KonaSeema Thugs Movie : తెలుగులోకి 'కోనసీమ థగ్స్'గా...
Konaseema Thugs Trailer : కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకురాలిగా చేస్తున్న తాజా సినిమా 'థగ్స్'. తెలుగులోకి 'కోనసీమ థగ్స్'గా రానుంది. ట్రైలర్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రముఖ నృత్య దర్శకురాలు బృందా గోపాల్ (Brinda Gopal) ఇప్పుడు పాటలతో పాటు సినిమాలకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరి హీరో హీరోయిన్లుగా నటించిన 'హే సినామికా'తో ఆమె దర్శకురాలిగా పరిచయం అయ్యారు. అదొక న్యూఏజ్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీ. ఇప్పుడు ఆమె రా అండ్ యాక్షన్ ఫిల్మ్ తీస్తున్నారు. అది 'థగ్స్'.
ఇది పాన్ ఇండియా సినిమా!
బృందా మాస్టర్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'థగ్స్' (Thugs Movie 2022). ఇందులో బాబీ సింహ (Bobby Simha), ఆర్.కె. సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య తారాగణం. హ్రిదు హరూన్ హీరో.
Konaseema Thugs Trailer : తెలుగులోకి ఈ సినిమాను 'కోనసీమ థగ్స్'గా తీసుకు వస్తున్నారు. జనవరి 27న... అంటే శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. సంక్రాంతికి విడుదలైన 'వాల్తేరు వీరయ్య'లో బాబీ సింహా నటించారు. ఆ సినిమా తర్వాత తెలుగులోకి వస్తున్న ఆయన చిత్రమిదే.
హ్రిదు హరూన్ కథానాయకుడిగా నటిస్తున్న తొలి సినిమా 'థగ్స్'. ఆయన వెండి తెరకు పరిచయం అవుతున్న చిత్రమిది. అంటే... హీరోగా సిల్వర్ స్క్రీన్ మీద తొలి సినిమా. కానీ, నటుడిగా కాదు! అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చిన క్రాష్ కోర్స్ వెబ్ సీరీస్ (Crash Course Web Series) లో హ్రిదు హరూన్ నటించారు. అందులో సత్య శ్రీవత్సన్ పాత్రలో కనిపించారు. త్వరలో విడుదల కానున్న 'మంబైకర్'లో కూడా ఆయన నటించారు.
ఫిబ్రవరిలో 'థగ్స్' రిలీజ్
Thugs Movie Release : 'థగ్స్'లో ఎక్కువ మంది తమిళ నటీనటులు ఉన్నారు. బాబీ సింహా, హ్రిదు హరూన్‌లకు నేషనల్ లెవల్‌లో రికగ్నైజేషన్ ఉంది. ఈ సినిమాను హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్టు చెప్పారు. 'థగ్స్' మ్యూజిక్ హక్కులను సోనీ మ్యూజిక్ సంస్థ సొంతం చేసుకుంది.
Also Read : 'హంట్' రివ్యూ : షాక్ ఇచ్చిన సుధీర్ బాబు, సినిమా ఎలా ఉందంటే?
'థగ్స్' చిత్రాన్ని రా అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్టు నిర్మాత రియా షిబు తెలిపారు. హెచ్.ఆర్. పిక్చర్స్ పతాకంపై ఈ ఇసినిమా రూపొందుతోంది. విజయ్ 'పులి', విక్రమ్ 'ఇంకొక్కడు', 'సామి స్క్వేర్'తో పాటు హిందీ సినిమా 'ముంబైకర్' నిర్మించిన శిబు తమీన్స్ కుమార్తే రియా షిబు. తమిళంలో 'ఆర్ఆర్ఆర్', 'విక్రమ్', 'డాన్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను హెచ్.ఆర్. పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది.
Also Read : పద్మ అవార్డుల్లో మరోసారి తెలుగు చిత్రసీమకు అన్యాయం - కైకాల, జయసుధ ఎక్కడ?
'థగ్స్'లో మెయిన్ లీడ్స్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభించిందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. ఆ వీడియో సినిమాపై అంచనాలు పెంచిందని పేర్కొంది. ఈ చిత్రానికి శామ్ సి.ఎస్ స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తుండగా... 'ఆర్ఆర్ఆర్' ప్రోమో ఎడిటర్‌గా పాపులర్ అయిన ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ప్రాజెక్ట్ డిజైనర్ : జోసెఫ్ నెళ్లికల్, యాక్షన్ : ఫీనిక్స్ ప్రభు, రాజశేఖర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : ముత్తు కురుప్పయ్య, కాస్ట్యూమ్స్ : మాలిని కార్తికేయన్.