ఖండాలు దాటిన మహేష్ క్రేజ్ - 'కుర్చీ మడతపెట్టి' పాటకి డ్యాన్స్ అదరగొట్టిన ఆఫ్రికన్ చిన్నారులు, వీడియో వైరల్!
మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాలోని కుర్చీ మడత పెట్టి పాటకు కొందరు ఆఫ్రికన్ చిన్నారులు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
African Children Dance On Kurchi Madathapetti Song : సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీ లీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గుంటూరు కారం' సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా ఆశించిన స్థాయిలో లేకపోయినా పాటలు మాత్రం రిలీజ్ కు ముందే చార్ట్ బస్టర్ అయ్యాయి. తమన్ ఈ సినిమా కోసం కంపోజ్ చేసిన సాంగ్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమాలో 'కుర్చీ మడత పెట్టి' అనే పాట ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించడమే కాకుండా సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో బాగా ట్రెండ్ అయింది. ఇప్పటికీ ఎక్కడో చోట ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. రీసెంట్ గా అమెరికా నేషనల్ బాస్కెట్ బాక్ గేమ్స్ లో కొందరు అమెరికన్స్ ఈ పాటకు మాస్ డాన్స్ తో అదరగొట్టగా.. ఇప్పుడు ఏకంగా ఆఫ్రికన్ పిల్లలు ఇదే పాటకి అదిరిపోయే స్టెప్పులు వేశారు.
'కుర్చీ మడతపెట్టి' సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులేసిన ఆఫ్రికన్ చిన్నారులు
'గుంటూరు కారం' సినిమా ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అయింది. అంటే రీజినల్ మూవీగా ఈ సినిమాని విడుదల చేశారు. కానీ ఈ సినిమాలోని పాటలు మాత్రం దేశ, విదేశాల్లోనూ మారుమోగిపోతున్నాయి. 'గుంటూరు కారం'లోని కుర్చీ మడత పెట్టి సాంగ్ ఇప్పుడు ఏకంగా ఖండాలు దాటేసింది. తాజాగా కొందరు ఆఫ్రికన్ చిన్నారులు కుర్చీ మడతపెట్టి సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేశారు. పాటలో మ్యూజిక్ కి తగ్గట్లు డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. గ్రూప్ లో ఓ అమ్మాయి శ్రీలీల స్టెప్పులకు తగ్గట్టుగా డాన్సులు చేస్తే.. మిగతా పిల్లలు మహేష్ బాబు స్టైల్ ఫాలో అవుతూ డ్యాన్స్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.
From “Smash Talent Foundation Kids”, AFRICA 😯🔥#KurchiMadathapetti goes Global 🌍 #MaheshBabu | #GunturKaaram
— VardhanDHFM (@_VardhanDHFM_) April 13, 2024
My Hero @urstrulymahesh 👑 pic.twitter.com/rzkgxzQcCr
నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఇంగ్లీష్ లో కూడా
'గుంటూరు కారం' సినిమాని థియేటర్స్ లో కేవలం తెలుగులోనే రిలీజ్ చేశారు. కానీ ఓటీటీలో మాత్రం తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. దాంతో అన్ని భాషల ఆడియన్స్ కోసం అందుబాటులోకి తెచ్చారు. కాగా ఓటీటీలో ఈ సినిమా భారీ వ్యూస్ తో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా హిందీ, ఇంగ్లీష్ వెర్షన్స్ కి భారీ ఆదరణ లభించింది. హిందీ వెర్షన్ అయితే వరుసగా రెండు వారాలపాటు టాప్ టెన్ నాన్ ఇంగ్లీష్ కేటగిరిలో నిలిచి అరుదైన ఘనత సాధించింది. కాగా 'గుంటూరు కారం' సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించారు. రమ్యకృష్ణ, మీనాక్షి చౌదరి, ప్రకాష్ రాజ్, ఈశ్వరి రావు, జయరాం, జగపతిబాబు, రావు రమేష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు.
Also Read : 'దేవర'తో బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ - వైరల్ అవుతున్న సెల్ఫీ!