Madharaasi Collections: తమిళ్‌లో స్టడీగా 'మదరాసి'... మరి తెలుగులో? శివకార్తికేయన్ సినిమా రెండు రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Madharaasi Box Office Collection Day 2: 'మదరాసి'కి మిక్స్డ్ / ఫ్లాప్ టాక్ వచ్చినా తమిళంలో శివకార్తికేయన్ ఇమేజ్ థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తోంది. రెండో రోజు అక్కడ కలెక్షన్లు స్టడీగా ఉన్నాయ్.

Madharaasi Two Days Collection: తమిళ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తీసిన లేటెస్ట్ సినిమా 'మదరాసి'. విడుదలకు ముందు వెయ్యి కోట్ల సినిమాలు ఎంటర్‌టైనర్స్ అని, తమిళ్ డైరెక్టర్ ఆడియన్స్‌ను ఎడ్యుకేట్ చేస్తారని కామెంట్ చేశారు. ఆయన వ్యాఖ్యల మీద తెలుగు సోషల్ మీడియా యువత భగ్గుమన్నది. సినిమా విడుదల తర్వాత తమ స్టైల్‌లో సెటైర్లు వేసింది. తెలుగులో 'మదరాసి'కి ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ తమిళ్‌లో మాత్రం స్టడీగా ఉన్నట్టే లెక్క. హీరో శివకార్తికేయన్ ఇమేజ్ థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తోంది. రెండు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకోండి.
రెండో రోజూ పది కోట్లకు పైగా కలెక్షన్లు!
Madharaasi Two Days Collection: ఇండియాలో మొదటి రోజు 'మదరాసి' పది కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. రెండో రోజు సైతం ఈ సినిమాకు పది కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.
'మదరాసి'కి శనివారం (సెప్టెంబర్ 6న) తమిళంలో 10.15 కోట్ల రూపాయల నెట్ వచ్చినట్టు ట్రేడ్ పోర్టల్స్ తెలిపాయి. తెలుగులో రూ. 1.11 కోట్ల నెట్ వచ్చిందట. దాంతో రెండో రోజు ఇండియాలో నెట్ కలెక్షన్ రూ. 11.26 కోట్లు అయ్యింది. మొదటి రోజు ఈ మూవీకి ఇండియాలో రూ. 13.65 కోట్ల నెట్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో రెండు రోజుల్లో ఇండియాలో ఈ సినిమా రూ. 24.91 కోట్ల నెట్ కలెక్షన్ రాబట్టింది. హిందీలో ఈ మూవీకి ఆశించిన రిజల్ట్ రాలేదు. హిందీ మార్కెట్ నుంచి ఫస్ట్ డే పది లక్షలు మాత్రమే వచ్చాయి. రెండో రోజు అది కూడా లేదు.
Also Read: లిటిల్ హార్ట్స్ కలెక్షన్లు: రెండో రోజు డబుల్ ధమాకా... బాక్సాఫీస్ బరిలో దుమ్ము రేపిన చిన్న సినిమా
'మదరాసి'కి ఓవర్సీస్ నుంచి మంచి నంబర్స్ వస్తున్నాయ్. ఫస్ట్ డే అక్కడ రూ. 8 కోట్లకు కలెక్ట్ చేసినట్టు టాక్. టోటల్ వరల్డ్ వైడ్ ఓపెనింగ్ డే గ్రాస్ కలెక్షన్లు అటు ఇటుగా రూ. 25 కోట్లు అని అంచనా. రెండు రోజు కూడా రూ. 20 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉంది. దాంతో రెండు రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు రూ. 45 కోట్లు దాటతాయి.
శివకార్తికేయన్ సరసన రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించిన 'మదరాసి'కి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఇందులో విద్యుత్ జమాల్ హీరోయిన్. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించారు. అయితే ఆయన మార్క్ సాంగ్స్, ఆర్ఆర్ మిస్ అయ్యాయని ఆడియన్స్ నుంచి కంప్లైంట్ వచ్చింది. సినిమాలో సీన్స్ మీద కూడా కంప్లైంట్ ఉందనుకోండి. అయితే తమిళ్ మార్కెట్టులో శివకార్తికేయన్ ఇమేజ్ వల్ల సినిమా సేవ్ అవుతోంది.
Also Read: అనుష్క సినిమాను బీట్ చేసిన కల్యాణి ప్రియదర్శన్ మూవీ... ఫస్ట్ డే కలెక్షన్లలో షాకింగ్ రిజల్ట్!





















