By: ABP Desam | Updated at : 29 Aug 2023 10:53 AM (IST)
Photo Credit: Namrata Shirodkar/Instagram
తెలుగు సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, సేవా గుణంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నారు. గుండె సంబంధ సమస్యలతో బాధ పడుతున్న ఎంతో మంది చిన్నారులకు ఆపరేషన్లు చేయించి ప్రాణ దాతగా నిలుస్తున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా చిన్నారుల గుండె ఆపరేషన్ల కోసం ఆంధ్రా హాస్పిటల్స్, రెయిన్ బో హాస్పిటల్స్ తో కలిసి పని చేస్తున్నారు. సాయం కోసం వచ్చిన ప్రతి చిన్నారి తల్లిదండ్రులకు కొండంత ధైర్యం అందిస్తున్నారు. గుండె ఆపరేషన్లు చేయించి ప్రాణాలు నిలుపుతున్నారు.
అటు తండ్రి బాటలోనే నడుస్తున్నాడు ఆయన కొడుకు గౌతమ్. తాజాగా గుండె ఆపరేష్ చేయించుకున్న ఓ బాబును హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించాడు. తన స్కూల్ అయిపోయాక నేరుగా హాస్పిటల్ కే వెళ్లాడు. సర్జరీ సక్సెస్ అయిన తర్వాత తనను కలిశాడు. బాబు సంతోషంగా ఉండేందుకు వెళ్లే సమయంలో ఓ బహుమతి కూడా తీసుకెళ్లి ఇచ్చాడు. బాబుతో కాసేపు సరదాగా ముచ్చటించాడు. డాక్టర్లను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. బాబు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వచ్చాడు.
ఈ విషయాన్ని గౌతమ్ తల్లి నమ్రత సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గౌతమ్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్న బాబును పరామర్శించే ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. స్కూల్ అయిపోగానే నేరుగా తను హాస్పిటల్ కు వెళ్లి బాబును పరామర్శించి వచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే చాలా మంది గుండె ఆపరేషన్ చేయించుకున్న పిల్లలను తను వెళ్లి కలిసి వచ్చాడని చెప్పారు. గౌతమ్ ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు. చాలా కాలంగా మహేష్ బాబు ఎంతో మంది పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయించారు. దీని కోసం పలు హాస్పిటల్స్ తో కలిసి పని చేస్తున్నారు. తరుచుగా మహేష్ ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటల్స్ కు వెళ్లి గుండె ఆపరేషన్ చేయించుకున్న వారిని పరామర్శిస్తుంటారు. చిన్నారులతో మాట్లాడి, వారి కుటుంబ సభ్యుల్లో మనో ధైర్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే గౌతమ్ తరచుగా వెళ్లి వస్తుంటారని నమ్రత తెలిపారు.
నమ్రత పోస్టు చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు తనయుడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తండ్రి మాదిరిగానే మంచి మనసున్న అబ్బాయి అంటూ కొనియాడుతున్నారు. మహేష్ ఫ్యామిలీ మంచి మనసు కారణంగా ఎంతో మంది తల్లిదండ్రుల తమ పిల్లలను కాపాడుకుని సంతోషంగా ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు. మహేష్ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నారు.
Read Also: రజినీకాంత్ సినిమాలో RCB జెర్సీని తొలగించాలని ఆదేశించిన ఢిల్లీ హైకోర్ట్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Ganapath Teaser: టైగర్ ష్రాఫ్ ‘గణపథ్‘ టీజర్ చూశారా? యాక్షన్ సీన్లకు గూస్ బంప్స్ రావాల్సిందే!
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే
Raveena Tandon: ఆయన పెదాలు తాకగానే- షాకింగ్ విషయాన్ని వెల్లడించిన రవీనా టాండన్!
Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?
Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ
YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి, కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్
తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం
బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు
/body>