అన్వేషించండి

Kantara Chapter 1 Cast Remunerations: 'కాంతార' Vs 'కాంతార చాప్టర్ 1' - బడ్జెట్ నుంచి రెమ్యునరేషన్స్ వరకూ...

Kantara Chapter 1: 'కాంతార'తో పోలిస్తే 'కాంతార చాప్టర్ 1'కు నిర్మాతలు భారీ బడ్జెట్ కేటాయించారు. ఈ క్రమంలో బడ్జెట్, నటీనటుల రెమ్యునరేషన్ ఎంత అనే దానిపై ఆసక్తి నెలకొంది.

Rishab Shetty's Kantara Chapter 1 Budget Remuneration Details: 'కాంతార చాప్టర్ 1' గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్‌తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. 2022లో వచ్చిన 'కాంతార' మూవీకి ప్రీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కగా ఫస్ట్ పార్ట్‌ను మించి గ్రాండియర్ లుక్, అద్భుతమైన విజువల్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. దీంతో మూవీ బడ్జెట్, నటీనటుల రెమ్యునరేషన్‌పై మరోసారి చర్చ సాగుతోంది.

'కాంతార' Vs 'కాంతార చాప్టర్ 1'

నిజానికి 2022లో 'కాంతార'కు రిలీజ్ టైంలో అంత హైప్ లేదు. ఫస్ట్ కన్నడలో రిలీజ్ అయిన మూవీ మంచి టాక్ సొంతం చేసుకోగా కేవలం మౌత్ టాక్‌తోనే సక్సెస్ అందుకుంది. దీంతో మేకర్స్ ఇతర భాషల్లోనూ రిలీజ్ చేశారు. ఓ ఊరి మట్టి కథతో పాటు సంస్కృతి, సంప్రదాయాలకు డివోషనల్ టచ్ ఇస్తూ తెరకెక్కించిన అద్భుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఫస్ట్ పార్ట్ ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల వసూళ్లు సాధించింది.

ఇదే జోష్‌తో 'కాంతార'కు ప్రీక్వెల్ అనౌన్స్ చేయగా అప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగిన విధంగానే 'కాంతార చాప్టర్ 1' ప్రీక్వెల్ బడ్జెట్ సైతం అమాంతంపెరిగింది. దాదాపు రూ.125 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అడవిలో సెట్స్, భాంగ్రా రాజ్యం సెట్, భారీ యాక్షన్ సీక్వెన్స్, గ్రాండియర్ లుక్స్ కోసం ఎక్కడా తగ్గకుండా చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్, ప్రొడ్యూసర్స్ భారీగా ఖర్చు చేశారు.

నటీనటుల రెమ్యునరేషన్స్

ఫస్ట్ పార్ట్ 'కాంతార' కోసం హీరో రిషబ్ శెట్టి రూ.4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఆయన ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదనే టాక్ వినిపిస్తోంది. దానికి బదులుగా బాలీవుడ్ స్టార్ హీరోల మాదిరిగానే లాభాల్లో వాటాలు తీసుకుంటారని సమాచారం. ఈ మూవీలో రిషబ్ హీరోగా నటిస్తూనే దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు. రిలీజ్ తర్వాత వచ్చే లాభాల్లో వాటా తీసుకునే విధంగా ముందే నిర్మాతలతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది.

ఇక హీరోయిన్ రుక్మిణీ వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య సైతం కీలక రోల్స్ పోషించారు. వీరు ఒక్కొక్కరు రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మూవీలో వారి వారి పాత్రలకు తగిన విధంగా రెమ్యునరేషన్ అందినట్లు సమాచారం. ఫస్ట్ పార్ట్‌ను మించి ప్రీక్వెల్ ఉండడంతో ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఇక క్లైమాక్స్‌లో సీక్వెల్ ఉంటుందని హింట్ ఇవ్వగా దానిపై కూడా అప్పుడే ఆసక్తి నెలకొంది.

Also Read: 'రాజుగారి గది' తలుపులు ఓపెన్ - ఆరేళ్ల తర్వాత హారర్ థ్రిల్లర్‌కు సీక్వెల్...

అటు, రిలీజ్‌కు ముందే 'కాంతార చాప్టర్ 1' భారీ బిజినెస్ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌‌గా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఓటీటీ డీల్ కూడా భారీగానే జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ప్రీమియర్లతో పాటు ఫస్ట్ డే రూ.50 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Embed widget