Konda Movie Release Date: రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తెలంగాణ రాజకీయ సినిమా 'కొండా' విడుదల ఎప్పుడంటే?
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా 'కొండా'. ఈ నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ 'శివ' తీశారు. ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేశారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో 'రక్త చరిత్ర' వంటి సినిమాలు తీశారు. ముంబై మాఫియా నేపథ్యంలో 'సత్య', 'సర్కార్', 'కంపెనీ' వంటి చిత్రాలు చేశారు. వెండితెరపైకి వాస్తవ కథలను వర్మ తీసుకొచ్చిన ప్రతిసారీ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయ నేపథ్యంలో ఆయన సినిమా తీశారు.
విద్యార్థి నాయకులుగా ప్రయాణం ప్రారంభించి... ఆ తర్వాత నక్సలిజం వైపు ఆకర్షితులై... తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన కొండా మురళి జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా 'కొండా'. మురళి, ఆయన సతీమణి సురేఖ జీవితాలలో ఒడిదుడుకులు, పోరాటాలను ఇందులో చూపించనున్నారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. జూన్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తోందీ సినిమా. ఈ రోజు 'కొండా' రెండో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు.
Also Read: 'విక్రమ్' రివ్యూ: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
కొండా మురళి, సురేఖపై సినిమా చేయాలనుకుంటున్నట్లు సంప్రదించగా... తానే చిత్రాన్ని నిర్మిస్తానని వాళ్ళ అమ్మాయి సుష్మితా పటేల్ ముందుకు వచ్చారని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. రాము గారు చాలా రియలిస్టిక్‌గా సినిమా తీశారని, త్రిగుణ్ అద్భుతంగా నటించారని కొండా సుష్మితా పటేల్ చెప్పారు. తాను ఈ విధమైన యాక్షన్ రోల్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని త్రిగుణ్ తెలిపారు.
Also Read: 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు, సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఎలా ఉందంటే?
View this post on Instagram