Vishal 35 Movie: ఇట్స్ అఫీషియల్ - డిఫరెంట్ రోల్... డిఫరెంట్ టైటిల్... ఆసక్తికరంగా విశాల్ కొత్త మూవీ
Makutam Movie: స్టార్ హీరో విశాల్ తన కొత్త మూవీ టైటిల్‌ను తాజాగా అనౌన్స్ చేశారు. ఆయన కెరీర్‌లో ఇది 35వ సినిమా కాగా... 'మకుటం' అంటూ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్నారు.

Vishal's New Movie Title Teaser Out: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన కొత్త మూవీ టైటిల్‌ను తాజాగా అనౌన్స్ చేశారు. రవి అరసు దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ షూటింగ్ జులైలో ప్రారంభం కాగా టైటిల్, స్టోరీపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఆ సస్పెన్స్ బ్రేక్ చేస్తూ టైటిల్ టీజర్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.
డిఫరెంట్ రోల్... డిఫరెంట్ టైటిల్
విశాల్ కెరీర్‌లో ఇది 35వ సినిమా కాగా... ఈ ప్రాజెక్టుకు డిఫరెంట్‌గా 'మకుటం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దుషారా విజయన్ హీరోయిన్‌గా నటిస్తుండగా... అంజలి కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. పలు సూపర్ హిట్ చిత్రాలు అందించిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మిస్తుండగా ఆ సంస్థకు ఇది 99వ సినిమా. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Here we go. It’s time to reveal the TITLE of my next film. Presenting to all you darlings all over the world The official #TitleTeaser of #Vishal35 & #SGF99 hope u all enjoy it. God bless#MAKUTAM #మకుటం ⚓🔥💥
— Vishal (@VishalKOfficial) August 24, 2025
▶️ https://t.co/OzfW6Z7XTI
A @gvprakash Musical! 🎼… pic.twitter.com/pf06Ncdcy8
Also Read: కాంతార చాప్టర్ 1... తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బిజినెస్ డీల్ - టాలీవుడ్ టాప్ హీరోలకు ఈక్వెల్
అసలేంటీ 'మకుటం'?
ఇదివరకు ఎన్నడూ చూడని ఓ డిఫరెంట్ రోల్‌లో విశాల్‌ను చూడబోతున్నట్లు టైటిల్ టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. 'మకుటం' అంటే కిరీటం అని అర్థం. సముద్రం, పోర్ట్ ఏరియాలో ఓ డాన్ పాత్రలో విశాల్ కనిపిస్తారనే చర్చ సాగుతోంది. టీజర్ ప్రారంభంలోనే చేపలు, భారీ సొరచేపతో పాటు ఆక్టోపస్ ఓ భారీ ఓడను చూపించగా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. పోర్ట్ ఏరియాలో జనం కేకలు, కేరింతల మధ్య బ్యాక్ డ్రాప్‌లో విశాల్ వింటేజ్ లుక్ అదిరిపోయింది. మొత్తానికి 'మకుటం' అనే టైటిల్‌తో సస్పెన్స్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇక ఈ మూవీలో అంజలి కీలక పాత్ర పోషిస్తుండగా... విశాల్, అంజలి కాంబోలో ఇది రెండో సినిమా. గతంలో 'మద గజ రాజా' మూవీలో వరలక్ష్మి, అంజలిలతో కలిసి విశాల్ నటించగా... మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా భారీ హిట్ కావడం ఖాయమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.






















