Happy Birthday Release Date: వారం ముందుకొచ్చిన లావణ్యా త్రిపాఠి 'హ్యాపీ బర్త్ డే'
లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ముందుకు వచ్చింది. జూలై 15న విడుదల చేయాలనుకున్న సినిమాను వారం ముందుకు తీసుకొచ్చారు.
![Happy Birthday Release Date: వారం ముందుకొచ్చిన లావణ్యా త్రిపాఠి 'హ్యాపీ బర్త్ డే' Lavanya Tripathi's Happy Birthday Movie release preponed to July 8th from July 15th Happy Birthday Release Date: వారం ముందుకొచ్చిన లావణ్యా త్రిపాఠి 'హ్యాపీ బర్త్ డే'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/25/dc44751bb8be065b46ade2bc585d4a9c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'హ్యాపీ బర్త్ డే' (Telugu Movie Happy Birthday). 'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తొలుత జూలై 15న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే, ఇప్పుడు ఒక వారం ముందుకు వచ్చారు. జూలై 8న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు ఈ రోజు దర్శక - నిర్మాతలు వెల్లడించారు.
'హ్యాపీ బర్త్ డే' సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తెరకెక్కించింది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. ఆల్రెడీ విడుదల అయిన ప్రచార చిత్రాలకు అద్భుత స్పందన లభిస్తోందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.
Also Read : 'థాంక్యూ' రిలీజ్ డేట్ మారింది - థియేటర్లలోకి చైతూ వచ్చేది ఆ రోజే
ఈ సినిమాలో నరేష్ ఆగస్త్య, సత్య, 'వెన్నెల' కిషోర్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ.
Also Read : 'సమ్మతమే' రివ్యూ: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?
View this post on Instagram
The Sooner, the better!
— LAVANYA (@Itslavanya) June 25, 2022
exciteddd🥳 💃 🪩 #HBDmovieOnjuly8#HAPPYBIRTHDAY https://t.co/XfkdUBf96h
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)