Krishna Is Fine: ఆరోగ్యంగా సూపర్‌స్టార్ కృష్ణ, ఆయన లేటెస్ట్ ఫొటో ఇదిగో

సూపర్‌స్టార్ కృష్ణకు ఏమైంది? సోషల్ మీడియాలో నిన్న అంతా ఓ ఫొటో చక్కర్లు కొట్టింది. అది చూసి ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ఆయన సూపర్ ఫైన్ అని చెప్పడానికి సాక్ష్యంగా లేటెస్ట్ ఫొటో ఇదిగో!

FOLLOW US: 

ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని (Krishna Ghattamaneni) ఆరోగ్యం ఎలా ఉంది? అంటే... 'సూపర్ ఫైన్' అని చెప్పాలి. అసలు, ఆయనకు ఏం కాలేదు కూడా! మరి, ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది? అంటే... సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక ఫొటో. ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌లో కృష్ణ పాల్గొన్నారు. అందులో ఆయన్ను చూసి రకరకాల అనుమానాలు, సందేహాలు వచ్చాయి.

కుటుంబ సభ్యులతో కృష్ణ ఉన్న ఫొటో శుక్రవారం విడుదలైంది. అందులో ఆయన ముఖం మీద ఏవో తెల్ల మచ్చలు ఉన్నట్టు కనిపించాయి. అసలు విషయం ఏంటంటే... కరోనా వచ్చినప్పటి నుంచి కృష్ణ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.  మాస్క్ లేకుండా ఆయన బయటకు రావడం లేదు. ఇప్పటికీ మాస్క్ ధరిస్తున్నారు. గ్లాస్ మాస్క్ పెట్టుకోవడం వల్ల ఫొటోలో అది సరిగా పడలేదు. తెల్ల మచ్చలు కింద వచ్చాయి. అయితే... ఆ విషయం చెప్పినా చాలా మందిలో అనుమానం అలాగే ఉంది. కృష్ణకు ఏదో అయ్యిందని అనుకోవడం మొదలు పెట్టారు. అయితే... కృష్ణ లేటెస్ట్ ఫొటో ఆ అనుమానాలకు సమాధానం ఇచ్చిందని చెప్పవచ్చు.

కృష్ణను ఈ రోజు ఆయన వీరాభిమాని ఒకరు కలిశారు. కొన్నేళ్లుగా కృష్ణకు చెందిన స్టూడియోలోనే పని చేస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కృష్ణను కలిశారు. అప్పుడు ఫొటోలు తీసుకున్నారు. ఆ ఫొటో ఇది. వీటిలో కృష్ణ ఆరోగ్యంగా కనిపించారు. ఎప్పటిలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. సో... ఘట్టమనేని, సూపర్ స్టార్ ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.

Also Read: 'గాలివాన' రివ్యూ: సాయి కుమార్, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన 'గాలివాన' వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

ఇప్పుడు కృష్ణ వయసు 78 సంవత్సరాలు. ఆయన ఆరోగ్యంపై వయసు ప్రభావం కొంత ఉందని టాక్. అంటే... వయసు పెరగడం వల్ల వచ్చే చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్దగా ఏమీ లేవని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఎక్కువగా ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబ సభ్యుల ఇళ్లల్లో వేడుకలకు తప్పకుండా హాజరు అవుతున్నారు. సుధీర్ బాబు, మంజుల ఇంట్లో వేడుకలు జరిగితే తప్పకుండా కృష్ణ అటెండ్ అవుతారు. కృష్ణ బర్త్ డే ఫంక్షన్ రోజున ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆయన దగ్గరకు వెళతారు.  

Also Read: 'బ్లడీ మేరీ' రివ్యూ: ఓటీటీలో విడుదలైన నివేదా పేతురాజ్ సినిమా ఎలా ఉందంటే?

Published at : 16 Apr 2022 03:38 PM (IST) Tags: Krishna Krishna Ghattamaneni Krisna Health What Happened To Krishna Krishna Latest Health Update

సంబంధిత కథనాలు

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !

Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !

Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!

Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!

MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్‌ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !

MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్‌	గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !