అన్వేషించండి

Maa Inti Bangaram Collections: మా ఇంటి బంగారం ఫస్ట్ డే కలెక్షన్లు... సమంత సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్

Maa Inti Bangaram Box Office Collection Day 1: సమంత స్టార్‌డమ్‌కు 'మా ఇంటి బంగారం' ఓ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఓపెనింగ్ డే కలెక్షన్లు 10 కోట్లు దాటాయి. ఏ ఏరియాలో ఎంత? టోటల్ ఎన్ని కోట్లు? అని చూస్తే... 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సమంత 'మా ఇంటి బంగారం' తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 10.70 కోట్లు వసూలు.
  • ఇండియాలో 6.20 కోట్లు, ఓవర్సీస్‌లో 4.50 కోట్లు గ్రాస్ సాధించింది.
  • తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక వసూళ్లు, సినిమాకు మంచి స్పందన.

Maa Inti Bangaram First Day Collections: బాక్సాఫీస్ బరిలోనూ తాను బంగారమే అని సమంత రూత్ ప్రభు నిరూపించారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం'. జూన్ 19న విడుదలైంది. మొదటి రోజు బాక్సాఫీస్ బరిలో అదిరిపోయే కలెక్షన్లను సాధించింది. సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్లు 10 కోట్లు దాటాయి. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయి? టోటల్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందీ సినిమా? వంటి వివరాల్లోకి వెళితే...

'మా ఇంటి బంగారం' ఓపెనింగ్ డే @ 10 కోట్లు ప్లస్!
Maa Inti Bangaram First Day Worldwide Gross Collection: ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 10.70 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది ''మా ఇంటి బంగారం'. ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు ఇది రికార్డ్ స్థాయి ఓపెనింగ్ అని చెప్పాలి. 

  • ఇండియాలో 'మా ఇంటి బంగారం' మొదటి రోజు నెట్ కలెక్షన్స్ విషయానికి వస్తే... రూ. 5.35 కోట్లు సాధించింది. గ్రాస్ కలెక్షన్స్ లెక్క చూస్తే... రూ. 6.20 కోట్లు.
  • ఓవర్సీస్ మార్కెట్టులోనూ 'మా ఇంటి బంగారం' చిత్రానికి అదిరిపోయే ఓపెనింగ్ లభిచింది. మొదటి రోజు 4.50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 150 వేల డాలర్లకు పైగా వసూలు చేసి రికార్డ్ సృష్టించిందీ సినిమా.
  • ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 'మా ఇంటి బంగారం' గ్రాస్ కలెక్షన్స్ రూ. 10.70 కోట్లు దాటాయి.

Also Read: Transfer Trimurthulu Review - ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు రివ్యూ: వడ్డే నవీన్ కమ్‌ బ్యాక్ సినిమా... హిట్టా? ఫట్టా?

సమంతకు తెలుగులో స్ట్రాంగ్ మార్కెట్!
సమంత తెలుగింటి కోడలు. తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆ విషయం చెప్పడానికి 'మా ఇంటి బంగారం' కలెక్షన్లు ఉదాహరణ. ఈ సినిమాకు తెలుగు వెర్షన్ నుంచి రూ. 5.15 కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా... తమిళ వెర్షన్ నుంచి కేవలం రూ. 20 లక్షల నెట్ మాత్రమే వచ్చింది. రాష్ట్రాల వారీగా చూసినా... ఏపీ, తెలంగాణ నుంచి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.75 కోట్ల గ్రాస్ రాగా... కర్ణాటక నుంచి రూ. 90 లక్షలు, తమిళనాడు నుంచి రూ. 38 లక్షలు, కేరళ నుంచి రూ. 2 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 10 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది.

Also Read: Maa Inti Bangaram OTT - సమంత మా ఇంటి బంగారం ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

'మా ఇంటి బంగారం' సినిమా క్రిటిక్స్ రివ్యూలు చూస్తే... సమంత యాక్షన్ మీద ప్రశంసల వర్షం కురిసింది. ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మౌత్ టాక్ కూడా బావుండటంతో రెండో రోజు సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తాయి. రాజ్ నిడిమోరు కథ, స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు.

Also ReadVanda Devullu Review - 'వంద దేవుళ్ళు' రివ్యూ: అమ్మకు మళ్ళీ పెళ్లి... 'బిచ్చగాడు' కాంబినేషన్‌లో లేటెస్ట్ సినిమా - ఎలా ఉందంటే?

Frequently Asked Questions

'మా ఇంటి బంగారం' మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసింది?

'మా ఇంటి బంగారం' చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 10.70 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇది ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకు రికార్డు స్థాయి ఓపెనింగ్.

భారతదేశంలో 'మా ఇంటి బంగారం' మొదటి రోజు కలెక్షన్స్ ఎంత?

భారతదేశంలో 'మా ఇంటి బంగారం' మొదటి రోజు 5.35 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ సాధించింది. గ్రాస్ కలెక్షన్స్ 6.20 కోట్ల రూపాయలు.

'మా ఇంటి బంగారం' ఓవర్సీస్ మార్కెట్లో మొదటి రోజు ఎంత వసూలు చేసింది?

ఓవర్సీస్ మార్కెట్లో 'మా ఇంటి బంగారం' మొదటి రోజు 4.50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 150 వేల డాలర్లకు పైగా వసూలు చేసింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget