News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Leo Telugu Distribution : విజయ్ 'లియో'తో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెడుతున్న సితార

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెడుతోంది. విజయ్ 'లియో'తో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. 

FOLLOW US: 
Share:

Sitara Entertainments : ఇటీవలే ధనుష్ 'సార్' (వాతి)తో  తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సితార ఎంటర్టైన్మెంట్స్... బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. విజయవంతమైన సంస్థగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కీలక అడుగు వేయనుంది. తమిళ హీరో దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రాబోతున్న 'లియో'లో భాగస్వామ్యం కానుంది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'లియో' సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా తెలియజేసింది.  

సౌత్ ఇండస్ట్రీలో ఉన్న నిర్మాణ సంస్థలలో సితార ఎంటర్టైన్మెంట్స్ పేరు ముందే ఉంటుంది. చాలా మంది స్టార్ డైరెక్టర్ లతో సినిమాలు చేసిన సితార ఎంటర్టైన్మెంట్స్.. 'రంగ్ దే', 'సార్' లాంటి సినిమాలను నిర్మించాయి. వరుస విజయాలతో బాగానే దూసుకుపోతోన్న సితార ఎంటర్టైన్మెంట్స్.. టాలెంట్ ఉన్న డైరెక్టర్లు, స్టార్ హీరోలు, మంచి స్క్రిప్ట్ లు ఉన్న భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి వెనుకాడటం లేదు. ఇటీవలే బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, హీరో దుల్కర్ సల్మాన్ ల కొత్త చిత్రం కోసం చేతులు కలిపినట్టు వార్తలు వచ్చాయి. క్వాలిటీ అండ్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రాన్ని 2024 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 

'లియో'లో గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ వంటి ప్రముఖ దర్శకులు కూడా నటిస్తుండడం గమనార్హం. మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, మాథ్యూ థామస్, జాఫర్ సాదిక్, మడోన్నా సెబాస్టియన్, అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న తొలి సినిమా కూడా 'లియో'నే కావడం విశేషం. ఇలాంటి సంచలన సినిమాతో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతుండటం సంతోషంగా ఉందని, దళపతి విజయ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని.. ఆయన మార్కెట్, పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని తెలుగులో ఆయన చిత్రాలకు మునుపెన్నడూ లేని విధంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నామని సితార సంస్థ ఈ సందర్భంగా పేర్కొంది.

'లియో' విషయానికొస్తే... 125 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాను ప్రధానంగా కాశ్మీర్‌, చెన్నై నగరాల్లో షూట్ చేశారు. ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రాఫర్ ద్వయం అన్బరివ్ మాస్టర్స్‌ సమకూర్చిన యాక్షన్ సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయని చిత్రం బృందం చెబుతోంది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తుండగా... లోకేష్ కనగరాజ్, అనిరుధ్ కలయికలో ఇది హ్యాట్రిక్ సినిమాగా నిలవనుంది. ఇప్పటికే దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్, అనిరుధ్ కలయికలో 'మాస్టర్' లాంటి సంచలన ఆడియో వచ్చింది. అదే స్థాయిలో దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా 'లియో' నుంచి విడుదలైన 'నా రెడీ' అనే మొదటి పాటకు విశేషమైన స్పందన లభించింది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజైన అన్ని అప్ డేట్ లు.. మూవీపై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. కాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాలో దళపతి విజయ్ తో పాటు త్రిష కృష్ణన్, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, సంజయ్ దత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Read Also : Hiranyakashyap : త్రివిక్రమ్ కథతో 'హిరణ్యకశ్యప' - కామిక్ కాన్ 2023లో అనౌన్స్ చేసిన రానా

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

 

Published at : 19 Jul 2023 06:35 PM (IST) Tags: Leo Sitara entertainments Dhanush vathi Vijay Dalapathy Saar Lokesh Kanakaraj

ఇవి కూడా చూడండి

ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?

ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?

Sai Pallavi: అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్

Sai Pallavi: అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్

‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్ డేట్, ‘సప్త సాగరాలు దాటి’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఏజెంట్’ ఓటీటీ రిలీజ్ డేట్, ‘సప్త సాగరాలు దాటి’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Agent OTT Release Date: ఓటీటీలోకి ‘ఏజెంట్’ ఎంట్రీ - డేట్ ఫిక్స్ చేసిన సోనీ లివ్!

Agent OTT Release Date: ఓటీటీలోకి ‘ఏజెంట్’ ఎంట్రీ - డేట్ ఫిక్స్ చేసిన సోనీ లివ్!

నయనతార సినిమాకి 'A' సర్టిఫికెట్ - ఎటువంటి కట్స్ లేకుండానే రిలీజ్?

నయనతార సినిమాకి 'A' సర్టిఫికెట్ - ఎటువంటి కట్స్ లేకుండానే రిలీజ్?

టాప్ స్టోరీస్

Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు