Kota Srinivasa Rao: విలక్షణ నటుడికి తుది వీడ్కోలు... ముసిగిన కోట శ్రీనివాస రావు అంత్యక్రియలు
Kota Srinivasa Rao Final Rites: విలక్షణ నటుడికి చిత్రసీమ తుది వీడ్కోలు పలికింది. అశ్రు నయనాల మధ్య భువి నుంచి దివికి వెళ్లిన కోట శ్రీనివాస రావు అంత్యక్రియలు ముగిశాయి.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ అత్యుత్తమ ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయింది. కోట శ్రీనివాస రావు (Kota Srinivasa Rao Death News Latest Update) మరణంతో చిత్రసీమ విషాదంలోకి వెళ్ళింది. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని పలువురు నటులు కన్నీటి పర్యంతం అయ్యారు. అశ్రు నయనాల మధ్య కోట శ్రీనివాస రావుకు తుది వీడ్కోలు పలికింది తెలుగు సీమ.
ముగిసిన అంత్యక్రియలు...
కోట పెద్ద మనవడి చేతుల మీదుగా!
కోట శ్రీనివాస రావుకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. ఆయన తనయుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ కొన్నేళ్ల క్రితం మరణించారు. అందువల్ల, పెద్ద మనవడు శ్రీనివాస్ (కోట ప్రసాద్ తనయుడు) చేతుల మీదుగా అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు.
Also Read: డెడ్ బాడీ దగ్గర సెల్ఫీలు ఏంటి? బుద్ధి ఉందా? కోట ఇంటి వద్ద రాజమౌళి అసహనం
హైదరాబాద్ సిటీలోని జూబ్లీ హిల్స్ ఏరియాలో గల కోట శ్రీనివాస రావు నివాసం నుంచి మహా ప్రస్థానం వరకు అంతిమ యాత్ర జరిగింది. కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కన్నీటితో కడసారి వీడ్కోలు పలికారు. మహా ప్రస్థానంలోని మనవడి చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
మహా ప్రస్థానంలో కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు..
— ChotaNews App (@ChotaNewsApp) July 13, 2025
కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు, సినీ ప్రముఖులు pic.twitter.com/DhnvsKmgqn
ప్రధాని నుంచి సీఎం వరకు...
కోట శ్రీనివాస రావుకు నివాళులుకోట శ్రీనివాస రావు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు కోట శ్రీనివాస రావు పార్థీవ దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
Also Read: కొడుకుతో కలిసి ఒకే ఒక్క సినిమా చేసిన కోట శ్రీనివాస రావు... అది ఏమిటో తెలుసా?
Anguished by the passing of Shri Kota Srinivas Rao Garu. He will be remembered for his cinematic brilliance and versatility. He enthralled audiences across generations with his riveting performances. He was also at the forefront of social service and worked towards empowering the…
— Narendra Modi (@narendramodi) July 13, 2025
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, దర్శక ధీరుడు రాజమౌళి, నటకిరీటి డా రాజేంద్ర ప్రసాద్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, రానా దగ్గుబాటి, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి సహా పలువురు సినీ ప్రముఖులు సైతం నివాళులు అర్పించారు. కోట పార్థీవ దేహాన్ని చూసి బ్రహ్మానందం కన్నీటి పర్యంతం అయ్యారు. తన ఆప్తమిత్రుడు తనను వదిలి వెళ్లిపోయాడని బాబూ మోహన్ ఎమోషనల్ అయ్యారు.
Also Read: చిరంజీవి... నారాయణమూర్తి... కోట శ్రీనివాస రావు... ముగ్గురికీ ఆ సినిమా స్పెషల్ - ఎందుకో తెలుసా?





















