Mahesh Babu Remuneration: మహేష్ బాబు 60 కోట్లు, త్రివిక్రమ్‌కు 50 కోట్లు - నిర్మాతకు 100 కోట్ల లాభం!?
మహేష్ బాబు పారితోషికం ఎంత? త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ సినిమాకు ఆయన ఎంత తీసుకుంటున్నారు? మరి, త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ ఎంత?
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ సినిమా రూపొందుతోంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. 'అతడు', 'ఖలేజా' చిత్రాలకు కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ విజయాలకు తోడు ఇప్పుడు మహేష్, త్రివిక్రమ్ మార్కెట్స్ పెరిగాయి. అందుకు తగ్గట్టుగా వాళ్ళిద్దరి రెమ్యూనరేషన్స్ కూడా!
మహేష్ బాబు 28వ చిత్రమిది. దీనికి ఆయన అక్షరాలా 60 కోట్ల రూపాయల (Mahesh Babu Remuneration For SSMB 28) పారితోషికం తీసుకుంటున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. దర్శకుడు త్రివిక్రమ్ ఆయన కంటే పది కోట్లు తక్కువ... అంటే 50 కోట్ల రూపాయల పారితోషికం (Trivikram remuneration for SSMB 28) అందుకుంటున్నారట. వీళ్ళిద్దరికీ 110 కోట్ల రూపాయలు ఇవ్వడానికి రెడీ అయిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ... సినిమాలో మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్స్‌తో కలిపి ప్రొడక్షన్‌కు రూ. 90 కోట్ల బడ్జెట్ కేటాయించిందని ఫిల్మ్ నగర్ గుసగుస.
తెలుగు సినిమా మార్కెట్ ఇటీవల బాగా పెరిగింది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'అల వైకుంఠపురములో', 'పుష్ప' సినిమాలకు భారీ వసూళ్లు వచ్చాయి. 'సర్కారు వారి పాట'కు థియేటర్ల నుంచి 200 కోట్ల రూపాయలు వచ్చాయని నిర్మాతలు ప్రకటించారు. ఇంకా సినిమా ఆడుతోంది. మరిన్ని వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.
మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ. 150 కోట్ల కంటే ఎక్కువ రావొచ్చని ఆశిస్తున్నారు. నాన్ - థియేట్రికల్ రైట్స్ (శాటిలైట్, డిజిటల్) రూపంలో మరో 150 కోట్లు రావచ్చని అంచనా. ఈ లెక్కన నిర్మాతలకు వంద కోట్ల రూపాయలు లాభం అన్నమాట.
Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేసిన త్రివిక్రమ్ అండ్ కో
SSMB 28లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మరో కథానాయిక నటించే అవకాశం ఉందని సమాచారం. ఆ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారో? వెయిట్ అండ్ సీ.
View this post on Instagram