహేష్ - త్రివిక్రమ్ సినిమా గురించి నోరు విప్పిన తరుణ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేయనున్న సినిమాలో తరుణ్ కీలక పాత్ర చేయనున్నట్లు వినబడుతోంది. ఎట్టకేలకు ఈ సినిమా గురించి తరుణ్ పెదవి విప్పారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఒక సినిమా (SSMB28) రూపొందుతోంది. అతి త్వరలో, సెప్టెంబర్ రెండో వారంలో షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే, కాస్టింగ్ పరంగా ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. అందులో తరుణ్ వార్త ఒకటి.
మహేష్ సినిమాలో తరుణ్ నటిస్తున్నారా?
మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో తరుణ్ కీలక పాత్రలో నటించడానికి 'ఎస్' చెప్పారని ఓ వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. 'నువ్వే కావాలి'కి త్రివిక్రమ్ సంభాషణలు రాశారు. తరుణ్ హీరోగా నటించిన 'నువ్వే నువ్వే'తో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. అందులో మహేష్ సినిమాలో తరుణ్ అనగానే... ఎంతో కొంత నిజం ఉంటుందని చాలా మంది నమ్మారు. త్రివిక్రమ్‌కు, తరుణ్‌కు మధ్య సత్సంబంధాలు ఉండటంతో తరుణ్ చేయవచ్చని అనుకున్నారు. అయితే, అసలు నిజం వేరు.
నన్ను ఎవరూ సంప్రదించలేదు : తరుణ్
మహేశ్ బాబు - త్రివిక్రమ్ సినిమా కోసం తనను ఎవరూ సంప్రదించలేదని తరుణ్ స్పష్టత ఇచ్చారు. ప్రచారంలో ఉన్న వార్త నిజం కాదని ఆయన పేర్కొన్నారు. తన చిత్రాలకు సంబంధించిన ఎటువంటి సమాచారం అయినా సరే ప్రేక్షకులు, తన అభిమానులతో పంచుకుంటానని తరుణ్ తెలిపారు.
మహేష్ సినిమాలో మలయాళ నటుడు రోషన్ మాథ్యూ
మహేశ్ బాబు సినిమాలో తరుణ్ లేరని క్లారిటీ వచ్చింది. అయితే... మలయాళ నటుడు రోషన్ మాథ్యూ ఉన్నారని సమాచారం. మలయాళంలో కొన్ని సినిమాలు చేయన, విక్రమ్ 'కోబ్రా'లోనూ కీలక పాత్ర చేశారు. ఆయన నటన నచ్చడంతో త్రివిక్రమ్ మంచి రోల్ ఆఫర్ చేశారట (Malayalam Actor Roshan Mathew In SSMB28).
టైటిల్ ఖరారు చేశారా?
మహేశ్ బాబు - త్రివిక్రమ్ సినిమాకు 'అర్జునుడు' టైటిల్ పరిశీలనలో ఉందని ఫిల్మ్ నగర్ ఖబర్. మాటల మాంత్రికుడికి 'A' అక్షరంతో స్టార్ట్ అయ్యే టైటిల్ పెట్టడం సెంటిమెంట్. అదీ ఈ మధ్య అలవాటు అయ్యింది. అంతకు ముందు 'నువ్వే నువ్వే', 'ఖలేజా', 'జల్సా', 'సన్కునాఫ్ సత్యమూర్తి' సినిమా టైటిల్స్ 'అ'తో మొదలు కాలేదు. కథకు అనుగుణంగా టైటిల్ ఖరారు చేస్తారు. ఇప్పుడు మహేశ్ సినిమాకు 'అర్జునుడు' టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారట.
Also Read : 'కోబ్రా' రివ్యూ : విక్రమ్ సినిమా ఎలా ఉంది? తెలుగులో హిట్ అవుతుందా?
పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా, విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.
Also Read : సుమన్ బతికుండగా చంపేసిన యూట్యూబ్ ఛానళ్లు