అన్వేషించండి

Jr NTR on Koratala Siva: కొరటాల పక్కన సరైన వ్యక్తులు ఉంటే బ్లాక్ బస్టర్స్ ఇస్తాడు - మెగా ఫ్యాన్స్‌కు మంట పెట్టేలా ఎన్టీఆర్ మాటలు

Devara Trailer Release: దేవర ట్రైలర్ లాంచ్‌లో కొరటాల శివ గురించి హీరో ఎన్టీఆర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొరటాల లాస్ట్ సినిమా ఫలితానికి, అతనికి సంబంధం లేదన్నట్టు ఉన్నాయి. 

కొరటాల శివ తన కెరీర్‌లో దాదాపు అన్నీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. మిర్చి నుంచి మొదలుకొని తన బ్రాండ్ మార్క్‌తో ముందుకు వెళ్తూ వచ్చాడు. అయితే కొరటాల సక్సెస్ కెరీర్‌కు ఆచార్య అడ్డు కట్ట వేసింది. ఆచార్య మూవీ భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించడంతో అంచనాలు తారా స్థాయికి వెళ్లాయి. వాటికి తగ్గట్టుగా సినిమా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. కర్ణుడి చావుకు వంద కారణాలున్నట్టు... ఆచార్య ఫ్లాప్‌కు ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు.

కొరటాల శివ తన 'ఆచార్య' కథను పూర్తిగా మార్చేశాడని ఓ టాక్. అసలు ఆ కథ కూడా కొట్టేసిందే అనే చర్చ కూడా జరిగింది. తాను చెప్పిన కథను అటూ ఇటూ మార్చి ఆచార్యగా తీస్తున్నారంటూ రాజేష్ అనే రచయిత రచ్చ చేసిన సంగతి తెలిసిందే. తనకు జరిగిన అన్యాయం గురించి చెబుతూ మీడియా చుట్టూ రాజేష్ తిరిగాడు. ఆయన చెప్పిన పాయింట్‌ను బేస్ చేసుకునే కొరటాల ఆచార్య కథను అల్లినట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ కాపీ విమర్శలు వస్తాయని అనుకున్నాడో ఏమో.. బాగానే మార్పులు చేర్పులు చేసినట్టు అనిపిస్తుంది. ఇక చిన్నగా గెస్ట్ మాదిరి ఉన్న రోల్‌ను రామ్ చరణ్ కోసం సాగదీసినట్టుగా కనిపిస్తుంది. ఇవన్నీ రచయితగా కొరటాల శివ లోపాలని విమర్శించినా వ్యక్తులు ఉన్నారు. 


చివరకు హీరోయిన్‌గా పెట్టుకున్న కాజల్ పార్ట్‌ని కూడా లేపేశారు. ఇలా ఆచార్య చిత్రానికి సంబంధించి కొరటాల చాలానే మిస్టేక్స్ చేశాడు. మేకింగ్ మాత్రమే కాకుండా బిజినెస్ మీద కూడా ఫోకస్ పెట్టాడు కొరటాల. ఆచార్య ఫ్లాప్ తరువాత చాలా మంది అది మెగా కాంపౌండ్ వల్లే ఫ్లాప్ అయిందని, కొరటాలను డైరెక్షన్ చేయనివ్వలేదని విమర్శించారు. కానీ ఇప్పుడు దేవర ట్రైలర్ చూస్తే మ్యాటర్ మళ్లీ మొదటికి వచ్చినట్టు అనిపిస్తుంది. దేవర ట్రైలర్ చూస్తుంటే ఆచార్య సినిమా గుర్తుకు వస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

'ఆచార్య'లో వాడిన డైలాగ్స్, థీమ్, షాట్స్, ఫ్రేమ్స్ అన్నీ కూడా 'దేవర'లో కనిపించాయని విజువల్స్ తీసి మరీ సోషల్ మీడియాలో షేర్స్ చేస్తున్నారు. . చూస్తుంటే దేవర ఫలితం తేడా కొట్టేలా ఉందని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ మీద జరుగుతున్న ట్రోలింగ్ ప్రస్తుతం అందరికీ తెలిసిందే.

Also Read: జాన్వీ కపూర్ కట్టిన చీర రేటు ఎంతో తెలుసా? ఇయర్ రింగ్స్ 13 లక్షలు ఏంటి బాసూ!


'దేవర' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ముంబైలోని మీడియాతో ఎన్టీఆర్ కొరటాల జర్నీ గురించి చెప్పారు. ''కొరటాల తన కెరీర్‌లో బ్లాక్ బస్టర్స్ ఇస్తూనే వచ్చాడు.. సరైన స్పేస్.. సరైన మనుషులు కొరటాల చుట్టూ ఉంటే బ్లాక్ బస్టర్ ఇస్తాడు'' అని ఎన్టీఆర్ అన్నాడు. అంటే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సరైన వ్యక్తులు కాదా? నీ ఉద్దేశం ఏంటి? ఎన్టీఆర్ మీద మెగా ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ మాటలు అయితే నెట్టింట్లో మంటలు పెట్టేసేలా ఉన్నాయి.

Also Readషాక్ ఇచ్చిన రష్మిక... నెల తర్వాత తీరిగ్గా యాక్సిడెంట్, రికవరీ గురించి రివీల్ చేసిందిగా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget