Vishal Political Comments: దళపతి విజయ్ బాటలో మరో కోలీవుడ్ హీరో - 2026 ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ విశాల్ సంచలన ప్రకటన!
Vishal: హీరో విశాల్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న అతడు త్వరలోనే పార్టీ స్థాపించి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్వయం ప్రకటించాడు.
Kollywood Actor Vishal About His Political Entry : కోలీవుడ్ అగ్ర హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ కొత్త పార్టీని ప్రకటించడం ఇటీవల తమిళనాట ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. 'తమిళగ వెట్రి కళగం' అనే పేరుతో సొంత పార్టీని ప్రకటించి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు విజయ్ ప్రకటించడం ఇతర పార్టీలకు భారీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు విజయ్ దారిలోనే మరో కోలీవుడ్ స్టార్ తాజాగా సంచలన ప్రకటన చేశాడు. అతను మరెవరో కాదు తమిళ హీరో విశాల్. ఇతను కూడా త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నట్లు స్వయంగా ప్రకటించడంతో పాటు సొంతంగా పార్టీ కూడా పెడతానని చెప్పడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది.
నేను రాజకీయాల్లోకి వస్తున్నా - విశాల్
తమిళ హీరో విశాల్ తన పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో తన రాజకీయ అరంగేట్రం పై క్లారిటీ ఇచ్చాడు. "త్వరలోనే నేను రాజకీయాల్లోకి వస్తున్నా. సొంతంగా పొలిటికల్ పార్టీని స్థాపించి 2026 లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా" అని స్పష్టం చేశాడు.
ఆ ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి..
తాజా ప్రెస్ మీట్ లో విశాల్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో రాజకీయాలకు ఎందుకు వస్తున్నారని అడిగితే అందుకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "ప్రస్తుతం ప్రజలకు సరైన వసతులు లేవు. వారికి సేవ చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ఆ ఉద్దేశంతోనే నేను రాజకీయాలకు వస్తున్నా" అని తెలిపాడు.
ఆ తర్వాతే పొత్తు గురించి ఆలోచిస్తా
ఏ రాజకీయ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? అని అడిగితే.. "అలాంటిది ఏమీ లేదు. ముందు నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నా. ఆ తర్వాతే మిగిలిన విషయాలు, పొత్తు గురించి ఆలోచిస్తా" అని సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం విశాల్ చేసిన ఈ వ్యాఖ్యలు కోలీవుడ్ ఇండస్ట్రీ అంటూ తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.
'రత్నం' తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
విశాల్ గత ఏడాది 'మార్క్ ఆంటోనీ' మూవీతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ కోలీవుడ్లో 100 కోట్ల వసూళ్లు సాధించి విశాల్ కి మంచి కం బ్యాక్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం కోలీవుడ్ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో 'రత్నం' సినిమా చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విశాల్ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. సముద్రఖని, గౌతమ్ మీనన్, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని జీ స్టూడియోస్ సమర్పణలో స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్ పై కార్తికేయన్ సంతానం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 26న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాని తమిళ, తెలుగు భాషల్లో ఒకేరోజు విడుదల చేయబోతున్నారు.
Also Read : నయనతారకు ఆహ్వానం పలికిన 'డియర్ స్టూడెంట్స్' టీమ్ - మలయాళ హీరోతో జతకట్టిన లేడీ సూపర్ స్టార్!