అన్వేషించండి

Mahesh Babu: 'శ్రీమంతుడు' సెన్సేషనల్ రికార్డ్ - ఆ ఘనత సాధించిన ఏకైక హీరోగా మహేష్!

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అయితే తాజాగా యూట్యూబ్లో ఈ సినిమా అరుదైన ఘనతను సాధించింది.

కొన్ని సినిమాలను ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. థియేటర్స్ లో విడుదలై సంవత్సరాలు గడుస్తున్నా టీవీల్లో వచ్చినప్పుడు ఆ సినిమాలను చూసి తెగ ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటి సినిమాల్లో 'నువ్వు నాకు నచ్చావ్', 'అతడు', 'ఖలేజా', 'బిజినెస్ మెన్'.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' మూవీ తాజాగా యూట్యూబ్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 2015 లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుని నాన్- బాహుబలి హిట్గా నిలిచింది.

ఇక సినిమా విడుదలై సుమారు  8 ఏళ్ళు అవుతున్నా, తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది. యూట్యూబ్లో 200 మిలియన్+ వ్యూస్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా 'శ్రీమంతుడు' నిలిచింది. అంతేకాదు యూట్యూబ్ లో అత్యధిక వీక్షణలు పొందిన తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం. గ్రామాన్ని దత్తత తీసుకొని డెవలప్ చేయాలనే కథతో శ్రీమంతుడు మూవీ రూపొందింది. తన తండ్రి జన్మస్థలమైన గ్రామాన్ని దత్తత తీసుకున్న ఒక ఆదర్శవంతమైన యువకుడి కథను ఈ సినిమాలో చూపించారు.ఈ చిత్రం గ్రామాల ప్రాముఖ్యతను, మానవీయ విలువలను నేర్పుతుంది.

సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు పలు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి పనులు కూడా చేపట్టారు. జనాలపై అంత ప్రభావం చూపించింది 'శ్రీమంతుడు' మూవీ. ఈ సినిమాతోనే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో తొలి అడుగు వేశారు. మహేష్ కి జోడిగా శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి అనేక అవార్డులు వచ్చాయి. ఇక ఈ సినిమాతో నిర్మాణరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతూ అగ్ర హీరోలతో మంచి సినిమాలను రూపొందిస్తున్నారు.

'శ్రీమంతుడు'  అరుదైన ఘనత సాధించడం పట్ల మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక 'శ్రీమంతుడు' మూవీ తర్వాత కొరటాల శివ - మహేష్ కాంబినేషన్లో వచ్చిన 'భరత్ అనే నేను' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడం విశేషం. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో మహేష్ కి జోడిగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా అనంతరం దర్శక ధీరుడు రాజమౌళితో ఓ భారీ అడ్వెంచర్స్ మూవీ చేస్తున్నారు మహేష్ బాబు.

Also Read : ఆసక్తికరంగా అక్షయ్ కుమార్ 'మిషన్ రాణిగంజ్' టీజర్ - అప్పుడే ఇండియా పేరు మార్చేశారు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget