Little Hearts 2: 'లిటిల్ హార్ట్స్' సీక్వెల్‌లో డైరెక్టరే హీరో - హీరోయిన్ ఎవరో తెలుసా?
Little Hearts Sequel: యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ 'లిటిల్ హార్ట్స్' సీక్వెల్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. డైరెక్టర్ సాయి మార్తాండ్ పార్ట్ 2లో హీరోగా నటించబోతున్నారు.

Little Hearts Sequel Officially Announced: యంగ్ హీరో మౌళి తనూజ్, శివానీ నాగారం జంటగా నటించిన లేటెస్ట్ యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ 'లిటిల్ హార్ట్స్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రూ.30 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్.
డైరెక్టర్ హీరోగా...
'లిటిల్ హార్ట్స్' మూవీకి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా... సీక్వెల్‌లో ఆయన హీరోగా నటించనున్నారు. ఆయన సరసన ధీరా రెడ్డి హీరోయిన్‌గా నటించనున్నారు. లిటిల్ హార్ట్స్ ఎక్స్‌టెండెడ్ కట్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. 'నో టచింగ్... ఓన్లీ హార్ట్ టచింగ్' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్‌లో హీరో మౌళి తమ్ముడు పెద్దయ్యాక లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌గా సీక్వెల్ తెరకెక్కించనున్నారు. అయితే, ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అన్న దానిపై క్లారిటీ లేదు.
Watch the full uncut version 😂😂
— ETV Win (@etvwin) October 2, 2025
"available only on @etvwin app" pic.twitter.com/ssEseZY5d7
Also Read: అంతా నాశనం..కేసీఆర్, కేటీఆర్ చక్కదిద్దాలి - రాహుల్ రామకృష్ణ ట్వీట్స్ వైరల్ - ఏం కష్టం వచ్చిందంటే ?
ఓటీటీలోకి 'లిటిల్ హార్ట్స్'
ఇక 'లిటిల్ హార్ట్స్' మూవీని దసరా సందర్భంగా ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌లో బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. 'ఎక్స్‌టెండెడ్ కట్స్' యాడ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. మూవీలో మౌళి తనూజ్, శివానీ నాగారం జంటగా నటించగా... రాజీవ్ కనకాల, అనితా చౌదరి, ఎస్ఎస్ కాంచి, సత్య కృష్ణన్, జయకృష్ణ, నిఖిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా... ఈటీవీ విన్ ప్రొడక్షన్ సంస్థ సమర్పణలో బన్నీ వాస్ వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పుడు ఓటీటీలోనూ ట్రెండ్ అవుతోంది.





















