Love Me Twitter Review - లవ్ మీ ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజు నట వారసుడి సినిమా ఎలా ఉందంటే?
Love Me premiere shows report: 'దిల్' రాజు ఫ్యామిలీ హీరో, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ నటించిన రెండో సినిమా 'లవ్ మీ'. 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్. ఈ సినిమాకు ఆడియన్స్ రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love Me Telugu Movie Review: 'రౌడీ బాయ్స్'తో 'దిల్' రాజు ఫ్యామిలీ నుంచి ఒక హీరో వచ్చాడు. ఆయన సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆ మూవీ వచ్చిన 2 అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత... నేడు ఆశిష్ రెండో సినిమా 'లవ్ మీ' థియేటర్లలోకి వచ్చింది. అమెరికాలో ప్రీమియర్ షోలు కంప్లీట్ అయ్యాయి. మరి, రిపోర్ట్ ఎలా ఉందో చూద్దామా?
ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్... నేషనల్ అవార్డు విన్నర్ పీసీ శ్రీరామ్ కెమెరా వర్క్... యూత్ బ్లాక్ బస్టర్ 'బేబీ' తర్వాత ఆ హీరోయిన్ వైష్ణవి చైతన్య యాక్ట్ చేసిన సినిమా... వీటన్నిటికీ మించి 'దిల్' రాజు బ్రాండ్... 'లవ్ మీ' సినిమాకు బోలెడు ఎట్రాక్షన్స్ ఉన్నాయి. అయితే అమెరికా నుంచి రిపోర్ట్ మాత్రం అలా లేదు. రివర్స్ కొడుతోంది.
ఇదొక సిల్లీ ఘోస్ట్ లవ్ స్టోరీ!
Love Me First Review: 'లవ్ మీ' ఒక సిల్లీ ఘోస్ట్ లవ్ స్టోరీ అని అమెరికాలో మూవీ చూసిన ఆడియన్ ఒకడు చెప్పాడు. స్టోరీ ఐడియా ఇంట్రెస్టింగ్గా ఉందని అయితే ఎగ్జిక్యూషన్ చాలా బ్యాడ్ అని పేర్కొన్నాడు. సస్పెన్స్ క్రియేట్ చెయ్యడంలో మూవీ డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని స్పష్టం చేశాడు. స్క్రీన్ ప్లే బాలేదని, కన్ఫ్యూజ్ చేసిందని చెప్పాడు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ కూడా ఎఫెక్టివ్ గా లేదన్నాడు. అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదని ముగించాడు.
Also Read: హేమ మూవీల్లోనే ట్రెడిషనల్, బయట బాగా మోడ్రన్... జీన్స్ వేసి లండన్లో షికారు చేసిన ఫోటోలు
#LoveMe is a silly ghost themed loved story that had an interesting core idea but the execution is mostly bad. The director fails to create suspense apart from a few bits in both halves and the screenplay is unconvincing and confusing at times. Music is ineffective. Nothing much…
— Venky Reviews (@venkyreviews) May 25, 2024
విజువల్స్ బావున్నాయి కానీ...
'లవ్ మీ' చూసిన మరొక ఆడియన్ అయితే విజువల్స్ బావున్నాయి కానీ సినిమాలో కన్విక్షన్ మిస్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. క్యారెక్టర్స్ సరిగా డెవలప్ చెయ్యలేదని చెప్పాడు. కన్విన్సింగ్ ప్లాట్ కాదన్నాడు. నావెల్ ఐడియాలు అన్నీ సరిగా స్క్రీన్ మీదకు ట్రాన్సలేట్ కావని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ అని వివరించాడు.
'లవ్ మీ' సినిమా ఫస్టాఫ్లో లవ్ స్టోరీ సిల్లీగా అనిపించిందని అమెరికన్ ఆడియన్స్ చెబుతున్న మాట. లాజిక్ లేని సన్నివేశాలతో ఫ్యూలిష్ స్టోరీ లైన్ మరింత వరస్ట్ అయ్యిందని నెగిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. దెయ్యం కథను ఆసక్తిగా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని అంటున్నారు.
Also Read: పిల్లల ముందు పవిత్రతో బెడ్ రూంలోకి - పెళ్లాన్ని చిత్రహింసలు పెట్టిన సీరియల్ ఆర్టిస్ట్ చందు
యూకేలో ప్రీమియర్ షోస్ క్యాన్సిల్!
'లవ్ మీ' ప్రీమియర్ షోలు అమెరికాలో వేశారు. కానీ, యూకేలో క్యాన్సిల్ అయ్యాయని తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన రీతిలో లేకపోవడంతో షోస్ తీసేశారట. ఏపీ, తెలంగాణలో మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
#LoveMe UK 🇬🇧 premieres Today have been cancelled.
— Milagro Movies (@MilagroMovies) May 24, 2024