అన్వేషించండి

Mahesh Babu’s Most Expensive Things: లేటెస్ట్ కార్లు, హైఎండ్ మల్టీప్లెక్స్ థియేటర్లు, ఇంకా ఎన్నో - మహేష్ బాబు బంగ్లా ఖరీదు ఎంతో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు, తన లైఫ్ సైతం అదే స్థాయిలో లగ్జరీగా గడుపుతున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే బంగళాతో పాటు విలువైన లగ్జరీ కార్లనను కలిగి ఉన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్ బాబు. రెండు దశాబ్దాలకు పైగా ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. 1989లో ‘పోరాటం’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన, ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నారు. 1999లో వచ్చిన ‘రాజకుమారుడు’  సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఇండస్ట్రీలో తనకంటూ ఓ బ్రాండ్‌ను ఏర్పర్చుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు నికర ఆస్తుల విలువ $30 మిలియన్లు(సుమారు రూ. 200 కోట్లు)గా ఉంది. సినిమాల ద్వారా వచ్చిన సంపాదనతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.  అద్భుతమైన బంగళా, లగ్జరీ కార్లు, హైఎండ్ మల్టీఫ్లెక్స్ థియేటర్లను కలిగి ఉన్నారు.  

రూ.28 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఆయనకు విలాసవంతమైన బంగళా ఉంది. ఇందులో అన్ని అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇండోర్ పూల్,  విశాలమైన గార్డెన్ ఏరియా, లాంజ్ ఏరియా, రీడింగ్ స్పేస్ తో పాటు ఇతర సౌకర్యాలను కలిగి ఉంది. మహేష్ తన భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారతో పాటు ప్లూటో, నుబో అనే కుక్క పిల్లలతో ఇక్కడ నివశిస్తున్నారు. ఈ బంగళా ఖరీదు సుమారు రూ. 28 కోట్లు ఉంటుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

విలాసవంతమైన కార్లు

1. ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారు- రూ.1.19 కోట్లు

రీసెంట్ గా మహేష్ బాబు తన గ్యారేజీలోకి ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారును  తీసుకొచ్చారు. దీని ఖరీదు రూ. 1.19 కోట్లు. ఈ ఎలక్ట్రిక్ SUV హై-స్పీడ్ ఛార్జింగ్, ఆల్-వీల్ డ్రైవ్‌తో వస్తుంది. 71kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. గరిష్టంగా 308 Bhp పవర్ తో పాటు 540 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, ఆడి వర్చువల్ కాక్‌ పిట్, 16-స్పీకర్ ఓలుఫ్‌సెన్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్ సహా పలు అత్యధునిక ఫీచర్లను కలిగి ఉంది.

2. రేంజ్ రోవర్ వోగ్ ఆటోబయోగ్రఫీ- రూ. 2.5 కోట్లు

మహేష్ బాబు దగ్గర ఉన్న మరో లగ్జరీ కారు రేంజ్ రోవర్ వోగ్ ఆటోబయోగ్రఫీ.  దీని ధర రూ. 2.18 కోట్ల నుంచి మొదలవుతుంది. డీజిల్ వేరియెంట్ కావాలి అనుకుంటే మరో రూ. 50 లక్షల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.  

3. వ్యానిటీ వ్యాన్- రూ. 6 కోట్లు

మహేష్ బాబు తన స్టార్‌ డమ్‌ కు తగిన వ్యానిటీ వ్యాన్ ను కలిగి ఉన్నాడు. దీని ఖరీరు  రూ. 6.2 కోట్లు. దీని లోపల అత్యంత విలాసవంతంగా ఉంటుంది.  విశాలమైన సిట్టింగ్, ఖరీదైన ఫర్నిచర్ ను కలిగి ఉంటుంది.  

4. రేంజ్ రోవర్ వోగ్- రూ. 2.31 కోట్లు

భారత్ లో బాగా పాపులర్ అయిన  రేంజ్ రోవర్ వోగ్ ను కూడా మహేష్ కొలుగోలు చేశారు.  డీజిల్ వెర్షన్ 3.0-లీటర్ V6  ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 240 Bhp పవర్ తో పాటు 500 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 16 వేరియంట్లలో వస్తుంది. దీని ధర రూ. 2.31 కోట్లు.

5. మెర్సిడెస్ బెంజ్ ఇ- రూ. 84.99 లక్షలు

జర్మన్ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ రూపొందించిన ఈ కారు 5 వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 66.99 లక్షల నుండి మొదలై రూ. 84.99 లక్షల వరకు ఉంటుంది.  ఈ కారు గరిష్టంగా 281 bhp పవర్ తో పాటు 600 nm  టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

6. లంబోర్ఘిని గల్లార్డో- రూ. 2.80 కోట్లు

మహేష్ బాబు కార్ల కలెక్షన్‌లో ఖరీదైన లంబోర్ఘిని గల్లార్డో కూడా ఉంది. ఈ రెండు-సీట్ల కారు  ధర రూ. 2.80 కోట్లు ఉంటుంది. ఇది 550 bhp పవర్, 540Nm టార్క్‌ ను అందిస్తుంది.

AMB సినిమాస్

మహేష్ బాబుకు సంబంధించిన అత్యంత ఖరీదైన ఆస్తులలో ఈ హై-ఎండ్ మల్టీప్లెక్స్ థియేటర్లు కూడా ఉన్నాయి. వీటి నిర్వహణ కోసం ఆయన  ఏషియన్ సినిమాస్‌తో కలిసి పని చేస్తున్నారు.  

Read Also: రీల్ హీరో to రియల్ హీరో: మహేష్ బాబు గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget