అన్వేషించండి

Mahaveerudu: శివ కార్తికేయన్ 'మహా వీరుడు' వచ్చేది ఆ ఓటీటీలోకే!

శివకార్తికేయన్ లేటెస్ట్ గా నటించి, మడోన్నా అశ్విన్ దర్శకత్వం వహించిన తమిళ యాక్షన్ కామెడీ-డ్రామా చిత్రం మహా వీరుడు ఓటీటీ విడుదలపై ఓ వార్త వచ్చింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

Maha Veerudu OTT Release : కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటించిన తమిళ యాక్షన్ కామెడీ-డ్రామా చిత్రం 'మహా వీరుడు' ఈ రోజు పలు చోట్ల రిలీజ్ కాగా.. మరి కొన్ని చోట్ల మాత్రం కంటెంట్ ఆలస్యంగా కారణంగా షోస్ ను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఆన్ లైన్ విడుదలకు సంబంధించి ఓ అప్ డేట్ వైరల్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని శాంతి టాకీస్‌ ​​గత కొన్ని రోజుల క్రితమే ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది.

'మహా వీరుడు' డిజిటల్ హక్కులను అమెజాన్ సొంతం చేసుకుందని ట్వీట్ లో పేర్కొంది. తాజాగా ఈ సినిమా థ్రియేటికల్ హక్కులను అమెజాన్ రూ.33 కోట్లకు కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శివ కార్తికేయన్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో అత్యంత ఓటీటీ ధరకు అమ్ముడైంది ఈ సినిమానే కావడం గమనార్హం. ఈ సినిమా ఆగష్టు నెలాఖరు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. కాగా మహా వీరుడు మూవీ అమెజాన్ లో ఎప్పట్నుంచి విడుదల కానుందన్న విషయాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మడోన్నా అశ్విన్ రూపొందించిన ఈ యాక్షన్ కామెడీ డ్రామా 'మహా వీరుడు' మూవీకి దర్శకుడిగా వ్యవహరించగా.. ఈ సినిమాలో శివకార్తికేయన్ తో పాటు అదితి శంకర్, మిస్కిన్, యోగి బాబు, సరిత, సునీల్, మోనిషా బ్లెస్సీ , తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా రిలీజ్ కానుండగా.. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ ఈ మూవీని నిర్మించారు.

'మహా వీరుడు' సినిమా పూర్తిగా యాక్షన్-కామెడీ అంశాలతో కూడిన మిస్టరీ స్టోరీ. ఇది ఒక రాజకీయ నాయకుడు, న్యూస్ ఛానెల్ ఆర్ట్ డైరెక్టర్ మధ్య జరిగే సన్నివేశాలను చూపించారు. ఒక రాజకీయ నాయకుడు తన జీవితాన్ని మెరుగ్గా మలచుకోవడం కోసం ఎలాంటి పనులు చేశాడు? వాటిని హీరో ఎలా తిప్పికొట్టాడు అన్నది సినిమా సారాంశంగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా రూ.35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'మహా వీరుడు' సినిమా.. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్, శివ కార్తికేయన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో నటించిన నటులు, కథ, టాలెంట్ దర్శకుడు.. లాంటి ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉండడమేనని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమా స్టాండర్డ్స్‌ను అందుకుంటే ఈ ఏడాది టాప్ తమిళ సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.

Read Also : Baby Movie 2023 Review - 'బేబీ' రివ్యూ : ఆనంద్, విరాజ్ - ఇద్దరిలో వైష్ణవి చైతన్య ఎవరి పిల్ల? సినిమా ఎలా ఉందంటే?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

టాప్ హెడ్ లైన్స్

Niharika Konidela : నిహారిక కొణిదెల మ్యూజికల్ జర్నీ - కొత్త మూవీతో కొత్త రంగంలోకి మెగా డాటర్
నిహారిక కొణిదెల మ్యూజికల్ జర్నీ - కొత్త మూవీతో కొత్త రంగంలోకి మెగా డాటర్
Srimathi Movie Trailer : ఒకే ఒక్క ప్రశ్న... ఆలోచింపచేసే ట్రైలర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న నివేదా 'శ్రీమతి'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఒకే ఒక్క ప్రశ్న... ఆలోచింపచేసే ట్రైలర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న నివేదా 'శ్రీమతి'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Vishnu Manchu Prabhudeva : ప్రభుదేవా డైరెక్టర్‌గా విష్ణు మంచు మూవీ - పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్!
ప్రభుదేవా డైరెక్టర్‌గా విష్ణు మంచు మూవీ - పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్!
OM Collections : 100 కోట్ల క్లబ్‌లో 'ఓం' - ధనుష్ కెరీర్‌లోనే ఫస్ట్ టైం
100 కోట్ల క్లబ్‌లో 'ఓం' - ధనుష్ కెరీర్‌లోనే ఫస్ట్ టైం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
Bigg Boss Season 10 Today November 23rd: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముఖం మీద కాఫీ విసిరి తుక్కు రేగొట్టారు! అందర్నీ ముకేశ్ రెచ్చగొడుతున్నాడా!
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
CM Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
Embed widget