Kushi: ‘ఖుషి’కి ఈ వారం గండమే - ఆ సినిమాల విడుదలతో కలెక్షన్స్‌పై ఎఫెక్ట్!
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖుషి’.. ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో, మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది.
ఓ శుక్రవారం ఒక సినిమా విడుదలయ్యి మంచి కలెక్షన్స్ సాధిస్తే.. మరో శుక్రవారం ఆ సినిమాకు పోటీగా మరికొన్ని సినిమాలు విడుదలవుతాయి. పోటీని దాటుకుంటూ ఒకే చిత్రం.. కలెక్షన్స్ మొత్తాన్ని మూటగట్టుకోవాలంటే కాస్త కష్టమైన విషయమే. గత నెలలో ఒక శుక్రవారం విడుదలయిన అన్ని సినిమాలు కలిసి హిట్‌ను సాధించాయి. కానీ ప్రతీసారి అలా జరగడం అసాధ్యం. అందుకే ప్రస్తుతం ఫుల్ ఫార్మ్‌లో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ‘ఖుషి’ స్పీడ్‌కు బ్రేక్ పడనుంది. మరో వీకెండ్ కూడా ‘ఖుషి’ ఇదే రేంజ్‌లో రన్‌ను కొనసాగిస్తే.. బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ గురువారం విడుదలయ్యే సినిమాలు ఇందుకు గండంగా మారనున్నాయి.
వర్షాలు కూడా కారణమే..
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖుషి’.. ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో, మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు కాస్త నెగిటివ్ టాక్ వచ్చినా కూడా అంతకంటే ఎక్కువ పాజిటివ్ టాక్ అందుతుండడంతో ప్రేక్షకులు ఇప్పటికీ దీనిని థియేటర్లలో చూడడానికి ముందుకొస్తున్నారు. అందుకే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ విషయంలో ‘ఖుషి’ తన సత్తాను చాటుకుంది. సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ కూడా బాగుంటే రూ.100 కోట్ల షేర్‌తో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని మేకర్స్ భావించారు. కానీ ఇంతలోనే వర్షాల కారణంగా కలెక్షన్స్ కాస్త తగ్గాయి. వర్షాలతో పాటు ఇతర సినిమాల తాకిడి కూడా ‘ఖుషి’ కలెక్షన్స్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది.
‘జవాన్’ వస్తున్నాడు..
సెప్టెంబర్ 7న రెండు పెద్ద సినిమాలు భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అవే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’, ‘జవాన్’. ముఖ్యంగా ఈ రెండిటిలో ‘జవాన్’ సినిమా కోసం ఎన్నో థియేటర్లను బ్లాక్ చేశారు మేకర్స్. ఒరిజినల్‌గా ఇది హిందీ సినిమానే అయినా సౌత్ భాషల్లో కూడా విడుదల అవుతోంది. మామూలుగా షారుఖ్ సినిమా విడుదల అవుతుంది అంటే ఇతర హీరోలు ఎవరు పోటీగా తమ సినిమా విడుదల చేయడానికి ముందుకు రారు. ఇప్పుడు ‘జవాన్’ సినిమాకు తెలుగులో కూడా విపరీతమైన హైప్ ఉంది. తమిళ దర్శకుడు అట్లీతో కలిసి షారుఖ్ చేస్తున్న సినిమా కాబట్టి ప్రతీ భాషా ప్రేక్షకులలో ‘జవాన్’పై భారీ అంచనాలే ఉన్నాయి. అంతే కాకుండా ప్రీ బుకింగ్స్ విషయంలో కూడా ఇప్పటికే ఈ మూవీ పలు రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో పాటు ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రిలీజ్ కూడా ‘ఖుషి’పై తీవ్ర ప్రభావం చూపించనుంది.
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో కూడా పోటీ..
అనుష్క శెట్టికి తెలుగులో చాలా ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఈ భామ చాలాకాలంగా వెండితెరపై కనిపించడం మానేసింది. ఎన్నో ఏళ్ల తర్వాత తను హీరోయిన్‌గా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.. సెప్టెంబర్ 7న విడుదల అవుతుండడంతో అనుష్క ఫ్యాన్స్ అంతా మూవీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పైగా ఇందులో హీరోగా నటించిన నవీన్ పోలిశెట్టి కూడా సింగిల్ హ్యాండెడ్‌గా కావాల్సిన ప్రమోషన్స్‌ను పూర్తి చేశాడు. ప్రస్తుతం మూవీ లవర్స్ అంతా ‘జవాన్’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ‘ఖుషి’కి వెళ్లే ఆడియన్స్ సంఖ్య పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అలా జరిగితే.. సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ దగ్గర నుండే ‘ఖుషి’ వీక్ అయిపోయి.. బ్రేక్ ఈవెన్ కూడా సాధించకుండా ఫ్లాప్ మూటగట్టుకునే అవకాశం ఉంది.
Also Read: కన్నడ నటి దివ్య స్పందన గుండెపోటుతో చనిపోయారంటూ పుకార్లు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial