Varanasi : శ్రీరాముడు రెడీ అవుతున్నాడు - 'వారణాసి'లో మరో స్పెషల్ రోల్...
Mahesh Babu : రాజమౌళి 'వారణాసి' మూవీపై క్రేజీ అప్డేట్ ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. టైం ట్రావెల్ సీక్వెన్స్ కోసం మహేష్ మిల్క్ బాయ్‌లా లుక్ మార్చారట.

Mahesh Babu New Look For Varanasi Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి 'వారణాసి' టైటిల్ గ్లింప్స్ యావత్ సినీ ప్రపంచం తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది. ఈ మూవీలో మహేష్ 'రుద్ర'గా శ్రీరాముడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. వారణాసి ఆవిర్భావం నుంచీ రామాయణంలో ఓ ముఖ్య ఘట్టాన్ని చూపించనున్నారు.
టైం ట్రావెల్ సీక్వెన్స్
ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి కాగా ఇప్పుడు మూవీకే కీలకమైన టైం ట్రావెల్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటివరకూ గుబురు గెడ్డం, హెయిర్‌తో ఉన్న మహేష్ లుక్ మార్చారట. క్లీన్ షేవ్ చేసుకుని మిల్క్ బాయ్‌లా లుక్ మార్చినట్లు టాక్ వినిపిస్తోంది.
'మీరు ఊహించనంత అందంగా ఉంటాడు. ఊహించనంత పరాక్రమంగా ఉంటాడు. దయార్ద్ర హృదయంతో ఉంటాడు. ఊహించనంత రౌద్రంగా ఉంటాడు. అన్నీ రసాలు పండిస్తాడు. రాముడిగా ఆయన లుక్ గూస్ బంప్స్ వచ్చింది.' అంటూ రాజమౌళి ఎలివేషన్ ఇవ్వడంతో ఈ లుక్‌పై అందరిలోనూ హైప్ క్రియేట్ అవుతోంది.
Also Read : సినిమాల సందడి... అదిరిపోద్ది సంక్రాంతి - ఈ వారం థియేటర్స్, ఓటీటీ మూవీస్ ఫుల్ లిస్ట్ ఇదే!
మరో స్పెషల్ రోల్
ఈ మూవీలో ఇప్పటివరకూ 3 క్యారెక్టర్స్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. 'రుద్ర'గా మహేష్ బాబు, మందాకిని పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, విలన్ 'కుంభ'గా పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్నారు. వీరితో పాటే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఆయన రోల్ ఏంటి అనేది ఇంకా రివీల్ చేయలేదు. అలాగే, మరో స్పెషల్ రోల్ కూడా జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. దీనిలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని... ఇందుకోసం మరో బాలీవుడ్ నటుడిని తీసుకోబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
రిలీజ్ ఎప్పుడంటే?
టైటిల్ గ్లింప్స్ ఈవెంట్‌లో 2027 సమ్మర్‌లో మూవీ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు రాజమౌళి. తాజాగా, డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 'రామాయణం'లో ఓ ముఖ్య ఘట్టం ఆధారంగా మూవీని తెరకెక్కిస్తుండగా... అందుకు తగ్గట్లుగానే ఏప్రిల్ 9న శ్రీరామనవమి సందర్భంగా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఓ సరికొత్త ప్రపంచాన్నే సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించేందుకు జక్కన్న కృషి చేస్తున్నారు.
గ్లింప్స్ సరికొత్త రికార్డు
'వారణాసి' టైటిల్ గ్లింప్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా ఆ వీడియో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పారిస్‌లోని ప్రతిష్టాత్మక వేదిక 'లే గ్రాండ్ రెక్స్'లో ఈ టీజర్‌ను ఇటీవల ప్లే చేశారు. ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా 'వారణాసి' రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ దాదాపు రూ.1300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సృష్టి ఆవిర్భావం నుంచి రామాయణం వరకూ అనేక ఘట్టాలను కీలకంగా చూపించనున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా... మొత్తం 6 పాటలు ఉంటాయని ఇదివరకే ప్రకటించారు. విజువల్ వండర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






















